BigTV English

Cable TV Price Hike: మొబైల రిచార్జ్ పెంపు తర్వాత ఇక కేబుల్ టీవి ధరలు పైపైకి.. సామాన్యుడిపై మరింత భారం!

Cable TV Price Hike: మొబైల రిచార్జ్ పెంపు తర్వాత ఇక కేబుల్ టీవి ధరలు పైపైకి.. సామాన్యుడిపై మరింత భారం!

Cable TV Price Hike| కేంద్ర ప్రభుత్వం కేబుల్ టీవి ఆపరేటర్లపై టారిఫ్, జిఎస్‌టీ పెంచింది. దీంతో కేబుల్ టీవి ద్వారా ఛానెల్స్ చూస్తున్న ప్రజలకు త్వరలోనే ఎక్కువ బిల్లు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే పెరిగిన జిఎస్‌టి, టారిఫ్ రేట్లను భరించడానికి కేబుల్ టివి ఆపరేటర్లు ఆ భారాన్ని వినియోగదారుల(ప్రజలు)పై మోపుతారు. ఈ సంవత్సరం జూలై లోనే జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి టెలికామ్ కంపెనీలు మొబైల్ రిచార్జ్ పెంచేడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో అసహనం వ్యక్తమైంది. అందుకే సర్వేస్ అద్భుతంగా లేకపోయినా చాలామంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ వైపుకు మళ్లారు.


అయితే మొబైల్ రిచార్జ్ పెంపు భారం మోస్తున్న సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేబుల్ టివి ధర పెంపుతో మరింత భారం మోపింది. కేంద్ర ప్రభుత్వం విభాగమైన ట్రాయ్ (టెలికామ్ రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కేబుల్ టివి ఆపరేటర్ టారిఫ్, జిఎస్‌టిని పెంచుతూ ఇటీవల ప్రకటన జారీచేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది.

కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ప్రతి ఛెనెల్ టారిఫ్ రేటు పెరుగుతుంది. జిఎస్‌టి పన్ను కూడా 18 శాతం పెంచబడింది. అయితే కేబుల్ టివి ఆపరేటర్లు జిఎస్‌టి పెంపుపై మండిపడుతున్నారు. 18 శాతం జిఎస్‌టి కి బదులుగా 5 శాతం జిఎస్‌టి విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ట్రాయ్ రేటుపెంపుపై వ్యతిరేకత ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తోంది. ఎఎంఎంకె వ్యవస్థాపకుడు టిటివి ధినకరన్ కేబుల్ టివి పన్ను, టారిఫ్ పెంపు పై సోషల్ మీడియాలో తాజాగా ఒక పోస్ట్ చేశారు. ఆయన జిఎస్‌టి 18 శాతం చాలా ఎక్కువ అని.. దాన్ని 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు.

Also Read: ఇక యూట్యూబ్ నుంచి ఫ్లిప్ కార్ట్, మింత్ర షాపింగ్.. కంటెంట్ క్రియేటర్లకు జాక్‌పాట్

ప్రజలపై ఎంత భారం?
జిఎస్‌టి శాతం పెంపుతో కేబుల్ టివి వినియోగదారులపై ప్రత్యక్షంగా దీని ప్రభావం పడుతుంది. ఉదాహరణకు కేబుల్ టివి ఆపరేటర్లపై ప్రభుత్వం 18 శాతం జిఎస్‌టి విధిస్తే.. ఆ కారణంగా పెరిగిన భారం భరించడానికి ప్రతినెలా వినియోగదారుల నుంచి కేబుల్ ఆపరేటర్లు ఎక్కువ వసూలు చేస్తారు. ఒకవేళ వినియోగదారులు ప్రతినెలా ఇంట్లో కేబుల్ టివి ద్వారా సినిమాలు, వార్తలు .. లాంటివి చూసేవారు రూ.500 చెల్లిస్తుంటే వారు ఇకపై 18 శాతం జిఎస్‌టితో కలిపి రూ.590 చెల్లించాలి. ఒకవేళ ఎక్కువ ఛానెల్స్ చూసేవారు రూ.1000 చెల్లిస్తుంటే.. వారు ఇకపై రూ.1180 చెల్లించాలి. ఈ పరిస్థితుల్లో సామాన్యుడి కేబుల్ టివి నెల బిల్లు భారీగా పెరిగిపోతుంది.

కేబుల్ టివి ఆపరేటర్ల పై ఎక్కువ ప్రభావం
భారత దేశంలో ఈ రోజుల్లో ప్రజలు నేరుగా ఇంటర్నెట్ కనెక్షన్ తోనే ఓటిటి యాప్స్ టివి ఛానెల్స్ చూస్తున్నారు. ఇలా చూసేవారి సంఖ్య ప్రస్తుతానికి తక్కువగా ఉన్నా.. క్రమంగా పెరుగుతోంది. కొందరైతే టాటా స్కై, డిష్ టివి మాధ్యమంలో వైర్ లెస్ మోడ్ లో ఛానెల్స్ చూస్తున్నారు. ఈ కొత్త పద్ధతులు రావడంతో కేబుల్ టివి ఆపరేటర్లు తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఇంకా వారిపై 18 శాతం జిఎస్‌టి పెంచడం అంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టే.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×