BigTV English

Priyanka Mohan: చంద్రముఖిలా మారిన ప్రియాంక.. ఆ ఎక్స్ప్రెషన్స్ చూశారా?

Priyanka Mohan: చంద్రముఖిలా మారిన ప్రియాంక.. ఆ ఎక్స్ప్రెషన్స్ చూశారా?

Priyanka Mohan: ప్రియాంక మోహన్ (Priyanka Mohan) .. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఓ.జీ (OG )సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సెప్టెంబర్ 25వ తేదీన రాబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నటి శ్రేయా రెడ్డి , విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు శుభలేఖ సుధాకర్, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేదీకి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 21 హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈవెంట్ అంతా బాగానే జరిగినా వర్షం కారణంగా అటు అభిమానులు కూడా ఇబ్బంది పడిపోయిన విషయం తెలిసిందే.


ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రియాంక ఎక్స్ప్రెషన్స్ వైరల్..

ఇకపోతే ఈవెంట్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ప్రియాంక మోహన్ ఎక్స్ప్రెషన్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అయితే అందులోనే పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న ప్రియాంక పవన్ కళ్యాణ్ ని చూస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు ట్రోల్స్ కి గురవుతున్నాయి. కాసేపు నవ్వుతూ.. కాసేపు సీరియస్ అవుతూ ఇలా తన ఫేస్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో ఈ వీడియో పై నెటిజన్స్ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.

చంద్రముఖిలా మారిపోయిందంటూ ట్రోల్స్..


క్షణానికో ఎక్స్ప్రెషన్స్. చంద్రముఖిలా మారిపోతోంది ఏంట్రా బాబు అంటూ కామెంట్లు చేస్తుంటే.. సినిమాలో ఇవ్వమంటే స్టేజ్ పైన ఇస్తోంది అని ఇంకొంతమంది.. చేతబడి చేస్తోందా ఏంటి ? అంటూ ఇంకొంతమంది.. కొంతమంది అయితే ఏకంగా నాకు గెటప్ శ్రీను కనబడుతున్నాడు అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం.. కోపంలో చూసినా చాలా క్యూట్ గా ఉంది భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా మొత్తానికైతే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్స్ప్రెషన్స్ తోనే హాట్ టాపిక్ గా మారింది ప్రియాంక.

ఎక్స్ప్రెషన్స్ వెనుక ఏం జరిగిందంటే?

అసలు విషయంలోకి వెళ్తే.. ట్రైలర్ ఎందుకు డిలే అవుతోందని పవన్ సుజీత్‌ను అడిగాడు. అతడు ఏదో చెబితే.. పవన్ సీరియస్‌గా ఏదో అన్నాడు. అది విని ఆమె ఒక్కసారిగా ఎక్స్‌ప్రెషన్ మార్చింది. ఆ ఎక్స్ప్రెషన్స్ కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రియాంక కెరియర్..

ప్రియాంక కెరియర్ విషయానికి వస్తే.. ఈమె అసలు పేరు ప్రియాంక అరుళ్ మోహన్.. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తొలిసారి కన్నడ సినిమా ‘ఓంధ్ కథే హెళ్ల’ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత శ్రీకారం సినిమాలో నటించిన ఈమె సరిపోదా శనివారం సినిమాలో కూడా నటించింది..

also read:Sujeeth: ఆయన వల్లే ఈ స్థాయి.. సుజీత్ ఎమోషనల్ కామెంట్స్!

?utm_source=ig_web_copy_link

Related News

Teja Sajja: ‘హనుమాన్’ సక్సెస్ తర్వాత చెర్రీ, తారక్‌లు అలా చేశారు: తేజ సజ్జా

PM Modi: ఉగ్రవాదంపై మోదీ సంచలన నిర్ణయం.. ఇక మరోసారి అలాచేస్తే దేత్తడే..!

Robin Uthappa Arrest : క్రికెటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ.. ఫ్రాడ్ కేసు

Vinod Kambli Networth: ఒకప్పుడు కోటీశ్వరుడు.. సచిన్‌తో సమానంగా టాలెంట్.. వినోద్ కాంబ్లి ఆస్తి ఎంతంటే..

Bumrah – Kapil Dev: ఆసీస్‌ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా చరిత్ర..కపిల్ దేవ్ రికార్డు బ్రేక్‌ !

Bjp leader Madhavi latha: ఎంఐఎం పై మాధవీ లత ఫైర్..బలుపు అంటూ అనుచిత వ్యాఖ్యలు

Big Stories

×