Foods To Avoid While Flu| వర్షాకాలంల, చలికాంలో జలుబు చేయడం చాలా సహజం కానీ సమస్య వచ్చినప్పుడు చాలా నీరసంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. జ్వరం, తుమ్ములు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమయంలో శరీరానికి తగినంత విశ్రాంతి, నీరు, పోషకాహారం అవసరం. ఆహారం.. జలుబు సమస్యను నయం చేయదు లేదా ఇన్ఫెక్షన్ రాకుండా పూర్తిగా అడ్డుకోదు. అయితే సరైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమయంలో శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. కానీ కొన్ని ఆహారాలు మాత్రం కడుపు అసౌకర్యం లేదా గొంతు ఇబ్బందిని పెంచవచ్చు.
జ్వరం వచ్చినప్పుడు చెమట ద్వారా శరీరం ఎక్కువ ద్రవాలను కోల్పోతుంది. వాంతులు లేదా విరేచనాలు ఉంటే నీరు, ఎలక్ట్రోలైట్ల నష్టం మరింత పెరుగుతుంది.
అందుకే రోజంతా కొద్దికొద్దిగా ద్రవాలు తీసుకోవడం మంచిది. నీరు, తేలికపాటి సూప్, కొబ్బరి నీరు, టీ లేదా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోవాలి. చికెన్ సూప్ కూడా ద్రవాలను అందించి అనారోగ్య సమయంలో కొంత ఉపశమనం కలిగిస్తాయి.
జ్వరం, వికారం లేదా కడుపు సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్దికొద్దిగా తీసుకోవడం మంచిది. పెసరపప్పు ఖిచ్డీ, తేలికపాటి ఉప్మా వంటి మెత్తని ఫుడ్స్ మంచి ఎంపికలు. వెజ్, నాన్ వెజ్సూప్‌లు, తేలికపాటి సలాడ్లు కూడా తీసుకోవచ్చు.
ఆకలి ఉన్నప్పుడు గుడ్లు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. పెరుగు కూడా ప్రోటీన్‌ను అందిస్తుంది. పైగా ఇందులో ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి.
ఆరెంజ్, బెర్రీలు, కివీ, మెలన్, బొప్పాయి వంటి పండ్లు తింటే ఆరోగ్యకరం. ఇవి శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, ద్రవాలను అందించడంలో సహాయపడతాయి. సమతుల్యమైన ఆహారం ద్వారా అవసరమైన పోషకాలను పొందడం మంచిది.
వేయించిన ఆహారం అనారోగ్యం చేసినప్పుడు సులభంగా జీర్ణం కావడం కష్టం. కడుపు ఇప్పటికే ఇబ్బందిగా ఉంటే ఈ ఆహారాలు అసౌకర్యాన్ని మరింత పెంచుతాయి.
అందుకే తేలికగా వండిన ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది.
జ్వరం, చెమట, వాంతులు లేదా విరేచనాలు వల్ల శరీరం నుంచి ద్రవాలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఇలాంటి సమయంలో మద్యం తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి పూర్తిగా కోలుకునే వరకు మద్యానికి దూరంగా ఉండాలి.
కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవడం అనారోగ్య సమయంలో సరైన ఎంపిక కాదు. ముఖ్యంగా శరీరానికి ఎక్కువ ద్రవాలు అవసరమైనప్పుడు వీటిని పరిమితం చేయడం మంచిది. వాటికి బదులుగా నీరు లేదా తేలికపాటి సూప్‌లు తీసుకోవాలి.
కారం ఎక్కువగా ఉన్న ఆహారం అప్పటికే ఇబ్బందికరంగా ఉండే గొంతును మరింత ఇబ్బంది పెట్టవచ్చు. కడుపులో అసౌకర్యం లేదా వికారం ఉన్నప్పుడు సమస్యను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లూ సమయంలో తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోండి.
ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఇతర తీపి పానీయాల్లో ఎక్కువ చక్కెర ఉండవచ్చు. ఇవి అనారోగ్య సమయంలో శరీరానికి అవసరమైన సమతుల్య పోషకాలను అందించకపోవచ్చు.
వాటికి బదులుగా నీరు, తాజా పండ్లు తీసుకోవడం మంచిది.
ఆకలి తక్కువగా ఉన్నప్పుడు భోజనం ఫుల్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఈ హెవీ ఫుడ్ కడుపులో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అందుకే ఆకలిని బట్టి చిన్న మొత్తాల్లో ఆహారం తీసుకోవడం మంచిది.
తగినంత నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆకలిని బట్టి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోండి. లక్షణాలు తీవ్రంగా మారితే లేదా ఎక్కువకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించండి.
గమనిక: ఈ సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే అందించబడింది. వైద్యుల సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు.