BigTV English

Nigeria explosion: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం, మంటల్లో 48 మంది మృతి.. ఎలా జరిగింది?

Nigeria explosion: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం, మంటల్లో 48 మంది మృతి.. ఎలా జరిగింది?

Nigeria explosion: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది. ఈ ఘటనలో 48 మంది సజీవ దహనమయ్యారు. మరో 50 వరకు పశువులు మృతి చెందాయి. ఈ విషయాన్ని ఆ దేశ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ ఏడాదిలో అక్కడ జరిగిన ఘటనల్లో ఇదే అతిపెద్దది.


నైజీరియాలో నార్త్- మధ్య నైజర్ రాష్ట్రంలోని ఆగాయి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు చుట్టుపక్కన వాహనా లకు అట్టుకున్నాయి. ట్రక్కులో ఉన్న 50 పశువులు సజీవ దహనమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు.

ALSO READ: నిన్న చైనా.. ఇప్పుడు వియత్నాం.. యాగి తుపాను బీభత్సంతో 14 మంది మృత్యువాత


ఆయిల్ ట్రక్కులో ఉన్న వ్యక్తులతోపాటు చుట్టుపక్కన వాహనాలకు సంబందించిన వ్యక్తులు కూడా ఈ ఘటనలో ఉన్నట్లు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. మొదట్లో 30 మంది సజీవ దహనమయ్యారు. మరో 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

మృతులకు సమీపంలోని ఓ ప్రాంతంలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. నైజీరియాలో సరైన రైల్వే వ్యవస్థ లేదు. ముఖ్యంగా కార్గో రవాణాకు కేవలం వాహనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యధిక జనాబా కలిగిన నైజీరియాలో ఆ తరహా ప్రమాదాలు సాధారణంగా చెబుతున్నారు.

దీనికితోడు రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రతీ ఏడాది వందల సంఖ్యలో మనుషులు మరణించిన సందర్భాలు కోకొల్లలు. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ అధికారుల నివేదిక ప్రకారం.. 2020లో 1530 ట్యాంకర్ల ప్రమాదాలు జరిగాయి. మొత్తం 535 మంది మరణించారు.  మరో 1142మంది గాయపడ్డారు.

ఈ ఘటనపై నైజర్ ప్రాంత గవర్నర్ మహమ్మద్ బాగో నోరు విప్పారు. వాహనదారులు జాగ్రత్త పాటించాలని తరుచు చెబుతున్నామని వెల్లడించారు. అనుకోకుండా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రజలు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని మరోసారి కోరుతున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×