E-Paper
Advertisement

Chiranjeevi: చిరంజీవి ఇలాంటి సినిమాలు చూస్తాడా.. అస్సలు నమ్మలేరు

Chiranjeevi: చిరంజీవి ఇలాంటి సినిమాలు చూస్తాడా.. అస్సలు నమ్మలేరు
Advertisement
Chiranjeevi latest news
Chiranjeevi

Chiranjeevi latest news(Film news in telugu today): మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వినగానే సినీ ప్రియులు, అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం. ఈ పేరు వినగానే ఫుల్ ఎనర్జీ, ఎంతోమంది నటీ నటులకు ఆయన నిదర్శనం. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.

అయితే అలాంటి కృషితో మెగాస్టార్ చిరంజీవి రుషి కాకపోయినా తన కష్టంతో సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసుకున్నారు. ఎంతో మందికి స్పూర్తిదాయకంగా మారారు. ఆయన స్పూర్తితో ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగిన వారున్నారు. అంతటి గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

Advertisement

ఈ మధ్య వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. కుర్ర హీరోలతో సమానంగా 60ఏళ్ల వయస్సులో కూడా వెనక్కి తగ్గడం లేదు. తమ అభిమానులను అలరించేందుకు చిరు ఎంతటి కష్టాన్నైనా లెక్కచేయడు. ఫుల్ మాస్ యాక్షన్ సినిమాలలో ఫైట్లు, డైలాగ్‌లతో దుమ్ము దులిపేస్తుంటాడు. డాన్స్, స్వాగ్‌తో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ తెప్పిస్తుంటాడు. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేయడానికి ముందుంటాడు మెగాస్టార్.

Also Read: త్వరలో జబర్దస్త్ యాంకర్ రష్మి పెళ్లి.. జాతకాలు కూడా కలిసాయి.. వరుడు ఎవరంటే..?

Advertisement

అయితే యాక్షన్‌ సినిమాలతో దుమ్ము దులిపేస్తున్న మెగాస్టార్.. ఫ్రీగా ఉన్నప్పుడు ఎలాంటి సినిమాలు చూస్తారు అనే డౌట్ కొందరికి ఉండొచ్చు. తాజాగా అదే డౌట్‌ను మెగాస్టార్ క్లియర్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను ఫ్రీగా ఉన్నప్పుడు ఎలాంటి సినిమాలు చూస్తాడో వివరించాడు. దీంతో ఆయన చెప్పిన సినిమాల లిస్ట్ నెటిజన్లకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే మరి చిరు చెప్పిన సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ ప్రశ్న అడిగాడు. మీరు ఎలాంటి సినిమాలను చూడ్డానికి ఇష్టపడతారు అనే ప్రశ్నకు చిరు సమాదానం ఇస్తూ.. ‘‘నేను చూసే సినిమాలు చెప్తే నవ్వుతారు. నేను మిక్కిమౌస్, లార్లెన్ హార్డీ వంటి కామెడీ సినిమాలను చూస్తుంటాను. అయితే సినిమాలుగా చూడాల్సి వస్తే మాత్రం.. జాకీచాన్ సినిమాలు చూస్తాను. ఇంకొంచెం బెటర్ సినిమాలు చూడాలంటే.. టామ్ క్రూజ్ వంటి సినిమాలను చూస్తుంటాను. అయితే లవ్ స్టోరీ మూవీస్ చాలా బాగుంటాయి.

కానీ అందులో భాద, ఎమోషన్స్ ఉంటడం వల్ల వాటికి కాస్త దూరంగా ఉంటాను. అందువల్లనే కాస్త లైట్ హార్టెడ్ మూవీస్ చూస్తుంటాను. అయితే నేను ఎక్కువగా గ్రాండ్ డాటర్స్‌తో కామెడీ మూవీస్ కోకోమిలన్ వంటి సినిమాలను చూస్తుంటాను. వాళ్లు చూసి వెళ్లిపోయినా.. నేను మాత్రం ఆ సినిమాలను చూస్తూ ఉండిపోతాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో చిరు ఇలాంటి సినిమాలు చూస్తారా? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. చిన్న పిల్లల సినిమాలు అంటే చిరుకి ఇంత ఇష్టమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ఓటీటీల్లో డ‌బ్బింగ్ తెలుగు సినిమాల సందడి.. వామ్మో మొత్తం ఇన్ని చిత్రాలా..?

ఇక చిరు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ‘బింబిసార’ ఫేం మల్లిడి వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×