BigTV English

Railways New Service: ఒకే టికెట్ తో 56 రోజుల ప్రయాణం- దేశం అంతా చుట్టేయొచ్చు, ధర కూడా తక్కువేనండోయ్!

Railways New Service: ఒకే టికెట్ తో 56 రోజుల ప్రయాణం- దేశం అంతా చుట్టేయొచ్చు, ధర కూడా తక్కువేనండోయ్!

Circular Journey Ticket: దేశ వ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చు, సౌకర్యవంతంమైన ప్రయాణం కారణంగా చాలా మంది  ట్రైన్ జర్నీని ఇష్టపడుతారు. సాధారణంగా చాలా మంది రైలు ప్రయాణం చేయాలంటే, వెళ్లడానికి ఒక టికెట్, రావడానికి మరొక టికెట్ తీసుకుంటారు. కానీ, రీసెంట్ గా భారతీయ రైల్వే సంస్థ తన ప్రయాణీకు కోసం అదిరిపోయే సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సుదూర ప్రాంతాలకు వెళ్లడంతో పాటు తీర్థయాత్రలు చేసే వారి కోసం ‘సర్క్యులర్ జర్నీ టికెట్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టికెట్ ద్వారా ఏకంగా 56 రోజుల పాటు దేశమంతా తిరిగే అవకాశం కల్పిస్తోంది.  ఇంతకీ ఈ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? ధర ఎంత ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


8 స్టేషన్లకు మించకూడదు!

‘సర్క్యులర్ జర్నీ టికెట్’ అనేది భారతీయ రైల్వేశాఖ తీసుకొచ్చిన స్పెషల్ టికెట్. దీనికి ఏ క్లాస్ లోనైనా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ టికెట్  తీసుకున్నప్పటి నుంచి 56 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ప్రయాణాన్ని మొదలు పెట్టిన స్టేషన్ నుంచి 56 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి  మీరు ఎక్కడైతే రైలు ఎక్కారో అక్కడికి చేరుకోవచ్చు. లేదంటే నచ్చిన చోట దిగిపోవచ్చు. అయితే, ఓ కండీషన్ ఉంది. మొత్తం మీరు దిగే రైల్వే స్టేషన్ల సంఖ్య 8కి మించకూడదు.


ప్రయాణం ఎలా చేయాలంటే?

మీరు హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్లేందుక టికెట్ తీసుకుంటే.. సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కితే, తిరుపతికి వెళ్లొచ్చు. అక్కడి దిగి అన్ని ప్రాంతాలను చూడవచ్చు. ఆ తర్వాత మళ్లీ బెంగళూరు రైలు ఎక్కాలి. అక్కడ దిగి కొద్ది రోజులు ఉండవచ్చు. ఆ తర్వాత చెన్నై రైలు ఎక్కి అక్కడి కొద్ది రోజుల పాటు పర్యటించవచ్చు. అలా మొత్తం 8 రైళ్లను మారే అవకాశం ఉంటుంది. చివరికి మనకు ఎక్కడ దిగాలనిపిస్తే అక్కడ దిగిపోవచ్చు. ఎక్కడికైనా వెళ్లండి 56 రోజులకు మించకూడదు.

‘సర్క్యులర్ జర్నీ టికెట్’ ఎలా బుక్ చేసుకోవాలి? ధర ఎంత?

‘సర్క్యులర్ జర్నీ టికెట్’ను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోలేం. రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ కు దరఖాస్తు పెట్టుకోవాలి. ఆయన మీ ట్రైన్ జర్నీ ప్లాన్ ప్రకారం టికెట్ ధరను ఫిక్స్ చేసి మీరు రైలు ఎక్కే స్టేషన్ మేనేజర్ కు ఇన్ ఫామ్ చేస్తారు. మీరు ప్రయాణం మొదలుపెట్టే సమయంలో స్టేషన్ బుకింగ్ సెంటర్ నుంచి ‘సర్క్యులర్ జర్నీ టికెట్’ తీసుకోవచ్చు. మీరు ఏఏ స్టేషన్లలో దిగుతారు? అనే విషయాన్ని కూడా టికెట్ ఇచ్చే సమయంలోనే చెప్పాల్సి ఉంటుంది. ఇక టికెట్ ధర అనేది టికెట్ వ్యాలిడిటీ, జర్నీ చేసే రోజులు, దిగే స్టేషన్లను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు. 400 కిమీని ఒక రోజుగా పరిగణిస్తారు. ప్రయాణం చేయని రోజును 200 కిమీగా గుర్తిస్తారు. సీనియర్ సిటిజన్లు 1000 కిమీ ప్రయాణిస్తే స్పెషల్ సబ్సిడీ ఇస్తారు. పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం డిస్కౌంట్ అందిస్తారు. ఈ టికెట్ విహారయాత్రలకు వెళ్లే వారికి చాలా యూజ్ ఫుల్ గా ఉంటుంది.

Read Also: దీపావళికి ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? ట్రైన్ టికెట్లు సింపుల్ గా ఇలా బుక్ చేసుకోండి!

Related News

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

Big Stories

×