BigTV English

CM Revanth Reddy Meet Gadwal Issue: సీఎం దగ్గరికి గద్వాల్ ఎమ్మెల్యే పంచాయితీ..కాంగ్రెస్ నేత సరితతో కీలక భేటీ

CM Revanth Reddy Meet Gadwal Issue: సీఎం దగ్గరికి గద్వాల్ ఎమ్మెల్యే పంచాయితీ..కాంగ్రెస్ నేత సరితతో కీలక భేటీ

Revanth Reddy Meet Gadwal ZP Chair Person(TS today news): తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోగా. . గురువారం అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్‌లోకి క్యూ కట్టారు. నిన్న రాత్రి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్చే సంజీవ్ కుమార్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి చేరారు. త్వరలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

జోగుళాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు దాదాపు రంగం ఖాయమైంది. ఈ మేరకు ఎమ్మెల్యే అనుచరులు, పార్టీ కార్యకర్తలతో బండ్ల కృష్ణమోహన్ భేటీ కూడా అయ్యారు. అయితే, ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వస్తున్నారనే వార్తలు బయటకు రావడంతో స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఎదురైంది.


ప్రధానంగా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల జెడ్పీ చైర్ పర్స్ సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సరిత అనుచరులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది ఏకంగా సెల్ టవర్ ఎక్కడంతోపాటు మరికొంతమంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.

Also Read: మాజీ మంత్రి మల్లారెడ్డికి.. హైకోర్ట్‌లో షాక్

గద్వాల జిల్లా పంచాయితీ చివరికి సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. ఈ నేపథ్యంలో సీఎం రంగంలోకి దిగారు. గద్వాల జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్యతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. అనంతరం ఆమెకు నచ్చజెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా.. సరితకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×