BigTV English

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోటీపడుతూ వేగంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ రంగానికి ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన హబ్ గా మారింది. అలాగే హైదరాబాద్ నగరంలో కొత్తగా అపార్ట్మెంట్ ఫ్లాట్లను కొనుగోలు చేయాలంటే లక్షలు దాటి కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వేతన జీవులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుగోలు చేయడం కష్టతరంగా మారుతోంది. ఇలాంటి సమయంలో సెకండ్ సేల్ ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆయా వర్గాల వారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న డిమాండ్ ను ఆసరా చేసుకొని సెకండ్ సేల్స్ మార్కెట్ కూడా వేగంగా విస్తరించింది. అటు ఆన్ లైన్ లో సైతం సెకండ్ సేల్ ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయనే చాలా వరకు ప్రకటనలు కనిపిస్తున్నాయి. అయితే కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కన్నా కూడా సెకండ్ సేల్స్ ప్లాట్స్ ధర తక్కువగా ఉంటాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు సెకండ్ సేల్ ఫ్లాట్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సెకండ్ సేల్స్ ఫ్లాట్స్ కూడా పెద్ద మొత్తంలో ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.


వాస్తవ పరిస్థితులు తెలియకుండా పెద్ద మొత్తం చెల్లించి ఆ ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్లయితే మీరు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని సరిగ్గా నెగోషియేషన్ చేయడం అనేది తప్పనిసరి అన్న సంగతి గుర్తుంచుకోవాలి. సెకండ్ సేల్స్ ప్లాట్స్ కొనుగోలు చేసే ముందు ధర విషయంలో ఎలా నెగోషియేట్ చేయాలి. సెకండ్ సేల్ ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా అసలు మార్కెట్ రేట్ ఎంతో తెలుసుకోండి:
సెకండ్ సేల్ ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు మీరు ఏ ఏరియా అయితే ఎంపిక చేసుకున్నారో, ఆ ప్రాంతంలో అసలు స్క్వేర్ ఫీట్ ధర ఎంత ఉందో ముందుగానే తెలుసుకోవడం మంచిది. వీలైతే ఆ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్ ప్లాట్ లలో స్క్వేర్ ఫీట్ ధర ఎంత ఉందో సమాచారం తెలుసుకుంటే మంచిది. తద్వారా సెకండ్ సేల్స్ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ ధరను పోల్చుకోవచ్చు. ఫలితంగా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు.


బ్రోకర్లతో జాగ్రత్త
సెకండ్ సేల్స్ ఫ్లాట్లు కొనుగోలు చేయాలంటే మీరు నేరుగా యజమానితోనే మాట్లాడుకుంటే మంచిది. బ్రోకర్ల ద్వారా లావాదేవీ జరిపినట్లయితే కమీషన్ల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు గుంజే అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్రోకర్లు మిమ్మల్ని బేరం ఆడనివ్వరు. నేరుగా ఇంటి యజమానితో లావాదేవీ జరిపినట్లయితే ప్రైస్ నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇంటి యజమాని పరిస్థితిని బట్టి, అతనికి డబ్బు అవసరాన్ని బట్టి ఫ్లాట్ ధర తగ్గించే అవకాశం ఉంటుంది.

బిల్డింగ్ వయస్సు అత్యంత కీలకం
మీరు కొనుగోలు చేస్తున్న సెకండ్ సేల్స్ అపార్ట్మెంట్ బిల్డింగ్ వయస్సు అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే పది సంవత్సరాల కన్నా పాతబడ్డ బిల్డింగ్ లలో రిపేర్లు ఎక్కువగా ఉంటాయి. కనుక మీరు ఫ్లాట్స్ కొనుగోలు చేసేటప్పుడు బేరం ఆడేందుకు అవకాశం ఏర్పడుతుంది.

అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (UDS) విషయంలో స్పష్టత ముఖ్యం:
ప్రతి అపార్ట్మెంట్లో కూడా మీ బిల్డింగ్ నిర్మించినటువంటి భూమిలో ఫ్లాట్ ఓనర్ కు కొంత మొత్తం వాటా ఉంటుంది దీనినే అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ లేదా యూడీఎస్ అని పిలుస్తారు. మీరు ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఆ స్థలం బిల్డర్ పేరు నుంచి ఫ్లాట్ ఓనర్లకు బదలాయింపు జరిగిందా లేదా ముందుగానే తెలుసుకుంటే మంచిది. ఈ యుడిఎస్ వల్ల భవిష్యత్తులో మీ బిల్డింగ్ నివాసయోగ్యంగా లేని సమయంలో ఇతర డెవలపర్లతో ఒప్పందం చేసుకొని నూతన నిర్మాణం చేయించుకోవడానికి మీ వాటా కింద ఉపయోగపడుతుంది.

డాక్యుమెంట్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ముఖ్యంగా మీరు కొనుగోలు చేస్తున్న ఫ్లాట్ టైటిల్ డీడ్, ఎన్వోసీ, ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ తో పాటు, ఇతర లింక్ డాక్యుమెంట్లు, అలాగే ప్రాపర్టీ మెయింటెనెన్స్ డ్యూస్ వంటివి క్లియర్ గా ఉన్నాయా లేదా అనే విషయం చెక్ చేయించుకోవాలి. అలాగే వీలైతే ఒక న్యాయనిపుణుడితో డాక్యుమెంట్లు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకుంటే మంచిది.

బేరం ఆడడానికి కావాల్సిన పాయింట్లు
డౌన్ పేమెంట్ విషయంలో ఎక్కువ మొత్తంలో చెల్లిస్తామని చెబితే ఒక్కోసారి ఇంటి ఓనర్ ధర తగ్గించే అవకాశం ఉంటుంది. బేరం ఆడటానికి ముందుగా హౌస్ ఓనర్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఒకసారి చుట్టుపక్కల వాళ్ళతో చెక్ చేయించుకుంటే మంచిది. . తద్వారా మీరు తెలివిగా ధర తగ్గించమని బేరం ఆడటానికి అవకాశం లభిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి సలహాగా భావించకూడదు. మీ ఆర్థిక లావాదేవీలకు బిగ్ టీవీ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు. మీ ఆర్థిక నిర్ణయాల కోసం అర్హత కలిగిన కన్సల్టెంట్, లాయర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిది.

Related News

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×