Bubble Tea Billionaire | కొత్త బిజినెస్ ఐడియా కోసం మీరు ఆలోచిస్తున్నారా? ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్ ఐడియాతో ఎక్కువ లాభం సాధించాలనుకుంటున్నారా? అయితే, ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కొత్త బిజినెస్ ఐడియా ఏంటో తెలుసా? అదే బబుల్ టీ. మనకు సాధారణ టీ గురించి, టీ ఫ్రాంచైజీల గురించి తెలుసు. వాటి బిజినెస్ మోడల్ గురించి తెలుసు. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్ ఐడియా ఏంటంటే బబుల్ టీ. ఈ బబుల్ టీని విక్రయిస్తూ.. తాజాగా ఒక 38 ఏళ్ల యువకుడు వేల కోట్లకు పడగలెత్తాడు. అతని పేరే యునాన్ వాంగ్ (Yunan Wang) చైనాలోని యువ బిలియనీర్ ఇతను.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఇటీవల యునాన్ వాంగ్ సంస్థ ‘మింగ్ హోల్డింగ్స్’ ఐపీవో ప్రకటించగా.. దానికి అదరిపోయేలా స్పందన వచ్చింది. ఐపీవో ద్వారా యునాన్ కంపెనీ ఏకంగా 233 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో వాంగ్ నికర విలువ 1.2 బిలియన్ల డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ.10,419 కోట్లు) పెరిగింది. ఫలితంగా చైనా బిలియనీర్ల జాబితాలో యునాన్ చేరారు. ఆయన మింగ్ హోల్డింగ్స్ కంపెనీ ‘గుడ్‌మీ’ పేరుతో బబుల్ టీని విక్రయిస్తుంది. 2023 చివరి నాటికి చైనాలోని తొలి ఐదు బబుల్ టీ బ్రాండ్‌లలో 9.1 శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోయింది.
యునాన్ వాంగ్ బిలియనీర్‌గా ఎలా ఎదిగాడు?
38 ఏళ్ల యునాన్ వాంగ్ చైనాలోని ప్రముఖ బబుల్ టీ కంపెనీ గుమింగ్ హోల్డింగ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. అతని తల్లిదండ్రులు మయన్మార్ సరిహద్దుల్లో చిన్న రిటైల్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నారు. యునాన్ వాంగ్ 2010లో జెజియాంగ్ సైన్స్-టెక్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ ఏడాది దాదాపు 15 సంవత్సరాల క్రితం తన స్వస్థలమైన డాక్సీలో బబుల్ టీ షాపును ప్రారంభించారు. బబుల్ టీ బిజినెస్ ప్రారంభంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రోజుకు వాంగ్ బబుల్ టీ అమ్మకాలు కేవలం 100 యువాన్ల (సుమారు $18.50) వరకు మాత్రమే జరిగేవి. దీంతో పరిస్థితి మరింత దిగజారుతుందని భావించిన వాంగ్ తన సహ వ్యవస్థాపకుడితో కూల్‌డ్రింక్‌ను అమ్మడం ప్రారంభించారు.
దేశ వ్యాప్తంగా ఫ్రాంచైజీలు
రోజులు గడిచే కొద్దీ వాంగ్ అమ్మే బబుల్ టీ షాపుకు కస్టమర్ల తాకిడి ఎక్కువైంది. అమ్మకాలు జోరందుకున్నాయి. చైనా వ్యాప్తంగా మొత్తం 10 వేల బబుల్ టీ ఫ్రాంచైజీలతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా బబుల్ టీ బిజినెస్‌లో బిలియనీర్ అయ్యారు.
బబుల్ టీకి సూపర్ క్రేజ్
బోబా టీనే బబుల్ టీగా అవతరించింది. 1980లలో తైవాన్‌లో పుట్టిన బబుల్ టీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతకు యమక్రేజ్. ఈ బబుల్ టీని చల్లని పాలు, పండ్ల రసాలు, టాపియోకా (టాపియోకా అనేది కాసావా (Cassava) అనే మొక్క వేరు నుండి తయారు చేసే పిండి పదార్థం), మరియు జెల్లీ ముక్కలతో తయారు చేస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా తైవాన్, చైనా, ఇతర ఆసియా దేశాలలో ప్రాచుర్యం పొందింది. ఈ బబుల్ టీ అమ్మకాలు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నాయి. వివిధ రకాల పండ్ల రుచులు, చాక్లెట్, ఇతర ప్రత్యేక రుచులతో బబుల్ టీని విక్రయిస్తున్నారు.
ఈ బుబుల్ టీ ప్రత్యేకత ఏంటి?
బబుల్ టీ యొక్క ప్రత్యేకత దాని రుచి మరియు టెక్స్చర్‌లో ఉంది. ఇది సాధారణ టీ కంటే భిన్నంగా ఉంటుంది. టాపియోకా పియర్ల్స్ (బోబా) మరియు జెల్లీ ముక్కలు ఈ టీకి ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తాయి. ఇది యువత మధ్య ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియా మరియు ఇన్ఫ్లూయెన్సర్‌ల ప్రచారం కూడా దీని ప్రజాదరణకు కారణం.
భారతదేశంలో అవకాశాలు
భారతదేశంలో కూడా బబుల్ టీ క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాలలో యువత మధ్య ఇది ప్రాచుర్యం పొందుతోంది. ఈ బిజినెస్‌ను ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి తక్కువగా ఉండటం మరియు అధిక లాభాల అవకాశాలు ఉన్నాయి. ఫ్రాంచైజీ మోడల్ ద్వారా కూడా ఈ బిజినెస్‌ను విస్తరించవచ్చు.
బబుల్ టీ బిజినెస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. ఇది యువత మధ్య ప్రాచుర్యం పొందడంతో పాటు, అధిక లాభాలను అందిస్తోంది. మీరు కూడా ఈ బిజినెస్‌ను ప్రారంభించి విజయం సాధించవచ్చు. కొత్త బిజినెస్ ఐడియాతో ముందుకు సాగాలనుకుంటున్నారా? అయితే, బబుల్ టీ బిజినెస్ మీకు ఒక గొప్ప అవకాశం కావచ్చు!