BigTV English

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Easy Egg Recipes: మనలో చాలా మంది ఎగ్స్ తో తయారు చేసిన రెసిపీస్ అంటే ఇష్టం ఉంటుంది. చాలా తక్కువ సమయంలో ఎగ్స్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఎగ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు అధిక మోతాదులో ఉండటం వల్ల తరచుగా ఎగ్స్ తినడం వల్ల శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి.అంతేకాకుండా.. ఎగ్స్‌ను ఉపయోగించి తక్కువ సమయంలో.. తక్కువ పదార్థాలతో ఎన్నో రకాల వంటకాలు తయారు చేయవచ్చు. చాలా మందికి ఎగ్ తో వంటకాలు చేయడం ఇష్టం. కానీ ఏమి వండాలో తెలియదు. అలాంటి వారికోసం కేవలం కొన్ని పదార్థాలతో సులభంగా తయారు చేసుకోగలిగే 3 రకాల ఎగ్ రెసిపీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. ఆమ్లెట్ కర్రీ:
సాధారణంగా ఆమ్లెట్‌ను అప్పటికప్పుడు వేసుకుని తింటాం. కానీ అదే ఆమ్లెట్‌ను కూరలా చేసుకుని తింటే.. దాని రుచి అద్భుతంగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు:


గుడ్లు – 2

ఉల్లిపాయ – 1 (చిన్నది)

పచ్చిమిర్చి – 1

అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర స్పూను

ఉప్పు, కారం – రుచికి సరిపడా

పసుపు – చిటికెడు

నూనె – సరిపడా

తయారీ విధానం:

మొదట ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టి.. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి గుడ్డు మిశ్రమాన్ని వేసి ఆమ్లెట్‌లా వేసుకోవాలి. వేగనిచ్చిన తర్వాత ఆమ్లెట్‌ను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అదే పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి, కొద్దిగా నీళ్లు పోయాలి. గ్రేవీ కొద్దిగా చిక్కబడిన తర్వాత.. ముందుగా కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేయాలి. ఈ ఆమ్లెట్ కర్రీ అన్నం లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది.

2. ఎగ్ పచ్చడి:
ఎగ్‌తో పచ్చడి చాలా తక్కువ సమయంలో చేయొచ్చు. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు:

గుడ్లు – 2

ఉల్లిపాయ – 1 (పెద్దది)

పచ్చిమిర్చి – 2

నూనె, ఉప్పు, కారం – సరిపడా

తయారీ విధానం:

గుడ్లను ఉడికించి, పై తొక్కు తీసి పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక… తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అందులో కారం, ఉప్పు వేసి బాగా కలిపి, స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఉడికించిన గుడ్లను మెత్తగా చేసి ఉల్లిపాయ మిశ్రమంలో కలపాలి. అంతే.. రుచికరమైన గుడ్డు పచ్చడి రెడీ. ఇది తక్కువ సమయంలో తయారు చేయగలరు.

3. ఎగ్ బుర్జి:
ఎగ్ బుర్జి అనేది పరాటాల్లోకి, రోటీల్లోకి చాలా బాగుంటుంది.

కావాల్సిన పదార్థాలు:

గుడ్లు – 2

ఉల్లిపాయ – 1 (చిన్నది)

పచ్చిమిర్చి – 1

నూనె, ఉప్పు, కారం – సరిపడా

Also Read: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

తయారీ విధానం:
ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా గిలకొట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అందులో ఎగ్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఎగ్ మిశ్రమం పొడిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చివర్లో కాస్త మసాలా, కొత్తిమీర వేయాలి. అంతే రుచికరమైన ఎగ్ బుర్జి రెడీ.

ఈ మూడు వంటకాలు తక్కువ సమయంలో.. ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవచ్చు. ఈ వంటకాలు చేసి మీ కుటుంబ సభ్యులకు వడ్డించండి.

Related News

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Alcohol: 30 రోజులు ఆల్కహాల్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Masala Vada: మాసాలా వడ బయట తిన్నట్లే క్రిస్పీగా రావాలంటే.. ఇలా ట్రై చేయండి

Big Stories

×