E-Paper
Advertisement

హోటల్‌కు వెళ్తున్నారా? స్టే కోసం నో ఆధార్ జెరాక్స్, కొత్త రూల్స్ వచ్చేశాయి

హోటల్‌కు వెళ్తున్నారా? స్టే కోసం నో ఆధార్ జెరాక్స్, కొత్త రూల్స్ వచ్చేశాయి
Advertisement

Hotel Stay Rules: ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఒకరోజు ఉండిపోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటప్పుడు హోటల్‌లో స్టే చేయాలని భావిస్తున్నారు చాలామంది. కాకపోతే ఆధార్ జెరాక్స్ ఉండాల్సిందేనని నిర్వాహకులు మొండి కేస్తున్నారు. లేకుంటే రూమ్ ఇచ్చేది లేదని అంటున్నారు. ఇక ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి. ఇంతకీ ఆ రూల్స్ గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

హోటల్ బస కోసం కొత్త నిబంధనలు

ఫ్యామిలీ, వ్యక్తిగత టూర్ వెళ్లినప్పుడు హోటల్‌లో స్టే చేస్తుంటారు చాలామంది. హోటళ్లలో చెక్-ఇన్ సమయంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఆధార్ జిరాక్స్. అది లేకుంటే రూమ్ ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు నిర్వాహకులు. ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పడనుంది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ చెక్-ఇన్ ప్రక్రియలో కొత్త మార్పులు రానున్నాయి. హోటళ్లలో స్టే ఉండేందుకు ఆధార్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా డిజిటల్ పద్ధతిలో ఐడెంటిటీని నిర్ధారించుకోవచ్చు. త్వరలో ఈ పద్దతి అందుబాటులోకి రానుంది.

Advertisement

 

ఆధార్ జెరాక్స్ అవసరం లేదు

కొత్త విధానంలో మార్పులేంటి? QR కోడ్ – OTP ధృవీకరణ చేసుకోవచ్చు. రూమ్ బుక్ చేసుకునే సమయంలో జిరాక్స్ ఇచ్చే బదులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. దీనివల్ల జిరాక్స్ సమస్య ఉండదు. అనుకోని పరిస్థితుల్లో అర్ధరాత్రి హోటల్‌కు వెళ్లినప్పుడు ఆధార్ జిరాక్స్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు.

Advertisement

 

కొత్త డిజిటల్ విధానం

ఐడెంటిటీ చెకింగ్ ప్రాసెస్ మరింత వేగవంతం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది UIDAI. ఈ విధంగా చేయడం వల్ల పేపర్ వాడకాన్ని తగ్గడంతోపాటు డిజిటల్ విధానాలను ప్రోత్సహించినట్లు అవుతుందని చెబుతోంది. అంతేకాదు డేటా భద్రత ఉంటుందని పేర్కొంది. మనం హోటళ్లకి ఇచ్చే ఆధార్ జిరాక్స్ వల్ల సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లదు. డిజిటల్ చెక్-ఇన్ ద్వారా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగంకాదు. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త డిజిటల్ విధానం వల్ల హోటల్ చెక్-ఇన్ ప్రాసెస్ తేలిగ్గా పూర్తి కానుంది.

ALSO READ: బాబోయ్ రూ.22,000 కోట్ల రుణ మాఫీ.. బడా వ్యాపారవేత్తకు కోర్టు భారీ ఉపశమనం

Related News

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

చెక్ బౌన్స్ టెన్షనా?అకౌంట్ క్లోజ్ చేసే రైట్స్ బ్యాంకులకు ఉన్నాయా?

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

Big Stories

Advertisement
×