E-Paper
Advertisement

SA Vs AFG Highlights: తొలిసారి ఫైనల్ కి వెళ్లిన సౌతాఫ్రికా.. కీలక మ్యాచ్ లో ఓడిన ఆఫ్గాన్!

SA Vs AFG Highlights: తొలిసారి ఫైనల్ కి వెళ్లిన సౌతాఫ్రికా.. కీలక మ్యాచ్ లో ఓడిన ఆఫ్గాన్!
Advertisement

T20 World Cup 2024 Semifinal – South Africa Vs Afghanistan Highlights: టీ 20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ గెలిచి సెమీఫైనల్ కి వచ్చిన ఆఫ్గనిస్తాన్ కీలకమ్యాచ్ లో చేతులెత్తేసింది. ఇక సౌతాఫ్రికా ఘన విజయం సాధించి తొలిసారి టీ 20 ప్రపంచకప్ లో ఫైనల్ కి దూసుకెళ్లింది. అయితే నాకౌట్ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఇలా తక్కువ స్కోరు చేయడంతో అభిమానులు హతాశుయులయ్యారు.

ఎంతో కీలకమైన టాస్ గెలిచి ఆఫ్గనిస్తాన్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి జయభేరి మోగించింది. తొలిసారి ఫైనల్ లో అడుగుపెట్టింది.

Advertisement

వివరాల్లోకి వెళితే 57 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న క్వింటన్ డికాక్ (5) త్వరగా అయిపోయాడు. మరో ఓపెనర్ హెండ్రిక్స్ (29), ఫస్ట్ డౌన్ వచ్చిన కెప్టెన్ మార్ క్రమ్ (23) అలా ఓపికగా, జాగ్రత్తగా ఆడి మ్యాచ్ ని విజయతీరాలకు చేర్చారు. ఒక వికెట్ నష్టానికి 8.5 ఓవర్లలో 60 పరుగులు చేశారు.

Also Read: టీ 20 ర్యాంకులో వెనుకపడ్డ సూర్యకుమార్ యాదవ్..

Advertisement

ఆఫ్గాన్ బౌలింగులో ఫరూఖీ 1 వికెట్ తీశాడు. మిగిలిన ఎవరికి వికెట్లు పడలేదు. అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గనిస్తాన్ తాడోపేడో తేల్చుకుందామనే రీతిలో ఆడింది. ఈ క్రమంలో టపటపా వికెట్లు పడిపోవడంతో తక్కువ స్కోరుకి ఆలౌట్ అయ్యింది. మరి ఇది టీమ్ మేనేజ్మెంట్ ప్రణాళికా?, లేక వర్షం వస్తుందనే కంగారో తెలీదు. ప్రతీ ఒక్కరూ అనవసరమైన హిట్టింగ్ లకి వెళ్లి చేజేతులారా అవుట్ అయిపోయారు.

అంతకముందు బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఒక్కడే పోరాడి 43 పరుగులు చేసిన గుర్బాజ్ కీలకమైన సెమీఫైనల్ లో డక్ అవుట్ అయ్యాడు. ఒకే ఒక్కరు ఒమర్ జాయ్ (10) తప్ప ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. అంటే ఆఫ్గాన్లు ఎంతో అధ్వానంగా బ్యాటింగ్ చేశారో అర్థమవుతోంది. ముగ్గురు డక్ అవుట్లు అయ్యారు. ముగ్గురు 2 పరుగులు చొప్పున చేశారు. కరీమ్ జనత్ (8), కెప్టెన్ రషీద్ (8) ఇద్దరూ  ఈ మాత్రమైనా చేశారు. మొత్తానికి 11.5 ఓవర్లలో 56 పరుగులకి చాప చుట్టేశారు.

సౌతాఫ్రికా బౌలింగులో మార్కో జాన్సన్ 3, రబడా 2, ఆన్రిచ్ 2, షంసీ 3 వికెట్లు పడగొట్టారు.

Tags

Related News

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

Big Stories

Advertisement
×