BigTV English

Citroen Basalt: టాటా కర్వ్​కి పోటీగా సిట్రోయెన్​ బసాల్ట్.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

Citroen Basalt: టాటా కర్వ్​కి పోటీగా సిట్రోయెన్​ బసాల్ట్.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

Citroen Basalt Launching Soon: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సిట్రోయిన్‌ నుంచి త్వరలో మరో మోడల్ దేశీయ మార్కెట్‌లో లాంచ్ కావడానికి సిద్ధమైంది. కంపెనీ త్వరలో విడుదల చేయబోయే ‘సిట్రోయిన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే’ని తాజాగా ఆవిష్కరించింది. దేశీయ అత్యంత బడ్జెట్ ఎస్యూవీ కూపేలుగా టాటా కర్వ్, సిట్రోయిన్ బసాల్ట్ నిలువనున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో ఈ రెండు కార్లు లాంచ్ కానుండగా.. టాటా కర్వ్‌కి సిట్రోయిన్ బసాల్ట్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇక బసాల్ట్ మోడల్ లాంచ్‌కు ముందే కంపెనీ ఈ కారుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.


సిట్రోయిన్ బసాల్ట్ కారు హెడ్‌ల్యాంప్‌లు సీ3 ఎయిర్‌క్రాస్‌లో వచ్చే విధంగా తయారు చేయబడ్డాయి. దీని ఫ్రంట్ సైడ్ చంకీ బంపర్‌ను అందించారు. అదే సమయంలో బ్యాక్ సైడ్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో సహా కొత్త టెయిల్ ల్యాంప్స్‌ను అందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు కొత్త రకం సిల్హౌట్‌తో రానుంది. దీనికి రెండు వైపులా కొత్త అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. కాగా సిట్రోయిన్ బసాల్ట్ దేశీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సీ3 అండ్ సీ3 ఎయిర్ క్రాస్‌ల డిజైన్‌ కంటే మరింత మెరుగైన డిజైన్‌తో వచ్చిందని తెలిపింది.

Also Read: లాంచ్‌కు సిద్ధమైన టాటా కర్వ్.. ఆగస్టు 7 న లాంచ్.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!


ఈ బసాల్ట్ కారు లోడెడ్ ఇంటీరియర్‌ని కలిగి ఉంటుంది. ఇందులో వెబ్రాంట్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, కప్ హోల్డర్లతో కూడిన ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్‌రెస్ట్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కార్ బ్యాక్ సైడ్ ఫోన్ హోల్డర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందించారు. ఇంకా వైర్‌లెస్ ఆండ్రాయి ఆటో ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ కంట్రోల్ వంటి మరెన్నో అనేకమైన ఫీచర్లను అందించారు.

బసాల్ట్ కారులో 1.2 లీటర్ మూడు సిలిండర్లు టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇంజన్ 109 బిహెచ్‌పి, 205 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌తో వస్తుంది. కాగా ఈ కారు రిలీజ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. దీనికి సంబంధించిన ధర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Related News

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

Big Stories

×