Ira Jadhav: ప్రపంచంలో క్రికెట్ కి అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. అందులో భారత్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైన ఈ ఆట.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను ఆకర్షించింది. ఈ క్రికెట్ అంటేనే ఎంతో ఆసక్తికరమైన ఆట. ఇందులో ఎప్పుడు ఏం జరుగుతుందో..? తెలియని ఉత్కంఠ. అప్పటివరకు గెలుస్తుంది అనుకున్న జట్టు అంతలోనే ఓడిపోవచ్చు.. ఓటమి అంచుల్లో ఉన్న జట్టు ఒక్కసారిగా విజయాన్ని అందుకోవచ్చు.
Also Read: Rohit Sharma: నా వల్ల కాదు.. టీమిండియాకు కొత్త కెప్టెన్ ను పెట్టుకోండి !
ఇలా క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు అని చెబుతూ ఉంటారు. ఈ క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన రికార్డులు కూడా నమోదు అవుతూ ఉంటాయి. క్రికెట్ లో ఒకరి రికార్డుని మరొకరు బ్రేక్ చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే అండర్ – 19 ఉమెన్స్ వన్డే ట్రోఫీలో ఓ సంచలన రికార్డు క్రియేట్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహిళల అండర్ – 19 వన్డే ట్రోఫీలో ముంబై క్రీడాకారిని ఇరా జాదవ్ తన బ్యాట్ తో సంచలనం సృష్టించింది. ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాధింది.
దీంతో భారత్ తరపున ఏ ఫార్మాట్ లోనైనా అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్ గా ఇరా చరిత్ర సృష్టించింది. ఆదివారం బెంగుళూరులోని ఆలూరు క్రికెట్ మైదానంలో ముంబై మరియు మేఘాలయ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ అండర్ 19 మహిళల వన్డేలో 14 ఏళ్ల ఇరా జాదవ్ ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో ముంబై తరపున బ్యాటింగ్ ప్రారంభించిన జాదవ్.. స్మృతి మందాన రికార్డును బద్దలుకొట్టింది.
తన ఇన్నింగ్స్ లో 47 ఫోర్లు, 16 సిక్సులతో మేఘాలయ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఈ టీనేజర్ మొత్తం గా 157 బంతులలో 346 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది. దీంతో ముంబై జట్టు 50 ఓవర్లలో 563 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. వన్డే టోర్నమెంట్ లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన మొదటి మహిళగా నిలిచింది. ఇప్పటివరకు ఈ ట్రిపుల్ సెంచరీలను కేవలం టెస్ట్ క్రికెట్ లో మాత్రమే చూసి ఉంటారు. ఇప్పుడు వన్డేలలో కూడా ట్రిపుల్ సెంచరీ రికార్డ్ నమోదు చేసింది ఇరా.
ఈ రికార్డ్ పురుషుల క్రికెట్ లో కేవలం ఒకటి మాత్రమే ఉంది. 2024వ సంవత్సరం ఏప్రిల్ నెలలో బీహార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన రణధీర్ వర్మ అండర్ – 19 వన్డే మ్యాచ్ లలో సమస్తిపూర్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ త్రిబుల్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డుని సొంతం చేసుకున్నాడు.
Also Read: Virat Kohli – Anushka Sharma: ముంబైలో కోహ్లీ.. ఆ మిస్టరీ లేడీ భుజాలపై చేయి.. వీడియో వైరల్ !
ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక వన్డేలో 264 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇక ప్రస్తుతం ఉమెన్స్ వన్డే ట్రోఫీలో ముంబై క్రీడాకారిని ఇరా జాదవ్ ట్రిపుల్ సెంచరీ చేసి సంచలన రికార్డు క్రియేట్ చేసింది. కాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ – 2025 వేలంలో ఇరా జాదవ్ అన్ సోల్డ్ గా మిగలడం గమనార్హం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో భాగంగా ఈ ముంబై బ్యాటర్ బేస్ ధర 10 లక్షలు కాగా.. అన్ సోల్డ్ గా మిగలడం గమనార్హం.
Record Alert 🚨
Ira Jadhav of Mumbai has smashed the highest individual score in Women’s Under 19 One Day Trophy history 🔥
She scored 346* (157) against Meghalaya in Bangalore, powering Mumbai to a massive 563/3 👌👌@IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/Jl8p278OuG pic.twitter.com/0dMN6RKeHD
— BCCI Domestic (@BCCIdomestic) January 12, 2025