E-Paper
Advertisement

సామాన్యుడికి షాకిస్తున్నగుడ్లు.. వాటి ధరల పెంపుకు-ఇథనాల్‌కు సంబంధం ఏంటి?

సామాన్యుడికి షాకిస్తున్నగుడ్లు..  వాటి ధరల పెంపుకు-ఇథనాల్‌కు సంబంధం ఏంటి?
Advertisement

Ethanol Vs Egg Prices Rise: కొన్నాళ్లుగా గుడ్ల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇంతకీ గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఉత్పత్తి లేకపోవడమా? లేక కోళ్లకు వేసే దాణా సరఫరా లేకపోవడమా? గుడ్ల ధరల పెంపు-ఇథనాల్‌కు అసలు సంబంధం ఏంటి? ఇథనాల్ డిమాండ్ వల్ల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయా? అవుననే అంటున్నాయి ఫౌల్ట్రీ వర్గాలు.

 

సామాన్యుడికి షాకిస్తున్న గుడ్ల ధరలు

Advertisement

సామాన్యుడికి తక్కువ ధరకు లభించేవాటిలో గుడ్డు కీలకమైనది. కర్రీతోపాటు అందులో పోషకాలు ఉంటాయి. అందుకే వాటిని తినేందుకు అధికంగా ఇష్టపడతారు. తక్కువ ధర కావడం ఇందుకు ప్రధాన కారణం. ఆహార వస్తువులతోపాటు ఇప్పుడు గుడ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఏడాది కాలంలో గుడ్ల ధరలు సుమారు 35-40 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పెరుగుదలకు కోళ్ల మేత ధరలు పెరగడమే కారణం. కోళ్ల దాణాలో కీలకమైనది మొక్కజొన్న. మొక్కజొన్నకు ఇథనాల్ పరిశ్రమ నుంచి డిమాండ్ పెరగడమే  ప్రధాన కారణం. ఫలితంగా కోళ్ల మేత ఖర్చులపై అమాంతంగా పెరగడం కారణంగా చెబుతున్నారు.

 

కోళ్ల మేతపై నివేదికలు ఏం చెబుతున్నాయి?

Advertisement

జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ-NECC నివేదిక మేరకు ఒక్కో గుడ్డు ధర సుమారు రూ. 7 లకు చేరింది. రిటైల్ మార్కెట్లలో రూ. 8.50 నుంచి రూ. 9 వరకు పలుకుతోంది. గడిచిన ఏడాదిగా పరిశీలన చేస్తే.. ధరలు 35 నుంచి 40 శాతం పెరిగినట్టు తేలింది. ఫలితంగా వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాస్తవానికి గుడ్ల ధరలు పెరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటి మేత ఖర్చులో కీలక పాత్ర. పౌల్ట్రీ పరిశ్రమ ఉత్పత్తి వ్యయంలో మేత విభాగానికి పెద్ద వాటా. అందులో ఉపయోగించే మొక్కజొన్న, సోయాబీన్ వంటి ముడి సరుకు ధరల మార్పుల వల్ల కోళ్ల పెంపకం ఖర్చుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కోళ్ల ఉత్పత్తి ఖర్చులలో దీని వాటా సుమారు 65-70 శాతం ఉంటుంది.

 

అమాంతంగా పెరిగిన మొక్కజొన్న ధర

అందువల్ల మొక్కజొన్న ధరలో పెరుగుదలను తట్టుకోవడం ఫౌల్ట్రీ రైతులు కష్టంగా మారింది. మూడేళ్ల కిందట టన్ను సుమారు రూ. 14,000 ఉండేది. ఇప్పుడు దాదాపు రూ. 26,500కు పెరిగింది. గడిచిన ఐదు నెలల్లో వాటి ధరలు దాదాపు 20 శాతం పెరిగాయి. కోడికి మేత ఖర్చు ఎక్కువైనప్పుడు గుడ్లు-కోడి మాంసం ఖరీదైనదిగా మారింది. సోయాబీన్ ధరలు-వాతావరణ పరిస్థితులు-పక్షుల మరణాలు వంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. కోళ్ల పెంపకం ఖర్చులు పెరగడానికి ఇథనాల్ ఒక్కటే కారణం కాదు. ఈ సమీకరణంలో అది అంతకంతకూ భాగంగా మారుతోంది. పౌల్ట్రీ పరిశ్రమకు మొక్కజొన్న ప్రధాన ముడిసరుకు. మొత్తం వినియోగంలో సుమారు 60 శాతం వాటాను కలిగి ఉంది.

