HC Banned Beef: హైదరాబాద్‌లోని హైకోర్ట్ వేదికపై ఈ రోజు ఓ విచిత్రమైన పరిస్థితి చోటుచేసుకుంది. రేపు బీఫ్ అమ్మకాల నిషేధంపై ఒక పిటిషన్ దాఖలు చేశారు ఓ వ్యక్తి. సాధారణంగా పిటిషన్‌లు వ్యాపారులు, పలు సంఘాలు వేస్తారు. కానీ ఇక్కడ బీఫ్ అమ్మాకాలపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ బీఫ్ తినే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్ట్ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, బీఫ్ తినాలనుకుంటే ముందు రోజు కొనుక్కుని రేపు తినవచ్చు కదా… అలా ఎందుకు పిటిషన్ వేసారు?” అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో బీఫ్ అమ్మేవాళ్లు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని హైకోర్ట్ తెలిపింది. తన వాదనలో, బీఫ్ అమ్మకాలను ఎందుకు నిషేధించ కూడదో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి చెప్ప లేకపోయాడు. దీనిపై హైకోర్ట్ పిటిషన్‌ను కొట్టి వేస్తేనే సరిపోతుందని తీర్పు ఇచ్చింది. పిటిషన్ వేసిన వ్యక్తి విచారణలో మౌనంగా ఉండటం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైందని హైకోర్ట్ పేర్కొంది.
మొత్తం వ్యవహారాన్ని వ్యక్తిగత ఇష్టం ఆధారంగా న్యాయస్థానాన్ని సరిపోదని, ఈ పిటిషన్ ఒక విచిత్ర ఉదాహరణగా నిలిచింది. ప్రజలకు, వ్యాపారులకు, న్యాయ ప్రక్రియపై గట్టి సందేశం ఇస్తుంది. ఏ విధమైన పిటిషన్ వ్యవహారం, కచ్చితమైన కారణాలతోనే హైకోర్ట్‌లో పరిశీలించబడుతుందని ఇదే ఉదాహరణ చూపిస్తోంది. రేపు స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బీఫ్ అమ్మాకాలు నిషేధించారు. ఎందుకంటే స్వాతంత్య్ర దినం రోజు హింస సరైనది కాదని అందుకే ప్రతి సంవత్సరం బీఫ్, మందులపై నిషేధం విధించడం ఆనవాయితీ.
అయితే బీఫ్ తినే వ్యక్తి దీనికి విరుద్ధంగా బీఫ్ అమ్మకాలపై నిషేధం ఎత్తివేయాలని కోరతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై సర్వత్రా చర్చకు దారితీసింది. ఎందుకంటే సాధారణంగా ప్రజలు, వ్యాపారులు ఆలోచన చేయకపోవడం, వ్యక్తిగత ఇష్టం వల్ల పిటిషన్ వేయడం ఇదే మొదటి సందర్భమని కొందరు అభిప్రాయపడుతున్నారు. హైకోర్ట్ ముందుకు వచ్చిన ఈ విచిత్రమైన పిటిషన్ల వాదనలు, వివరణ కూడా ప్రజల దృష్టిలోకి వచ్చాయి. దీంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమే కదా హైకోర్టు చెప్పినట్లు ఆ వ్యక్తికి బీఫ్ తినాలి అనుకుంటే ముందు రోజే తీసుకుని తరువాతి రోజూ తినవచ్చు కదా అని ప్రజలు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.