EPS pension Any Bank| రిటైర్డ్ ఉద్యోగులకు ఒక శుభవార్త. ఎంప్లాయీస్ ప్రాపిడెంట్ ఫండ్ (EPFO) నిర్వహించే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 1995 కింద పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు త్వరలోనే దేశంలోని ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్ నుంచైనా పెన్షన్ విత్ డ్రా చేసుకోవచ్చు. జనవరి 2025 నుంచి ప్రావిడెంట్ ఫండ్ ఈ వసతి అందుబాటులోకి తీసుకురానుంది.
ఇటీవలే కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండివియా అధ్యక్షన EPFO సెంట్రల్ బోర్డు ట్రస్టీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సెంట్రల్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (CPPS) ని అందరూ ఆమోదించారు.
ఈ సెంట్రల్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ జాతీయ స్థాయిలో పెన్షన్ పంపిణీ నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన మార్పు వల్ల పెన్షనర్లు ఇకపై తమ బ్యాంకు మారాల్సిన అవసరం వచ్చినా లేదా తమ లోకేషన్ మారాల్సిన అవసరం వచ్చినా పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ (PPOs) ట్రాన్స్ ఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే దేశంలోని ఏ బ్యాంకు లో నుంచి అయినా పెన్షన్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు వల్ల దేశంలోని 78 లక్షల EPS-95 పెన్షనర్లకు లాభం చేకూరుతుంది.
ఈ సందర్భంగా కేంద్ర కార్మిక మంత్రి మన్ సుఖ్ మాండవియా ఒక ట్వీట్ చేశారు. ”సిపిపిఎస్ ఆమెదం పొందడం ఎంప్లాయీస్ ప్రాపిడెంట్ ఫండ్ ఆధునీకతలో ఒక మైల్ స్టోన్ లాంటిది. దేశంలో ఏదైనా బ్యాంకు ఏదైనా బ్రాంచ్ నుంచి ఇకపై పెన్షనర్లు తమ పెన్షన్ పొందవచ్చు. చాలాకాలంగా పెన్షన్ పొందడంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ సిపిపిఎస్ సిస్టమ్ తో పరిష్కారం దొరుకుతుంది. ఈ సిస్టమ్ EPFO ఐటి మాడ్రనైజేషన్, సెంట్రలైజ్డ్ ఐటి ఎనేబుల్డ్ సిస్టమ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆధార్ నెంబర్ ని బేస్ చేసుకొని పెన్షన్ చెల్లింపులు జరుగుతాయి” అని కేంద్ర మంత్రి తన ట్వీట్ లో రాశారు.
Also Read: ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!
ఈ కత్త పేమెంట్ సిస్టమ్ వల్ల పెన్షనర్లు మరో సమస్య కూడా తప్పుతుంది. పెన్షన్ ప్రారంభంలో తమ బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఇకపై (జనవరి 2025 నుంచి) ఉండదు. పెన్షన్ విడుదలైన వెంటనే పేమెంట్ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అయిపోతుంది. పైగా ఈ సిస్టమ్ వల్ల పెన్షన్ పంపిణీలో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు కూడా తగ్గిపోతుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లో నూ కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్టోబర్ 1, 2024 నుంచి ఈ మార్పులు అమలవుతాయి. పిపిఎఫ్ , సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న సేవింగ్స్ స్కీమ్స్ తో ఈ మార్పులు చేశారు. ఒక మైనర్ పిపిఎఫ్ ఖాతా ఉంటే ఆ మైనర్ మేజర్ అయ్యేంతవరకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లో తగిన వడ్డీ రేటు చెల్లింపులు జరుగుతాయి. ఆ మైనర్ కు 18 ఏళ్ల వయసు పూర్తైన తరువాత మెట్యూరిటీ అయిన వారికి వడ్డీ రేటులో మార్పులు ఉంటాయి.
ఆ తరువాత ఒకటి కంటే ఎక్కువ పిపిఎఫ్ ఖాతాలు ఉంటే ఒక ప్రైమరీ ఖాతాకు మాత్రమే వడ్డీ చెల్లింపులు జరుగుతాయి. ఒక వేళ ప్రైమరీ ఖతాలో పెట్టుబడి మొత్తం పరిమితికి తక్కువ ఉంటే రెండో అకౌంట్ లోని మొత్తాన్ని ప్రైమరీ ఖతాలో మొత్తంతో జోడించి పరిమితి నిర్ధారిస్తారు.
ఎన్ ఆర్ ఐ పిపిఎఫ్ ఖాతాలకు ఫామ్ H తో ఎఆర్ఐ స్టేటస్ ని మార్చుకోవాలి. లేకపోతే సెప్టెంబర్ 30 తరువాత ఖతాలు నిలిపివేయడం జరుగుతుంది.