E-Paper
Advertisement

బాబోయ్.. ఇంటర్న్‌షిప్ చేస్తే నెలకు రూ.30 లక్షలు.. ఆ స్కిల్స్ ఉంటేనే

బాబోయ్.. ఇంటర్న్‌షిప్ చేస్తే నెలకు రూ.30 లక్షలు.. ఆ స్కిల్స్ ఉంటేనే
Advertisement

High Paying Internship Skills| సాధారణంగా విద్యార్థులకు పరిశ్రమలో పని అనుభవం కోసం ఇంటర్న్‌షిప్ చేస్తారు. కంపెనీలు కూడా ఫ్రెషర్స్‌కు తగిన వర్క్ నాలెడ్జ్ కలుగుతుందని ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తుంటారు. ఇలాంటి ఇంటర్న్‌షిప్ చేసేవారికి సాధారణంగా నామ మాత్రపు స్టైపెండ్ ఉంటుంది లేదా చెల్లింపులు ఏమీ ఉండవు. అయితే కొంతమంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇప్పుడు భారీ మొత్తంలో చెల్లింపులు అందుతున్నాయి. భారీ మొత్తంలో అంటే వేలల్లో కాదు లక్షల్లో అది కూడా నెలకు రూ.30 లక్షల వరకు. కానీ అంత పేమెంట్ పొందాలంటే ముందు తగిన స్కిల్స్ (నైపుణ్యం) ఉండాలని కంపెనీలు చెబుతున్నాయి. ఆ స్పెషల్ స్కిల్స్ ఉంటే తాము లక్షల్లో జీతాలు చెల్లించడానికి రెడీ అని కొన్ని కంపెనీలు ప్రకటించాయి.

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కంపెనీలు.. స్పెషల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులను ఆకర్షించేందుకు భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తున్నాయి. గురుగ్రామ్‌కు చెందిన క్వాడ్ ఐ (Quadeye) రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కు సుమారు రూ.60 లక్షలు అందిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంటే నెలకు దాదాపు రూ.30 లక్షలు అందుతున్నాయి. గ్రావిటేషన్ రీసెర్చ్ క్యాపిటల్ (Graviton Research Capital) అనే మరో కంపెనీ రెండు నెలలకు సుమారు రూ.50 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం. అలాగే ఐఎంసి ట్రేడింగ్ IMC Trading, ఆప్టివర్ (Optiver) వంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా సుమారు రూ.50 నుంచి 60 లక్షల ప్యాకేజీలను అందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంత భారీ చెల్లింపుల వెనుక అరుదైన టెక్నికల్ స్కిల్స్ కలయిక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మ్యాథమెటిక్స్, కోడింగ్‌ భారీ డిమాండ్

Advertisement

ఈ సంస్థలు కేవలం స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉన్న విద్యార్థులను మాత్రమే కోరుకోవడం లేదు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్‌లో బలమైన నైపుణ్యాలు ఉన్న క్వాంటిటేటివ్ టాలెంట్ ఉండాలని కంపెనీలు చెబుతున్నాయి. ఇలాంటి నిపుణులు భారీ మొత్తంలో మార్కెట్ డేటాను పరిశీలిస్తారు. ఆ డేటాలో లాభదాయకమైన ట్రేడింగ్ అవకాశాలను సూచించే మోడల్స్ గుర్తిస్తారు.
తర్వాత ఆ మోడల్స్ టెస్ట్ చేసేందుకు మేథమెటిక్స్ మోడల్స్ రూపొందిస్తారు. విజయవంతమైన వ్యూహాలను ఆటోమేటెడ్ ట్రేడింగ్ సిస్టమ్స్‌గా మార్చగలరు. అందుకే మ్యాథమెటిక్స్, కోడింగ్ కలయిక ట్రేడింగ్ కంపెనీలకు ఎంతో విలువైనదిగా మారింది.

క్వాంట్ రీసెర్చర్ అంటే ఏం చేయాలి?

