Big Stories

Gas Cylinder Price Cut by Rs. 30.50: గుడ్ న్యూస్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.30.50 మేర తగ్గింపు!

Gas Cylinder Price Decreased
Gas Cylinder Price Decreased

Gas Cylinder Price Cut By Rs 30.50 from  April 1st 2024: ప్రతినెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు వస్తాయి. ఎక్కువశాతం సిలిండర్ ధరను పెంచుతుంటాయి చమురు సంస్థలు. లోక్ సభ ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.30.50 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు. అలాగే 5 కేజీల FTL సిలిండర్ ధర రూ.7.50 మేర తగ్గింది. తగ్గిన ధరతో.. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియర్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1764.50గా నమోదైంది.

- Advertisement -

ఈ ఏడాది మార్చి 1న గ్యాస్ సిలిండర్ ధరను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు సంస్థలు. దీంతో అన్ని మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ముఖ్యంగా ఇండేన్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. అయితే.. తాజాగా ధరల తగ్గింపుకు కారణాలు తెలియనప్పటికీ.. చమురు ధరలు తగ్గడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు

సోమవారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలు విడుదలయ్యాయి. వీటిలో పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.41 వద్ద స్థిరంగా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.95.65గా ఉంది.

Also Read: కొత్త ఆర్థిక సంవత్సరంలో సరికొత్త ఆర్థిక నిర్ణయాలు ఏంటో తెలుసా..?

ఒక్క ఎస్ఎంఎస్ పంపడంతో.. పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వినియోగదారు అయితే..RSP మీ సిటీ కోడ్ టైప్ చేసి 9224992249 కు మెసేజ్ పంపండి. HPCL వినియోగదారులైతే HPPrice సిటీ కోడ్ రాసి 9222201122కు ఎస్ఎంఎస్ చేయండి. తాజా పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు మీ మొబైల్ కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News