OTT Movie : దెయ్యాల సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో, అవి భయపెట్టే సన్నివేశాలు అంత భయంకరంగా ఉంటాయి. కొన్ని సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ పరుగులు పెట్టిస్తుంటాయి. ఇప్పుడు మనంచెప్పుకోబోయే థాయ్ హారర్ సినిమా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కట్టుకున్న భార్యను ప్రియురాలితో కలసి అడ్డు తొలగించుకున్న భర్తను, ఆమె దెయ్యం రూపంలో వెంటాడుతుంది. క్లైమాక్స్ వరకు ఈ సినిమా గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘టాంబ్ వాచర్’ (Tomb watcher) 2025లో వచ్చిన థాయ్ హారర్ సినిమా. వతాన్యూ ఇంగ్కావివత్ దీనికి దర్శకత్వం వహించారు. ముఖ్య పాత్రల్లో వొరానుచ్ భిరొంభక్ది, థానవత్, అరాచాపోర్న్ నటించారు. ఈ సినిమా 2025 మే 30న థాయ్‌ల్యాండ్‌లో విడుదల అయింది. 2025 సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది.
రాసుఖాన్ అనే ఒక రిచ్ మహిళ, తన భర్త చెవ్ తో పెద్ద విల్లాలో జీవిస్తుంటుంది. కానీ చెవ్‌కు మరో అమ్మాయితో సంబంధం ఉంటుంది. అయితే ప్రియురాలితో కలసి భార్య అడ్డు తొలగించు కుంటాడు భర్త. ఆమె చనిపోయిన తర్వాత చెవ్, ప్రియురాలితో ఆ విల్లాలో సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. కానీ ఆ విల్లాలోకి ఒక శవపేటిక కనిపిస్తుంది. చనిపోయిన అతని భార్య శవం అందులో ఉంటుంది. అది జీవించినట్టు కనబడుతుంది. చెవ్, అతని ప్రియురాలు దానిని చూసి షాక్ అవుతారు. వీళ్ళు ఆ శవాన్ని దాచడానికి ట్రై చేస్తారు. కానీ విల్లాలో వింత శబ్దాలు, భయంకర సంఘటనలు మొదలవుతాయి. ఆత్మ వాళ్లను హాంట్ చేస్తుంది. ఎందుకంటే చెవ్ ఆమెను మోసం చేసి, ఆమె మరణానికి కారణమయ్యాడు.
Read Also : సదువుకునే అమ్మాయిని తుప్పల్లోకి తీసుకెళ్లి… కట్ చేస్తే పోలీసులే గజగజా వణికే ట్విస్ట్