ఐపీఓల వీక్ మళ్లీ రానే వచ్చేసింది. ఈసారి మార్చి 3 నుంచి ప్రారంభమయ్యే వారంలో పలు కంపెనీల్లో పెట్టుబడులు చేసేందుకు ఛాన్సుంది. అయితే ఈసారి మాత్రం ఒక కొత్త పబ్లిక్ ఇష్యూ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతోపాటు గతవారం మొదలైన IPOలలో కూడా పెట్టుబడులు చేసేందుకు అవకాశం ఉంది. మరోవైపు కొత్త వారంలో 4 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
NAPS గ్లోబల్ ఇండియా ఐపీఓ: వస్త్ర దిగుమతిదారు అయిన NAPS గ్లోబల్ ఇండియా రూ. 11.88 కోట్ల ఐపీఓ మార్చి 4న ప్రారంభం కానుంది. దీని ముగింపు మార్చి 6న ఉంటుంది. బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 90 కాగా, లాట్ సైజు 1600. ఈ IPO ముగిసిన తర్వాత షేర్లు మార్చి 11న BSE SMEలో లిస్ట్ కానున్నాయి.
బాలాజీ ఫాస్ఫేట్స్ IPO: రూ. 50.11 కోట్ల ఈ ఇష్యూ ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. మార్చి 4న ముగియనుంది. ఒక్కో షేరుకు రూ. 66-70 ధర ఉండగా, లాట్ సైజు 2000. ఈ షేర్లు మార్చి 7న NSE SMEలో లిస్ట్ కానుంది.
బీజాసన్ ఎక్స్‌ప్లోటెక్ షేర్లు మార్చి 3న కొత్త వారంలో BSE SMEలో లిస్ట్ కానున్నాయి. ఆ తరువాత న్యూక్లియస్ ఆఫీస్ సొల్యూషన్స్ మార్చి 4న BSE SMEలో జాబితా చేయబడుతుంది. శ్రీనాథ్ పేపర్ షేర్లు మార్చి 5న BSE SMEలో లిస్ట్ కావచ్చు. బాలాజీ ఫాస్ఫేట్స్ IPO మార్చి 7న NSE SMEలో లిస్ట్ కానుంది.
Read Also: March 2025 Deadlines: వీటికి మార్చి 31 లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..
అయితే గతంతో పోలిస్తే ఈసారి మాత్రం స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి తగ్గిందని చెప్పవచ్చు. ఇదివరకు వారంలో మూడు నుంచి నాలుగు కంపెనీలు ఐపీఓకు వచ్చే ఛాన్స్ ఉండగా, ఈసారి మాత్రం భారీగా తగ్గిపోయింది. కేవలం ఒక కంపెనీ మాత్రమే కొత్తగా ఐపీఓకు సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో కొత్త కంపెనీలు సైతం ఐపీఓకు వచ్చేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు గత కొన్ని వారాల్లో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన వేళ మదుపర్లు భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో కొన్ని వారాల వ్యవధిలోనే 10 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయనే దానిపై మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు ట్రేడింగ్ నిపుణులు సైతం మదపర్లు మార్కెట్ తీరును బట్టి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే అందించడం జరుగుతుంది. మార్కెట్లో పెట్టుబడి చేయాలని బిగ్ టీవీ సూచించదు. ఒకవేళ మీరు పెట్టుబడి చేయాలని భావిస్తే ముందుగా నిపుణుల సలహా, సూచనలు తప్పకుండా తీసుకోవాలి.