Gill – Abhishek : టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. యువరాజ్ సింగ్.. 2002, 2011 వన్డే వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషించాడు. అలాగే 2007 టీ-20లో అయితే ఏకంగా 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి రికార్డు నెలకొల్పాడు. 2007 తొలి టీ-20లో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు యువరాజ్. అయితే యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అయిన తరువాత యువరాజ్ సింగ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ లో క్రికెట్ శిక్షణ అందిస్తున్నాడు. యువరాజ్ సింగ్ ఆలోచన ద్వారా వచ్చిన ఈ కార్యక్రమం 14, 16, 19, 22 ఏళ్ల లోపు పిల్లల కోసం ఒక సంవత్సరం పాటు శిక్షణా కార్యక్రమం ఉంటుంది.
Also Read : Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి
యూవీ స్కూల్ లో టీమిండియా కీలక ఆటగాళ్లు ట్రైనింగ్
ఇందులో వారానికి 5 సెషన్లు ఉంటాయి. ప్రతీ సెషన్ 4 గంటల పాటు ఉంటుంది. ప్రతీ రోజూ 3 గంటలు కోచింగ్.. 1 గంటల ఫిట్ నెస్ కోసం ఉంటుంది. YSCE గురుగ్రామ్ లోని పాత్వేస్ స్కూల్ లో కూడా శిక్షణ అందిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకుు తగ్గట్టుగా క్రికెట్ శిక్షణ కోసం ప్రధాన కేంద్రంగా ఉంది. అక్కడే విశాలమైన క్రికెట్ మైదానం, ప్రొఫెషనల్ నాణ్యత పిచ్ లు అధునాతన సాధన నెట్ లు ఉన్నాయి. అయితే టీమిండియా ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ క్రికెట్ స్కూల్ లోనే శిక్షణ తీసుకున్నారు. దీంతో వీళ్లు ప్రస్తుతం నెంబర్ వన్ క్రికెటర్లుగా నిలిచారు. అందుకే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా యువరాజ్ సింగ్ తండ్రి వద్ద శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం.
శుబ్ మన్ గిల్ రికార్డు
ఇంగ్లాండ్-భారత్ ఐదో టెస్ట్ ముగిసిన రెండు రోజులకే ఐసీసీ ర్యాంకులు వెలువడ్డాయి. బౌలింగ్, బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ కంటే టీమిండియా ఆటగాళ్లే ఆదిపత్యం ప్రదర్శించారు. ఐసీసీ ర్యాంకుల్లో ఆ ప్రభావం కనిపించినా.. ఒకేఒక్క ఆటగాడి విషయంలో ఇది తిరగబడటం గమనార్హం. అతడేమన్నా సరిగ్గా ఆడకుండా ఉన్నాడా..? అంటే అదేం కాదు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అతడు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నెగ్గిన ప్లేయర్. ఇప్పటికే అర్థమై ఉంటుందిగా అతడె కెప్టెన్ శుబ్ మన్ గిల్. ఒకే సిరిస్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్ గా శుబ్ గిల్ నిలిచాడు. ఇంగ్లాండ్ పై 5 టెస్టుల్లో 754 పరుగులు చేశాడు. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ 801 తరువాత శుబ్ మన్ గిలే రికార్డు. మరోవైపు అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాడు. తాను ప్రతీ సీజన్ లో సెంచరీ చేసి ఔరా అనిపిస్తాడు. అలాగే టీమిండియా టీ-20 క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ముందు ముందు వీరిద్దరూ ఇంకెన్నీ రికార్డులను క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.