BigTV English

Discount on Tata Cars in July 2024: జాతరే జాతర.. టాటా కార్లపై రూ.1.33 లక్షల భారీ డిస్కౌంట్ ప్రయోజనాలు.. ఎక్కువ రోజులేం కాదు!

Discount on Tata Cars in July 2024: జాతరే జాతర.. టాటా కార్లపై రూ.1.33 లక్షల భారీ డిస్కౌంట్ ప్రయోజనాలు.. ఎక్కువ రోజులేం కాదు!

Discount on Tata Cars in July 2024: ప్రముఖ దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తరచూ తమ కార్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పలు మోడళ్లపై డిస్కౌంట్లు అందించిన కంపెనీ ఇప్పుడు మరోసారి తమ కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెల అంటే జూలైలో ఎంపిక చేసిన కొన్ని బ్రాండ్ మోడల్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. అందులో ఒక్క నగదు డిస్కౌంటే గాక.. ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్‌ సహా ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. ఇప్పుడు ఏ ఏ మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్ ప్రయోజనాలను ప్రకటించిందో తెలుసుకుందాం.


టాటా హారియర్

టాటా మోటర్స్ మరో మోడల్ టాటా హారియర్ కొనుగోలు పై కంపెనీ రూ.1.33 లక్షల భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇది కూడా 2023 మోడల్‌కి వర్తిస్తుంది. ఇందులో ఫేస్‌లిఫ్ మోడల్ కొనుగోలు పై రూ.88000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ నెలలో ప్రీ ఫేస్‌లిఫ్ట్, ఫేస్‌లిఫ్ట్ మోడళ్లకు డిస్కౌంట్స్ వర్తిస్తాయి. ఇక 2024 మోడల్ కొనుగోలు పై రూ.38,000 డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్‌లో కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి పొందొచ్చు.


టాటా సఫారీ

టాటా మోటార్స్ తన మోడల్‌లో సఫారి కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ప్రయోజనాలు అందిస్తుంది. దీనిపై ఏకంగా రూ.1.33 లక్షల డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఈ డిస్కౌంట్ అనేది 2023 మోడల్స్ కొనుగోలుపై మాత్రమే వర్తిస్తాయి. ఇందులో రూ.75,000 నగదు తగ్గింపు, రూ.8000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు, రూ.50,000 ఎక్స్ఛేంజ్ లేదా స్కాపేజ్ బోనస్ పొందొచ్చు.

Also Read: మారుతి సుజుకి ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.1.08 లక్షలకు పైగా భారీ డిస్కౌంట్ ప్రయోజనాలు.. లాస్ట్ డేట్ ఇదే..!

అలాగే 2023 ఫేస్‌లిఫ్ట్ మోడల్ కొనుగోలుపై కస్టమర్లు రూ.88,000 డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇందులో నగదు డిస్కౌంట్ రూ.50,000, కార్పొరేట్ బోనస్ రూ.8000, రూ.30000 ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి లభిస్తాయి. అలాగే 2024 మోడల్‌ కొనుగోలుపై రూ.30000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.8000 కార్పొరేట్ ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేదు.

టాటా నెక్సాన్

దేశీయ మార్కెట్‌లో అత్యధిక సేల్స్ నమోదు చేసిన మోడల్ టాటా నెక్సాన్. ఇప్పుడు ఈ మోడల్‌లో పెట్రోల్ వేరియంట్ కొనుగోలుపై ఏకంగా రూ.90,000 ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అందులో రూ.55,000 నగదు తగ్గింపు, రూ.35,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి లభిస్తున్నాయి. అదే సమయంలో డీజిల్ మోడల్‌పై రూ.40,000 డిస్కౌంట్ పొందొచ్చు. అందులో నగదు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్ 2023 మోడల్‌ కొనుగోలుపై రూ.70,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అందులో రూ.45,000 క్యాష్ తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5000 కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి. ఇక 2023 అండ్ 2024 సీఎన్‌జీ కార్లపై రూ.55,000, రూ.35,000 తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ మోడల్స్ పై ఆఫర్లు కేవలం ఈ నెల ఆఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

Also Read: హోండా కార్లపై మాన్‌సూన్ డీల్స్.. అదనంగా గిఫ్ట్‌లు కూడా.. ఎప్పటి వరకు ఉంటుందంటే..?

టాటా టిగోర్

టాటా టిగోర్ 2023 పెట్రోల్, సీఎస్‌జీ వేరియంట్ల కొనుగోలు పై రూ.85,000 తగ్గింపు పొందొచ్చు. అందులో రూ.60,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5000 కార్పోరేట్ ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయితే అదే సమయంలో 2024 పెట్రోల్ వేరియంట్‌పై రూ.30,000, సీఎన్‌జీ మోడల్స్ కొనుగోలుపై రూ.25,000 నగదు తగ్గింపు లభిస్తుంది.

టాటా టియాగో

మార్కెట్‌లో అత్యధికంగా సేల్ అవుతున్న కంపెనీ మోడళ్లలో టాటా టియాగో ముందు వరుసలో ఉంటుంది. ఈ జూలై నెలలో ఈ మోడల్‌పై ఏకంగా రూ.90,000 డిస్కౌంట్ పొందొచ్చు. అందులో రూ.65,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బోనస్ పొందొచ్చు. రూ.5000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే 2024 మోడల్ కొనుగోలు పై రూ.35,000 నగదు తగ్గింపు వస్తుంది. అదే సమయంలో 2023 మోడల్ పై రూ.85,000, 2024 సీఎన్‌జీ మోడల్స్ కొనుగోలుపై రూ.50,000 తగ్గింపు పొందొచ్చు.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×