BigTV English

BSA Gold Star 650 Launched: రాయల్ ఎన్‌ఫీల్డ్ లుక్‌తో ‘బిఎస్‌ఏ గోల్డ్‌స్టర్ 650’.. ధర, ఫీచర్లు ఇవే..!

BSA Gold Star 650 Launched: రాయల్ ఎన్‌ఫీల్డ్ లుక్‌తో ‘బిఎస్‌ఏ గోల్డ్‌స్టర్ 650’.. ధర, ఫీచర్లు ఇవే..!

BSA Gold Star 650: యంగ్ రైడర్స్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఆ బైక్ సౌండ్ వారిలో సరికొత్త ఉత్సాహాన్నిస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి మోడల్‌తోనే ఓ బైక్ దేశీయ మార్కెట్‌లో దర్శనమిచ్చింది. ‘బిఎస్ఏ గోల్డ్‌స్టర్ 650’ బైక్ రీసెంట్‌గా దేశీయ మార్కెట్‌లో రిలీజ్ అయింది. ఈ బైక్ అచ్చం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ మాదిరిగానే ఉంటుంది. అంతేకాకుండా దాదాపు 1970లో ఈ బైక్‌లు మార్కెట్‌లోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే మళ్లీ 50 ఏళ్ల తర్వాత అదే లుక్‌తో ఇప్పుడు దేశీయ మార్కెట్‌లోకి వచ్చింది.


ఈ సరికొత్త బీఏఎస్ గోల్డ్‌స్టర్ 650 బైక్ ధర విషయానికొస్తే.. ఇది రూ.2,99,990 ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో రిలీజ్ అయింది. దీంతో ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సిసి బైక్‌ లైనప్‌తో పోటీపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ గోల్డ్‌స్టర్ 650 బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 మాదిరిగానే రెట్రో థీమ్‌ను కలిగి ఉంటుంది. కాగా గోల్డ్‌స్టర్ 650 అచ్చం పాతకాలం నాటి బైక్‌ మాదిరిగానే కనిపిస్తుంది. దీని కారణంగా ఇది ప్రస్తుతం యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. లుక్ కూడా క్లాసిక్‌గా ఉండటంతో అందరి దృష్టి ఈ బైక్‌పైనే పడింది.

Also Read: నిస్సాన్‌ ఎక్స్‌-ట్రైల్‌ డెలివరీలు షురూ.. వాటికి గట్టి పోటీ..!


ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఈ గోల్డ్‌స్టర్ 650 బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ఎల్‌సీడీ డిస్‌ప్లే, యుఎస్బీ ఛార్జర్, స్లిప్పర్ క్లచ్‌తో సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ సరికొత్త బైక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో 650 సిసి ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 6000 ఆర్‌పిఎం వద్ద 45 బిహెచ్‌పీ పవర్‌ని, అలాగే 4000 ఆర్‌పిఎం వద్ద 55 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

ఈ గోల్డ్‌స్టర్ 650 బైక్ 5స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. అలాగే బైక్ ముందు బాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్‌సైడ్ 5 స్టెప్ ప్రీ లోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్‌లతో వస్తుంది. ఇక ఈ బైక్‌లోని బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఈ బైక్ ఫ్రంట్ సైడ్ 320 ఎంఎం డిస్క్ బ్రేక్ అందించారు. అదే సమయంలో బ్యాక్ సైడ్ 255 ఎంఎం డిస్క్ బ్రేక్‌ అందించారు. కాగా గోల్డ్ స్టర్ 650 బైక్ 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాక్‌ను కలిగి ఉంది. దీని బరువు సుమారు 213 కిలోలు. అయితే ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మాదిరిగానే ఉన్నా.. వాటిలో ఉన్న కొన్ని ఫీచర్లను కోల్పోతుంది.

Related News

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Big Stories

×