BigTV English

ICC Men’s T20I Rankings: టీ 20 ర్యాంకులో వెనుకపడ్డ సూర్యకుమార్ యాదవ్.. ట్రావిస్ హెడ్ నంబర్ .1

ICC Men’s T20I Rankings: టీ 20 ర్యాంకులో వెనుకపడ్డ సూర్యకుమార్ యాదవ్.. ట్రావిస్ హెడ్ నంబర్ .1

Suryakumar Yadav’s Snatched by Travis Head in T20I Batter Ranking: టీ 20 ప్రపంచకప్ ఒకవైపు నడుస్తుండగా ఐసీసీ ర్యాంకులు ప్రకటించింది. గత ఏడు నెలలుగా టీ 20లో నెంబర్ వన్ గా ఉన్న సూర్యా తాజా ర్యాంకుల్లో నెంబర్ 2 కి పడిపోయాడు. తాజాగా టీమ్ ఇండియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ధనాధన్ 76 పరుగులు చేశాడు. దీంతో తన ర్యాంకు ఒక్కసారి పెరిగింది. అయితే సూర్యాకి, తనకి మధ్య పెద్ద వ్యత్యాసమైతే లేదు. కేవలం 2 పాయింట్లు మాత్రమే తేడా ఉంది.


ప్రస్తుతం ట్రావిస్ హెడ్ 844 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ 842 పాయింట్లతో తన వెనుకే ఉన్నాడు. వీరిద్దరి తర్వాత ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ (816), బాబర్ అజామ్ (755), రిజ్వాన్ (746) పాయింట్లతో ఉన్నారు.

అయితే సూర్యా నెంబర్ వన్ స్థానం నుంచి వెనుకపడిపోయాడని చింతించాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే టీమ్ ఇండియాకి సెమీఫైనల్ మ్యాచ్ ఒకటి ఉంది. అందులో ఏమైనా అదరగొడితే తనకి తిరుగుండదు. అలాగే ఫైనల్ వరకు వెళ్లి అక్కడ కూడా దంచి కొట్టాడంటే, ఇప్పుడప్పుడే సూర్యా దరిదాపులకి ఎవరూ రాలేరని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే ఆస్ట్రేలియాపై 92 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ (527) కూడా తన ర్యాంకు మెరుగుపరుచుకున్నాడు. ఒక్కసారి 13 స్థానాలు దాటి 38 ర్యాంకులో నిలిచాడు.


Also Read: టీమ్ ఇండియా సెమీఫైనల్ కి.. వర్షం ఆటంకం?

టీమిండియా బౌలర్ల విషయానికి వస్తే.. అక్షర పటేల్ (647)  ఒక్కడే టాప్ టెన్ లో ఉన్నాడు. ప్రస్తుతం తను 8వ స్థానంలో ఉన్నాడు.  ఇకపోతే కులదీప్ యాదవ్ (641) పాయింట్లతో 11వ ర్యాంకులో ఉన్నాడు. ఆడబోయే సెమీఫైనల్ లో మరిన్ని వికెట్లు తీసి, అలాగే ఫైనల్ వరకు వెళ్లి అక్కడ కూడా తీస్తే టాప్ టెన్ లోకి వచ్చేస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అర్షదీప్ సింగ్ (621) పాయింట్లతో 17వ స్థానంలో ఉన్నాడు. బుమ్రా (589) ప్రస్తుతం 24వ ర్యాంకులో ఉన్నాడు. బౌలర్లలో నెంబర్ వన్ ఆఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఉన్నాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×