E-Paper
Advertisement

Nissan X-Trail SUV Launching: లాంచ్‌కు సిద్ధమైన నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్.. ఇక ఆ మోడళ్లకు గట్టి పోటీ తప్పదు..!

Nissan X-Trail SUV Launching: లాంచ్‌కు సిద్ధమైన నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్.. ఇక ఆ మోడళ్లకు గట్టి పోటీ తప్పదు..!

Nissan X-Trail SUV Lunching on July 17th: ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌లో నిస్సాన్ ఎస్యూవీకి ప్రత్యేక క్రేజ్ ఉంది. పలు ఎస్యూవీలను లాంచ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే ఎస్యూవీలో తనదైన శైలిలో దూసుకుపోతున్న నిస్సాన్ ఈ సారి 2024 Nissan X-Trail SUVని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ కొత్త మోడల్ ఎస్యూవీకి సంబంధించిన ఈవెంట్‌ను వచ్చే నెల అంటే జూలై 17 న కంపెనీ నిర్వహిస్తోంది.

ఆ ఈవెంట్ నిర్వహించిన కొన్ని వారాల తర్వాత కంపెనీ భారత్‌లో ఈ మోడల్‌ను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ఎస్యూవీకి సంబంధించిన కొన్ని వివరాలు బయటకొచ్చాయి. 2024 Nissan X-Trail SUV ని కంపెనీ రెండేళ్ల క్రితమే పపంచ మార్కెట్‌కి పరిచయం చేసింది. ఇప్పుడు ఎట్టకేలకు ఇది లాంచ్‌కు సిద్ధమైంది. అయితే 2024 Nissan X-Trail SUV ఇండియాలో టయోటా ఫార్చ్యునర్, ఎంజీ గ్లాస్టర్‌కి గట్టి పోటీని ఇస్తుందని భావిస్తున్నారు.

కాగా Nissan X-Trail SUV ఒకప్పుడు భారత మార్కెట్‌లో లభించేది. కానీ కంపెనీ ఈ మోడల్‌ను డిస్కంటిన్యూ చేసింది. అప్పట్లో దీనికి మార్కెట్‌లో సూపర్ డూపర్ క్రేజ్ ఉండేది. ఇక దీనిని డిస్కంటిన్యూ చేసిన ఇన్నేళ్లకు కంపెనీ ఇప్పుడు కొత్త 2024 Nissan X-Trail SUVని మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగానే టెస్ట్ డ్రైవ్ కూడా కంప్లీట్ చేసుకుంది.

Also Read: ఆల్ట్రోజ్ రేసర్‌ కొంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

ఈ 2024 Nissan X-Trail SUV మోడల్ అంతర్జాతీయ మార్కెట్‌లో 5 అండ్ 7 సీటర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అయితే ఇదే సిటింగ్‌తో ఇండియాలో లాంచ్ అవుతుందా? లేదా అనేది చూడాలి. ఈ మోడల్‌ను CMF-C ప్లాట్ ఫార్మ్‌పై కంపెనీ రూపొందిస్తుంది. అందువల్ల ఇందులో కంపెనీకి చెందిన ఈ-పవర్ డ్రైవ్ సిస్టమ్ ఉండనుంది. ఇందులో ఉండే ఈ-పవర్ స్ట్రాంగ్ హైబ్రీడ్ ఇంజన్ 201hp పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.

అలాగే ఆల్‌వీల్ డ్రైవ్ ఈ-పవర్ వేరియంట్ 211hp పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఇక మైల్డ్ హైబ్రీడ్ వేరియంట్‌ 12v మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ 160hp పవర్, 300nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2024 Nissan X-Trail SUV మోడల్‌ని కంపెనీ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా తీసుకువచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే దీని ధరకు సంబంధించిన వివరాలు మాత్రం ఎక్కడా తెలియలేదు. త్వరలో ఈ 2024 Nissan X-Trail SUV మోడల్‌ ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి మరిన్ని వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×