Champions trophy Prize Money: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament )… మరో వారం రోజుల లోపే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అంటే దాదాపు 20 రోజులపాటు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament )… ఈసారి హైబ్రిడ్ మోడల్ లో జరగనుంది. వాసవానికి టోర్నమెంట్ మొత్తం పాకిస్తాన్ లో జరగాలి. కానీ పాకిస్తాన్ లో అడుగు పెట్టేందుకు టీమిండియా వెనకడుగు వేసింది. భద్రత కారణాలవల్ల అక్కడికి వెళ్లడం లేదు. దీంతో.. ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా ఆడే మ్యాచ్ లన్ని దుబాయిలో జరుగుతాయి.
Also Read: Telugu Warriors – CCL 2025: ఉప్పల్ లో అడుగుపెట్టిన హీరోలు… ఆ బస్సు మాత్రం అదుర్స్ !
అయితే టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ప్రైజ్ మనీ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలుచుకున్న వారికి.. 20.8 కోట్లు ఇవ్వబోతున్నారట. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి.. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 10.4 కోట్లు ఇవ్వబోతుందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇక సెమి ఫైనల్స్ లో నిలిచిన జట్లకు 5.2 కోట్లు దక్కబోతున్నాయి. ఇలా మూడు విభాగాలలో… ఛాంపియన్ ట్రోఫీ ప్రైస్ మనీ ( Champions trophy Prize Money ) ఇవ్వబోతుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అయితే దీనిపై ఐసీసీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది.
దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలుచుకున్న వారికి.. 20.8 కోట్లు ఇవ్వబోతున్నారని ఓ వార్త బయటకు రావడంతో… ఐసీసీపై ట్రోలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో.. రిషబ్ పంత్ జీతం కంటే.. తక్కువే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలుచుకున్న వారికి.. ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో.. రిషబ్ పంత్ జీతం రూ. 27 కోట్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేత కు కేవలం 20.8 కోట్లు మాత్రమే ఇస్తున్నారని ఇండియన్స్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఐసీసీ కంటే.. ఐపీఎల్ యాజమాన్యమే గొప్పది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా… ప్రపంచంలోనే.. బీసీసీఐ పాలక మండలి బలమైందని తెలుసుకోండి అంటూ అటు పాక్ ఫ్యాన్స్ కు కూడా చురకలు అంటిస్తున్నారు. రిషబ్ పంత్ ను రూ. 27 కోట్లు పెట్టి లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా…ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ తో టీమిండియా ఆడనుంది. ఈ నెల 23వ తేదీన పాకిస్థాన్ తో తలపడనుంది టీమిండియా.
Also Read: IPL 2025: దెబ్బకొట్టిన అంబానీ.. ఐపీఎల్ 2025, ఛాంపియన్స్ ట్రోఫీ ఫ్రీగా చూడలేం.. కొత్త ఛార్జీలు ఇవే ?
CHAMPIONS TROPHY PRIZE MONEY 💰
Champion – 20.8cr. 🥇
Runner Up – 10.4cr. 🥈
Semi Finalists – 5.2cr. 🥉 pic.twitter.com/C7GRnZIdL7
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2025
https://twitter.com/mufaddl_parody/status/1890293474542645407