క్వాంటిటేటివ్ రీసెర్చర్‌ను సాధారణంగా క్వాంట్ అని పిలుస్తారు. క్వాంట్‌లు డేటా, గణితం ఉపయోగించి ఆర్థిక మార్కెట్లను విశ్లేషిస్తారు. ట్రేడింగ్ సిస్టమ్స్‌కు ఉపయోగపడే మోడల్స్‌ను అభివృద్ధి చేస్తారు. ఈ మోడల్స్.. భారీ డేటాను మనుషుల కంటే వేగంగా విశ్లేషించగలవు. అలాగే తక్కువ సమయంలో వేలాది మార్కెట్ సిగ్నల్స్‌ను వెంటనే టెస్ట్ చేయగలవు. హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌లో వేగం చాలా కీలకమైన అంశంగా ఉంటుంది. కంప్యూటర్లు మార్కెట్ అవకాశాలను గుర్తించి చాలా తక్కువ సమయంలో ట్రేడ్స్‌ను అమలు చేస్తాయి.
టైమింగ్, స్పీడ్ విషయంలో చిన్న వ్యత్యాసం కూడా వేలాది ట్రేడ్స్‌లో పెద్ద ప్రయోజనాన్ని అందించగలదు.

ఈ నైపుణ్యాలకు భారీ డిమాండ్ ఎందుకు?

Advertisement

భారత్‌లో డెరివేటివ్స్ మార్కెట్ కఠినమైన నిబంధనలు, తక్కువ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఎదుర్కొంటోంది. రాయిటర్స్ మీడియా రిపోర్ట్ ప్రకారం.. జూలైలో ఈక్విటీ ఫ్యూచర్స్, ఆప్షన్స్ సగటు రోజువారీ టర్నోవర్ 27.1 శాతం తగ్గింది. ఇది నవంబర్ 2023 తర్వాత నమోదైన అత్యల్ప స్థాయిగా నిలిచింది. అయినప్పటికీ, అవకాశాలను గుర్తించగల టాలెంట్ కోసం సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది.

భారత విద్యార్థులపై గ్లోబల్ కంపెనీల దృష్టి

భారతీయ కంపెనీలతో పాటు అంతర్జాతీయ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ (HFT) కంపెనీలు కూడా భారత విద్యార్థులను నేరుగా నియమించుకుంటున్నాయి. IMC Trading, Optiver వంటి కంపెనీలు.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పై మరింత దృష్టి పెడుతున్నాయి. భారతీయ ట్రేడింగ్ కంపెనీలు కూడా ఇతర ఆస్తులు, అంతర్జాతీయ మార్కెట్ల వైపు విస్తరిస్తున్నాయి. దీంతో మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్ ‌లో బెస్ట్ స్కిల్స్ ఉన్న విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి.

Also Read: చనిపోయిన కోటీశ్వరుడు.. భార్యకు ప్రతి నెలా రూ.1000 మాత్రమే.. ఎందుకంటే

భవిష్యత్తులో ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయి

క్వాంటిటేటివ్ ఫైనాన్స్‌లో కెరీర్‌కు కేవలం ఫైనాన్స్ నాలెడ్జ్ సరిపోదు. మ్యాథమెటికల్ రీజనింగ్, ప్రోగ్రామింగ్, డేటా అనాలిసిస్, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం. అందుకే ఇంజినీరింగ్ విద్యార్థులు.. టెక్నాలజీ, మ్యాథ్స్, డేటాను కలిపి ఉపయోగించడం నేర్చుకోవాలి.

Also Read: భారీగా పెరిగిన కార్పొరేట్ కంపెనీల ఆదాయం.. ఉద్యోగుల జీతాలు అంతంత మాత్రమే

Tags

Related News

హెచ్చుతగ్గుల్లో పసిడి-వెండి ధరలు, మార్కెట్లో ఇవాళ రేటు మాటేంటి?

చనిపోయిన కోటీశ్వరుడు.. భార్యకు ప్రతి నెలా రూ.1000 మాత్రమే.. ఎందుకంటే

భారీగా పెరిగిన కార్పొరేట్ కంపెనీల ఆదాయం.. ఉద్యోగుల జీతాలు అంతంత మాత్రమే

పుత్తడి ప్రియులకు ఊహించని షాక్.. పైపైకి బంగారం-వెండి ధరలు, మార్కెట్లో రేట్లు పరిశీలిద్దాం

పేరెంట్స్‌కు బిగ్ అలర్ట్.. ఆధార్ కీలక అప్‌డేట్స్, ఇంకెందుకు ఆలస్యం

రూ.5 కోట్లు, రూ.10 కోట్లు.. హ్యాపీ రిటైర్మెంట్ కోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి..

పట్టు బిగిస్తున్న బ్యాంకు యూనియన్లు, దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు, ఐదు రోజులతోపాటు

Big Stories

Advertisement
×