BigTV English

Tatkal Confirm Ticket: తత్కాల్ రైలు టికెట్ బుక్ చేసుకోవడం సమస్యగా ఉందా?.. కన్‌ఫర్మ్ టికెట్స్ కోసం ఈ యాప్ ఉందిగా!..

Tatkal Confirm Ticket: తత్కాల్ రైలు టికెట్ బుక్ చేసుకోవడం సమస్యగా ఉందా?.. కన్‌ఫర్మ్ టికెట్స్ కోసం ఈ యాప్ ఉందిగా!..

Tatkal Confirm Ticket| దూర ప్రయాణాల కోసం రైలు మార్గమే సురక్షితం. అందుకే భారతీయులు ఎక్కువగా రైలు ప్రయాణం చేయడానికి ఇష్డపడతారు. కానీ రైలు ప్రయాణం చేయాలంటే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలి. ముఖ్యంగా రిజర్వేషన్ చేసుకోవాలంటే వారం రోజులు లేదా అంతకంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.. లేదా ట్రైన్ బయలుదేరే ఒకరోజు ముందు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి.


కానీ తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే.. క్షణాల్లో టికెట్లు అయిపోతాయి. అందుకే చాలామందికి వెయిటింగ్ లిస్టులో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వెయిటింగ్ లిస్టు టికెట్ కన్‌ఫర్మ్ అవుతుందో? లేదో? చెప్పలేని పరిస్థితి. ఒక వేళ కన్‌ఫర్మ్ కాకపోతే ప్రయాణంలో సీటు లభించిక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి.. లేదా ప్రయాణమే రద్దు చేసుకోవాలి. ఈ సమస్య పరిష్కరించడానికి ఒక కొత్త యాప్ ఉంది. రిజర్వేషన్ లేదా తత్కాల్ లో టికెట్ లభించకపోయినా.. ఒక యాప్ ద్వారా మీకు బుకింగ్ లభిస్తుంది. భారతీయ రైల్వే (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా అనుమతి పొందిన ‘కన్‌ఫర్మ్ టికెటి’ యాప్ ద్వారా మీకు కన్‌ఫర్మ్ టికెట్ లభించే అవకాశాలు ఎక్కువ.

‘కన్‌ఫర్మ్ టికెటి’ యాప్ ద్వారా శతాబ్ది, రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్ లాంటి అన్ని ట్రైన్ల టికెట్లు లభిస్తాయి. అయితే ఈ యాప్ లో ప్రయాణికుడు చాలా సులువుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇదే ఈ యాప్ ప్రత్యేకత. ఈ యాప్ ద్వారా ప్రయణీకుడు ట్రైన్ నెంబర్ అవసరం లేకుండానే స్వయంగా సీట్ అందుబాటులో ఉందా? అని చూసి.. ఒక వేళ లేకపోతే.. వేరే మార్గాల ద్వారా ప్రయాణం ఎలా చేయవచ్చో ఈ యాప్ సూచనలు చేస్తుంది.


అత్యవసర ప్రయాణం చేయాల్సిన సమయంలో ఒకే ట్రైన్ లో మీకు టికెట్ లభించకపోతే.. ఈ యాప్ మీకు అదే మార్గంలో ప్రయాణించే రెండు వేర్వేరు ట్రైన్లను సూచిస్తుంది. ఆ రెండు ట్రైన్లు మార్గంలో సగం దూరం ప్రయాణిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలనుకున్నవారికి తత్కాల్ టికెట్ లభించకపోతే.. వారు ‘కన్‌ఫర్మ్ టికెటి’ యాప్ లో తిరుపతి వెళ్లేందుకు ప్రత్యామ్యాయలు కోసం చూడొచ్చు. హైదరాబాద్ నుంచి కర్నూల్ వరకు ఒక ట్రైన్ లో వెళ్లి.. అక్కడి నుంచి తిరుపతికి మరో ట్రైన్ లో వెళ్లొచ్చు. లేదా హైదరాబాద్ నుంచి నెల్లూరు మార్గంలో ప్రయాణం చేయవచ్చు అని ఈ యాప్ సూచిస్తుంది. ఇలా ఆల్‌టర్‌నేటివ్ రూట్స్, జర్నీ బ్రేకప్ పద్ధతిలో ప్రయాణికుడికి టికెట్ కన్‌ఫర్మ్ గా లభించే అవకాశాలున్నాయి. అందుకే ఇకపై టికెట్ లభించలేదని బాధపడాల్సిన అవసరం ఉండదు.

Also Read: EPS pension Any Bank: ఈపిఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై దేశంలో ఏ బ్యాంకులో నుంచి అయినా పెన్షన్ డ్రా చేయొచ్చు!

ఈ ‘కన్‌ఫర్మ్ టికెటి’ యాప్ కు ఐఆర్‌సిటిసి నుంచి అనుమతి ఉండడంతో ఈ యాప్ లో నేరుగా ఐఆర్‌సిటిసి లాగిన్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?..

  • కన్‌ఫర్మ్ టికెటి’ యాప్ ఇన్ స్టాల్ చేసుకొని.. ఐఆర్‌సిటిసి యూజర్ ఐడితో లాగిన్ అవ్వండి
  • మీరు బయలు దేరాల్సిన స్థానం నుంచి గమ్య స్థానం గురించి ప్రయాణ వివరాలు తెలపండి
  • ప్రయాణం చేయాల్సిన తేదీ ఎంచుకోండి
  • ఏ ట్రైన్ లో ప్రయాణించాలనుకుంటున్నారు తెలపండి
  • స్లీపర్, ఏసీ క్లాస్ ప్రయాణం ఏది కావాలో ఎంచుకోండి
  • ప్రయాణికుడి వివరాలు.. బెర్త్ ఏవైపుది కావాలో తెలపండి
  • మొబైల్ నెంబర్, ఈ మెయిల్ వివరాలు తెలపండి
  • పేమెంట్ మోడ్ ఎంచుకొని, ట్రాన్స్ యాక్షన్ పూర్తి చేయండి
  • ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక మీ ట్రైన్ టికెట్ బుక్ అయిపోతుంది.
  • ఈ మెయిల్ లేదా మీ ఫోన్ కు టికెట్ బుకింగ్ మెసేజ్ కూడా వస్తుంది.

Related News

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Treasure in Bihar: దేశం మొత్తానికి సరిపోయేంత బంగారం.. అసలెక్కడుంది ఈ నిధి? ఈ నిధి వెనకాల మిస్టరీ ఏంటి?

Gold Rate: అమ్మ బాబోయ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ పండగ సేల్ ప్రారంభం.. భారీ ఆఫర్ల వర్షం

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Big Stories

×