BigTV English

Top 5 Budget Bikes: బడ్జెట్ కింగ్‌లు.. ఈ ఐదు బైక్‌లకు తిరుగులేదు!

Top 5 Budget Bikes: బడ్జెట్ కింగ్‌లు.. ఈ ఐదు బైక్‌లకు తిరుగులేదు!

Top 5 Budget Bikes: హోండా ఇండియా కొన్ని నెలల క్రితం భారతదేశంలో కొత్త 100సీసీ బైక్‌ను విడుదల చేసింది. Sine 100cc కమ్యూటర్ సెగ్మెంట్‌లో హోండా మొదటి బైక్. అంతే కాకుండా దేశంలోనే అత్యంత చౌకగా లభించే బైక్‌లలో ఇది ఒకటి. మీరు కొత్త, బడ్జెట్‌లో ప్రైస్‌లో బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే హీరో హెచ్‌ఎఫ్ 100, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, టీవీఎస్ స్పోర్ట్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100లను కొనుగోలు చేయవచ్చు. ఈ బైకుల మైలేజీ, ఫీచర్లు తదితర వివరాల గురించి తెలుసుకోండి.


1.Hero HF 100
హీరో HF 100 ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చౌకైన బైక్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.54,962. ఇది 97cc HF డీలక్స్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 8hp పవర్, 8.05Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో i3S స్టాప్-స్టార్ట్ టెక్నాలజీ ఉండదు. కిక్-స్టార్టర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read: బెస్ట్ మైలేజ్ కార్స్.. టాప్-5 ఇవే!


2. Hero HF Deluxe
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ 100సీసీ సెగ్మెంట్‌లో డిమాండ్ ఉన్న మోడల్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 61,232 నుండి రూ. 68,382 మధ్య ఉంటుంది. ఇది 97cc ‘స్లోపర్’ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది హీరో  i3S స్టాప్-స్టార్ట్ టెక్నాలజీతో వస్తుంది. దీని తర్వాత వేరియంట్లు కిక్ స్టార్టర్‌ను కూడా కలిగి ఉంటాయి.

3. TVS Sport
TVS స్పోర్ట్  ఎక్స్-షోరూమ్ ధర రూ. 61,500 నుంచి రూ. 69,873 మధ్య ఉంటుంది. ఇది 109.7cc ఇంజన్‌ను కలిగి ఉంది. ఇందులో ఇంజన్ 8.3hp పవర్, 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కిక్ స్టార్ట్  సెల్ఫ్ స్టార్ట్ వంటి రెండూ ఫీచర్లు ఇందులో ఉంటాయి.

4. Honda Shine 100
హోండా షైన్ 100 ప్రారంభ ధర రూ. 64,900 (ఎక్స్-షోరూమ్). ఇందులో 99.7cc ఇంజన్‌ ఉంటుంది. ఇది 7.61hp పవర్, 8.05Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది ఆటో చోక్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్‌తో పాటు ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటి ఫీచర్లు కలిగి ఉంది.

Also Read: డార్లింగ్ ప్రభాస్ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో.. ఒక్కోదాని కాస్ట్ తెలిస్తే మతిపోతుంది!

5. Bajaj Platina 100
బజాజ్ ప్లాటినా 100 ప్రారంభ ధర రూ. 67,475 (ఎక్స్-షోరూమ్). ఇది బజాజ్ సిగ్నేచర్ DTS-i టెక్నాలజీతో కూడిన 102cc ఇంజన్‌ని కలిగి ఉంది. ఈ ఇంజన్ 7.9 హెచ్‌పి పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఫ్యూయల్-ఇంజెక్షన్‌కు బదులుగా, బజాజ్  ఇ-కార్బ్ ఇందులో ఉపయోగించారు. ఫ్రంట్  LED DRL కూడా ఉంటాయి.

Related News

Gold Rate: అమ్మ బాబోయ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ పండగ సేల్ ప్రారంభం.. భారీ ఆఫర్ల వర్షం

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

Big Stories

×