Jio vs Airtel vs Vi vs BSNL: దేశంలో టెలికాం కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. దీంతో ప్రజలు ఎక్కువ వాలిడిటీతో వచ్చే రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకోవడానికి ఇంటరెస్ట్ చూపుతున్నారు. అందులో ముఖ్యంగా 28 రోజుల వాలిడిటీతో పాటు 56 రోజులు, 84 రోజులు, 365 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లు కూడా ప్రజలు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ నాలుగు కంపెనీలలో ఎవరి రీఛార్జ్ ప్లాన్ చౌకగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Jio
రిలయన్స్ జియో సుమారు 3 నెలల రీఛార్జ్ ప్లాన్ రూ.799. దీనితో వినియోగదారుకు అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 ఎస్ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. ఇది కాకుండా ప్రతిరోజూ 1.5 GB వరకు డేటా బెనిఫిట్స్ కూడా పొందుతారు. దీనితో పాటు జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. 84 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్ రూ. 859కి వస్తుంది. దీనితో మీరు ప్రతిరోజూ 2 GB డేటా బెనిఫిట్ పొందుతారు. ఇది కాకుండా అన్ని ప్రయోజనాలు రూ.799 ప్లాన్ వలె ఉంటాయి.
Also Read: BSNL 5G: హైదరాబాద్‌లో BSNL 5G ట్రయల్ రన్.. టెన్షన్‌లో జియో, ఎయిర్‌టెల్
Airtel
84 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ రూ. 859కి వస్తుంది. దీంతో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే జియో ప్రతిరోజు రూ. 2 GB డేటాను అందిస్తోంది. ఇందుకోసం ఎయిర్‌టెల్ రూ.979 ప్లాన్ అందుబాటులో ఉంది.
Vi
వొడాఫోన్ ఐడియా కూడా 84 రోజుల వాలిడిటీతో రూ.859 ప్లాన్‌ని అందిస్తోంది. దీనితో మీరు ప్రతిరోజూ 1.5 GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 ఎస్ఎమ్‌ఎస్‌ల ప్రయోజనాన్ని పొందుతారు. ఇతర ప్రయోజనాలతో పాటు మీరు ప్లాన్‌తో అర్ధరాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటాను ఉపయోగించుకునే అవకాశ ఉంది. ఇది కాకుండా వీక్లీ డేటా రోల్‌ఓవర్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది.
BSNL
బీఎస్ఎన్‌ఎల్ కేవలం 599 రూపాయలకే 84 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌ని అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS ల ప్రయోజనాన్ని పొందుతారు. అన్‌లిమిడెట్ డేటా అయిపోతే వినియోగదారులు 40kbps వేగంతో ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. ఇది మాత్రమే కాకుండా BSNL ట్యూన్స్‌తో సహా అనేక సేవల ఉచిత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో అందుబాటులో ఉంది.
Also Read: Bajaj Freedom 125 CNG: CNG నెగిటివ్ పాయింట్స్.. తెలుసుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు!
జియో, ఎయిర్‌టెల్ గురించి మాట్లాడితే ఈ కంపెనీలు కూడా రూ. 599 కంటే తక్కువ ప్లాన్‌లను అందిస్తాయి. అయితే వాటితో డేటా ప్రయోజనం తక్కువగా ఉంది. జియో రూ. 479కి మొత్తం 6 GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎమ్ఎస్లను అందిస్తుంది. కాగా ఎయిర్‌టెల్ మొత్తం 6 GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎమ్ఎస్లను అందిస్తుంది. రూ.509కి BSNL 4G నెట్‌వర్క్ సేవలను అందిస్తుంది. అయితే జియో, ఎయిర్‌టెల్ సేవలు 5G నెట్‌వర్క్ సర్వీస్ అందిస్తాయి.