Tasha Newcombe | వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏదైనా జరగొచ్చు. సమాజంలో ఉంటున్నారే కాని.. సామాజిక విలువలు పాటించే వారు తగ్గిపోతున్నారు. మరీ ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అయితే నేనింతే అని ధోరణి ఎక్కువవుతోంది. తాజాత బ్రిటన్ దేశానికి చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తాషా న్యూకాంబె ఒక మైనర్ తో ప్రేమ వ్యవహారం సాగిస్తోంది. దీంతో ఆమెను నెటిజెన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
తాషా న్యూకాంబె ఒక టిక్ టాక్ సెలెబ్రిటీ. ఆమెకు టిక్ టాక్ లో 2,86,000 వేల ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె ఒక మైనర్ తో డేటింగ్ చేస్తుండడంతో సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలపై ఆమె స్పందించింది. న్యూయార్క్ పోస్ట్ పత్రికా కథనం ప్రకారం.. 21 ఏళ్ల టిక్ టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ తాషా న్యూకాంబె, ఓ 16 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ తమ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతే అప్పటి నుంచి ఆమెను తనకంటే తక్కువ వయసు కుర్రాడితో ఎలా డేటింగ్ చేస్తుంది.. అమెకు బుద్ధి లేదా? అని విమర్శిస్తున్నారు.
అయితే వారిద్దరి వయసులో ఉన్నది కేవలం అయిదు సంవత్సరాల తేడా మాత్రమే అయినా ఆమె ప్రియుడు మార్కొ విటుక్ 16 ఏళ్ల మైనర్ కావడమే వివాదానికి దారితీసింది. అయితే తనపై వస్తున్న విమర్శలకు ఆమె బహిరంగంగా సమాధానం చెప్పాలనుకొని కొందరు సోషల్ మీడియా సెలబ్రిటీల పాడ్ కాస్ట్ కార్యక్రమాల్లో తన బాయ ఫ్రెండ్ మార్కొతో సహా పాల్గొంది.
Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?
ఆ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో తాషా మాట్లాడుతూ.. ”మా ఇద్దరి మధ్య ముందు ఫ్రెండ్ షిప్ ఉండేది. ఆ తరువాత అతనితో ప్రేమలో పడ్డాను. అయితే ఇది కరెక్టా? కాదా? మా ఇద్దరి మధ్య వయసులో గ్యాప్ ఉంది. అందుకే అతనికి కొన్ని రోజులు దూరంగా ఉన్నాను. కానీ మేమిద్దరం, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం కదా. ఇందులో తప్పేముందని భావించి. మా బంధాన్ని లోకం ముందు ప్రకటించాను. నేను ఏ తప్పు చేయడం లేదు. నాకు తెలుసు చాలా మంది మా ఇద్దరి రిలేషన్ షిప్ పై కామెంట్లు చేస్తుంటారు. ఎవరి అభిప్రాయం వారిది. అది వారిష్టం. అదే మాట నాకూడా వర్తిస్తుంది కదా. నా ఇష్టం నా అభిప్రాయం కూడా ఉంటుంది కదా.. నా కంటే అయిదేళ్లు చిన్న వయసు వ్యక్తిని ప్రేమించాను. ఈ విషయంలో నాకేమీ తప్పనిపించడం లేదు,” అని నిర్భయంగా చెప్పింది.
ప్రముఖ యూట్యూబర్ మైకీ మెలిన్ పాడ్ క్యాస్ట్ లో తన అభిప్రాయాలను పంచకుంది. ఆమె ప్రియుడు మార్కొ కూడా మేమిద్దం పవిత్రంగా ప్రేమించుకుంటున్నాం అని చెప్పారు.
తాషా న్యూకాంబె ఒక ఆన్ లైన్ యాప్ ద్వారా మార్కొని కలిసింది. కొన్నాళ్లు అతనితో చాటింగ్ చేసిన తరువాత అతడిని కలసింది. ఆ తరువాత వారిద్దరూ తరుచూ కలిసేవారు. కానీ అతడిని ప్రేమించాలనే ఉద్దేశం తనకు మొదట్లో లేదని ఆమె తెలిపింది. తన కంటే వయసులో చిన్నవాడైనా.. మార్కొ చాలా తెలివైన వాడని, తనను ప్రేమగా చూసుకుంటాడని చెబుతూ.. తనపై తన ఫ్రెండ్స్, ఫ్యామిలీపై ద్వేషపూరిత కామెంట్లు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. తన బాయ్ ఫ్రెండ్ ఇప్పడు ఒక మైనర్ కాదని అందుకోసమే చట్టపరంగా తామిద్దరూ ప్రేమించుకునేందుకు చట్టం అడ్డుకాదని తెలిపింది.
బ్రిటన్ లో 16 ఏళ్లు నిండిన వ్యక్తులు మైనర్ కాదు. వారు శృంగార చేయడానికి అనుమతులున్నాయి. అయితే ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఉండడం గమనార్హం.
Also Read: 610 కేజీల బరువుతో చనిపోతాడనుకున్న బాలుడు బతికాడు.. అంతా ‘రాజు’గారి దయ..