BigTV English

Bitcoin Sky Rockets: ట్రంప్ ప్రకటన.. అమాంతంగా పెరిగిన బిట్‌కాయిన్ విలువ

Bitcoin Sky Rockets: ట్రంప్ ప్రకటన.. అమాంతంగా పెరిగిన బిట్‌కాయిన్ విలువ

Bitcoin Sky Rockets: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువ అమాంతంగా పెరిగింది. క్రిప్టో మార్కెట్‌కు అమెరికాని రాజధానిగా చేస్తానన్నది అందులోని సారాంశం. ట్రంప్ ప్రకటనతో బిట్ కాయిన్ ​ సహా మరికొన్ని క్రిప్టో కరెన్సీల విలువ భారీగా పెరిగాయి. ఏకంగా 95 వేల డాలర్ల మార్క్‌ని తాకింది. ఒక విధంగా చెప్పాలంటే దీని ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్లపై పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


తారాజువ్వలా బిట్ కాయిన్ మార్కెట్

బిట్ కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం ఆదివారం రాత్రి వాటి విలువ ఒకానొక దశలో 95,136 డాలర్లకు చేరింది. మార్కెట్ ముగిసే సమయానికి 94,000 డాలర్ల వద్దకు స్థిరపడింది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఈథర్.. ఆదివారం ఒక్క రోజే 13 శాతం పెరిగింది. దాని విలువ 2,516 డాలర్లకు చేరుకుంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.87 ట్రిలియన్ డాలర్లు. మార్చి 2 నాటికి మార్కెట్ వాల్యూమ్​ 47 బిలియన్ డాలర్లు దాటాయి.


ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు, అమెరికా ప్రభుత్వం నిర్ణయాల ప్రభావంతో బిట్‌కాయిన్‌ పెట్టుబడి దారుల్లో అనిశ్చిత నెలకొంది. గురువారం నాటికి బిట్‌కాయిన్ విలువ 84 వేల డాలర్ల వద్ద ఊగిసలాడింది. దీంతో అందరి దృష్టి వారాంతంపై పడింది. క్రిప్టో డెరివేటివ్‌ల కాల పరమితి ముగియనుండటంతో ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ వారంతంలో బిట్‌కాయిన్ విలువ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని తొలుత ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన బిట్‌కాయిన్ మదుపుదారులను బూస్ట్ ఇచ్చినట్టయ్యింది. క్రిప్టో రిజర్వ్‌లో ఎక్స్​ఆర్​పీ, సోలానా, కార్డానో లాంటి క్రిప్టో కాయిన్స్​ ఉన్నాయి.

ALSO READ: వచ్చేవారం రానున్న ఐపీఓలు ఇవే

భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయానికి సొలానా కాయిన్ 24 శాతం పెరిగి 175.46 డాలర్లకు చేరింది. ఇక ఎక్స్​ఆర్​పీ టోకెన్ 31 శాతం పెరిగి 2.92 డాలర్లకు చేరుకుంది. అంతకుముందుతో పోలిస్తే ఎక్స్ఆర్​పీ టోకెన్ 33.14 శాతం పెరిగి 2.84 డాలర్లకు చేరుకుందని మార్కెట్ క్యాప్ డేటా తెలిపింది. కార్డానో టోకెన్ అయితే 1.1 డాలర్లకు వెళ్లింది. అంతకుముందు రోజు 0.64 డాలర్ల దగ్గర ఉండేది.

క్రిప్టో ఇండస్ట్రీకి ఊతమిచ్చేందులా తమ దేశంలో క్రిప్టోకి కేపిటల్ కానుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మార్కెట్లు పుంజుకున్నాయి. జో బైడెన్ హయాంలో యూఎస్ క్రిప్టో రిజర్వ్ క్లిష్టమైన పరిస్థితులు ఆ పరిశ్రమ ఎదుర్కొంది. అందుకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆన్ డిజిటల్ అసెట్స్ ఎక్స్ఆర్​పీ, ఎస్ఓఎల్, ఏడీఏతో కూడిన క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్‌పై ముందుకు సాగాలని ప్రెసిడెంట్​ వర్కింగ్ గ్రూప్‌ని ఆదేశించానని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్​లో పోస్ట్​ చేశారు.

ట్రంప్ నిర్ణయాలతో ఊగిసలాట

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక తర్వాత బిట్‌కాయిన్‌ విలువ అమాతంగా పుంజుకుంది. అయితే క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తానని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఒకానొక దశలో బిట్‌కాయిన్‌ ఏకంగా 1,00,000 డాలర్ల మార్కును దాటేసింది. ఈలోగా ట్రంప్‌ టారిఫ్‌ నిర్ణయాలు, వాణిజ్య యుద్ధ భయాలతో క్రిప్టో కరెన్సీ‌పై పడింది. ఫలితంగా బిట్‌కాయిన్‌ క్షీణించడానికి కారణమైంది. కొన్నిరోజుల పాటు 86 వేల డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నట్లే కనిపించిన బిట్‌కాయిన్‌, ఆ తర్వాత నష్టాల్లో జారుకున్న విషయం తెల్సిందే.

Related News

Personal loan: పర్సనల్ లోన్ వెనుక దాగిన భయంకర నిజం! జాగ్రత్తగా లేకుంటే మీకే నష్టం

Amazon Weekend Deals: అమెజాన్ దీపావళి స్పెషల్ డీల్స్! 65 వేల వరకు డిస్కౌంట్.. ఈ వీకెండ్‌ మిస్ కాకండి!

Jio recharge plan: ఖరీదైన రీచార్జ్‌లకు గుడ్‌బై!.. జియో 51 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ 5G డేటా

Gold Capital of India: భారతదేశ గోల్డ్ రాజధాని ఏదో తెలుసా..? ఇక్కడ నుంచి భారీగా బంగారం ఉత్పత్తి..

Open beta: కలర్‌ఓఎస్ 16, ఆక్సిజన్‌ఓఎస్ 16 బీటా రిలీజ్.. మీ ఫోన్‌కి అర్హత ఉందా? చెక్ చేయండి!

Jio Offers: జియో రీచార్జ్ ప్లాన్స్ 2025.. 75 నుండి 223 రూపాయల వరకు సులభమైన ప్లాన్స్

BSNL Offers: రూ.229లో బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్.. రోజుకు 2జిబి డేటా, నెలపాటు అన్‌లిమిటెడ్ కాల్స్

Gold rate: అయ్యయ్యో.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×