 

ఇథనాల్‌కు ప్రధాన వనరుగా మొక్కజొన్న

ఇథనాల్ తయారీదారులు ఎక్కువగా మొక్కజొన్నను ఎందుకు కొనుగోలు చేస్తారు? పెట్రోలియం దిగుమతులు తగ్గించుకునేందుకు ఈ మధ్యకాలం దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ప్రధాన కారణం. ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న వినియోగం గణనీయంగా పెరిగింది. మొక్కజొన్న అనేది ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన ముడి సరుకు. ఇథనాల్ ప్లాంట్లకు అవసరమైన మొక్కజొన్న లభ్యతను పెంచడంతోపాటు, ప్లాంట్ల చుట్టు పక్కల ప్రాంతాల్లో వాటి సాగును ప్రోత్సాహానికి అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఫలితంగా మొక్కజొన్నకు డిమాండ్‌ పెరిగింది.

మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి 2022లో సుమారు 10 లక్షల టన్నులు ఉండేది. 2024 నాటికి అది 60 లక్షల టన్నులను దాటింది. పరిశ్రమ అంచనాల మేరకు.. ఇప్పుడు సుమారు 170 లక్షల టన్నులకు చేరుకుంది. 2030 నాటికి 250 లక్షల టన్నులకు చేరుతుందని ఓ అంచనా. ఫలితంగా ఇథనాల్ ఉత్పత్తిదారులు ఆ పంట కోసం కోళ్ల పెంపకం దారులతో పోటీ పడుతున్నారు. మొక్కజొన్న ఉత్పత్తిలో సుమారు 37 శాతం ఇథనాల్ డిస్టిలరీలకు వెళ్తోందని NECC అధికారి ఒకరు వెల్లడించారు.

ALSO READ: యుట్యూబ్ లేదా ఫ్రీ లాన్సింగ్ ద్వారా సంపాదిస్తున్నారా? ఆగస్టు 31 ఐటిఆర్ ఫైలింగ్‌లో ఈ తప్పులు చేయకండి

ఒకప్పుడు మొక్కజొన్న ఎగుమతిదారుడిగా భారత్ ఉండేది. ఇప్పుడు దిగుమతిదారుగా మారింది. తన వాణిజ్య అవసరాలకు 2025 ఆర్థిక సంవత్సరంలో మయన్మార్, ఉక్రెయిన్ నుండి 10 లక్షల టన్నుల మొక్కజొన్నను దిగుమతి చేసుకుంది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం.. దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకుంటే దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. దేశంలోని శీతాకాలం సీజన్‌లో వివిధ ప్రాంతాల్లోని గుడ్ల వినియోగం సాధారణంగా పెరుగుతుంది. కోళ్ల పెంపకందారులు పెరిగిన మేత ఖర్చులను ఎదుర్కొంటున్న సమయంలో ఇది కాలానుగుణంగా డిమాండ్‌ను మరింత పెంచుతుంది. గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ లెక్కన గుడ్ల ధరలకు రెక్కలు కావడం ఖాయం.

Related News

యుట్యూబ్ లేదా ఫ్రీ లాన్సింగ్ ద్వారా సంపాదిస్తున్నారా? ఆగస్టు 31 ఐటిఆర్ ఫైలింగ్‌లో ఈ తప్పులు చేయకండి

సగం ధరకే ఉల్లి విక్రయిస్తున్న ప్రభుత్వం.. మరి చక్కెరపై డిస్కౌంట్ ఎందుకు లేదు?

బాబోయ్.. ఇంటర్న్‌షిప్ చేస్తే నెలకు రూ.30 లక్షలు.. ఆ స్కిల్స్ ఉంటేనే

హెచ్చుతగ్గుల్లో పసిడి-వెండి ధరలు, మార్కెట్లో ఇవాళ రేటు మాటేంటి?

చనిపోయిన కోటీశ్వరుడు.. భార్యకు ప్రతి నెలా రూ.1000 మాత్రమే.. ఎందుకంటే

భారీగా పెరిగిన కార్పొరేట్ కంపెనీల ఆదాయం.. ఉద్యోగుల జీతాలు అంతంత మాత్రమే

పుత్తడి ప్రియులకు ఊహించని షాక్.. పైపైకి బంగారం-వెండి ధరలు, మార్కెట్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×