BigTV English

Special Recharge: ఆ రీఛార్జ్ ప్లాన్లకు గుడ్‌బై..ఇక్కడ రూ.100కే 3జీబీ డేటాతో బెస్ట్ ప్లాన్

Special Recharge: ఆ రీఛార్జ్ ప్లాన్లకు గుడ్‌బై..ఇక్కడ రూ.100కే 3జీబీ డేటాతో బెస్ట్ ప్లాన్

Special Recharge: నెలాఖరు వచ్చిందంటే చాలు మనమందరికీ మొదట గుర్తొచ్చేది రీఛార్జ్ టెన్షన్. డేటా అయిపోతుంది”, “కాల్ కట్ అవుతోంది” అంటూ మొబైల్‌కి రీఛార్జ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. ఇవన్నీ ఒకరకంగా మన రోజువారీ పనుల్లో భాగం అయిపోయాయి. కానీ ఇప్పుడు ఆ టెన్షన్‌కి BSNL సాయం చేస్తోంది. అదీ కూడా ఓ బంపర్ ప్లాన్‌తో, నెలనెలా రీఛార్జ్ మర్చిపోయినా, ఏ సమస్యా లేదు. ఏడాది పొడవునా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తోంది. అయితే ఈ ప్లాన్ వివరాలు ఎలా ఉన్నాయ్. దీని స్పెషల్ ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఏడాది పొడవునా టెన్షన్ ఫ్రీ మొబైల్ సర్వీస్!
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తాజాగా మార్కెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీని ధర కేవలం రూ.1198. దీని చెల్లుబాటు వ్యవధి ఏకంగా 365 రోజులు. అంటే, నెలకి సగటుగా రూ.100 చొప్పున మాత్రమే ఖర్చవుతుంది. ఈ ప్లాన్ వినియోగదారుల అవసరాలకు సరిపోయేలా డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ అన్నీ కవర్ చేస్తోంది.

ప్లాన్ స్పెషల్ ఫీచర్
ఈ ప్లాన్ ప్రత్యేకతేంటంటే, మీరు ఒకసారి ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే చాలు… ఏడాది పొడవునా ప్రతి నెలా సరికొత్తగా ప్లాన్ రెన్యూ అవుతుంది. మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన పని లేదు. నెల మొదలవుతూనే మీ అకౌంట్‌లో 3GB డేటా, 300 నిమిషాల ఉచిత కాలింగ్, 30 ఎస్ఎంఎస్‌లు క్రెడిట్ అవుతాయి.


ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు:
-నెలకు 3GB డేటా
-ఏ నెట్‌వర్క్‌కైనా 300 నిమిషాల ఉచిత కాలింగ్
-నెలకు 30 SMSలు

-ఇవి అన్నీ ప్రతి నెలా ఆటోమేటిక్‌గా రీసెట్ అవుతాయి. అంటే మాన్యువల్‌గా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, చిన్న పట్టణాల్లో నివసించే ప్రజల కోసం డిజైన్ చేసిన బెస్ట్ ప్లాన్‌ అని చెప్పుకోవచ్చు.

Read Also: Budget Air Coolers: రూ.5000కే వేసవిలో చల్లదనం..టాప్ 4 …

ఈ ప్లాన్‌ ఎందుకు ప్రత్యేకం
ప్రైవేట్ టెలికాం కంపెనీలు వారి టారిఫ్ ప్లాన్‌లను తరచూ పెంచుతున్న తరుణంలో, BSNL చాలా బడ్జెట్‌ ఫ్రెండ్లీ ప్లాన్ తీసుకువచ్చింది. ఇది ముఖ్యంగా ఈ క్రింది వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది:
-మొబైల్‌ని ఎక్కువగా ఉపయోగించని వారు
-ఇంటర్నెట్‌ని పరిమితంగా వాడే యూజర్లు
-ప్రతి నెలా రీఛార్జ్ మర్చిపోయే వృద్ధులు
-బ్యాకప్ SIM వాడే విద్యార్థులు
-చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉండే ప్రజలు
-అంతే కాదు, ఫ్యామిలీ మొత్తానికీ చౌక ధరలో మొబైల్ కనెక్టివిటీ కల్పించాలనుకునే కుటుంబాలకు ఇది బేస్ట్ ఆప్షన్.

బిజినెస్ వ్యూహం కూడా

BSNL ఈ ప్లాన్‌తో రెండు అంశాలపై ఫోకస్ చేసింది. ఒకటి affordability (చౌక ధర), consistency (నిరంతర సేవలు). మొబైల్ సేవలు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన భాగంగా మారిన నేపథ్యంలో, ప్రతి నెలా ఖర్చును తగ్గించాలనే కస్టమర్‌లకు ఇది మంచి అవకాశం. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం ఉపయోగించే సబ్‌స్క్రిప్షన్ మోడల్ అనే చెప్పొచ్చు. OTTలు, కేబుల్ TV, ఇతర యాప్‌లు ఎలా సబ్‌స్క్రిప్షన్ ద్వారా పని చేస్తాయో, అలాగే BSNL కూడా ఇదే ఫార్మాట్‌ను టెలికాం రంగంలోకి తీసుకొచ్చింది. ఒకసారి చెల్లించగానే, ఏడాది మొత్తం వినియోగించుకోవచ్చు.

కవరేజ్ విషయంలో జాగ్రత్త
అయితే, BSNL నెట్‌వర్క్ కవరేజ్ దేశవ్యాప్తంగా ఒకేలా లేనప్పటికీ, సంస్థ తన సేవలను మెరుగుపరచడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తోంది. 4G ఇంకా అన్ని ప్రాంతాల్లో లభించకపోవచ్చు, కానీ సంస్థ తాజాగా విడుదల చేసిన నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌ ద్వారా మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న సేవలు, నెట్‌వర్క్ బలాన్ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×