AUSW Vs BANW: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 17 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే మహిళల ఆస్ట్రేలియా జట్టు సెమీస్ లోకి దూసుకువెళ్ళింది. నిన్న జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ లో అద్భుతంగా విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు… సెమీస్ లోకి అడుగుపెట్టింది. 9 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా.. “సెమీస్” వెళ్లిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసిన నేపథ్యంలో టీమిండియాకు కాస్త ఊరట ఇచ్చింది ఆస్ట్రేలియా. నిన్న ఆస్ట్రేలియా ఓడిపోయి ఉంటే, బంగ్లాదేశ్ పాయింట్లు పట్టికలో మెరుగుపడేదని చెబుతున్నారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ రూబియా హైడర్ 44 పరుగులు చేయగా శోభన 66 పరుగులు చేసి రాణించారు. వీళ్లిద్దరు తప్ప కెప్టెన్ తో సహా అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టు ప్రత్యర్థి ఉన్నప్పుడు కనీసం 250 పరుగులు అయినా చేయాలి. కానీ 199 పరుగుల టార్గెట్ మాత్రమే టార్గెట్ ఇచ్చారు.
అయితే ఈ చిన్నపాటి లక్ష్యాన్ని ఒక్క వికెట్ నష్టపోకుండా ఛేదించింది ఆస్ట్రేలియా మహిళల జట్టు. కేవలం 24.5 ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శించి టార్గెట్ చేరుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ ( Alyssa Healy) మరోసారి సెంచరీ తో రెచ్చిపోగా మరో ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ( Phoebe Litchfield ) 84 పరుగులతో దుమ్ము లేపారు. దీంతో 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలోనే సెమీస్ కు దూసుకువెళ్ళింది.
బంగ్లాదేశ్ మహిళల జట్టుపై విజయం సాధించిన ఆస్ట్రేలియా, టీమిండియాను కాపాడింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా మహిళల జట్టు, సెమీఫైనల్ వెళ్లే దారులను ఆస్ట్రేలియా సుగమం చేసింది. నిన్న గనక బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతే పరిస్థితి వేరే లాగా ఉండేది. ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉన్న బంగ్లాదేశ్.. నిన్న గెలిస్తే నాలుగు పాయింట్లు సాధించి, టీమిండియాకు సమంగా అయ్యేది. అలాంటప్పుడు నెక్స్ట్ జరిగే మ్యాచ్ లో ఇండియా ఓడితే, బంగ్లాదేశ్ మరింత పైకి వచ్చే ప్రమాదం ఉండేది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా గెలవడంతో బంగ్లాదేశ్ దాదాపు ఎలిమినేట్ అయినట్లే అని చెబుతున్నారు. దీంతో టీమ్ ఇండియా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక న్యూజిలాండ్ తో మరో గండం టీమిండియా కు ఉంటుంది. ఈ ఒక్క జట్టును చిత్తు చేస్తే సరిపోతుంది.
Australia become the first team to qualify for the semi-final of the Women's World Cup 2025. 🏆💛#Cricket #CWC #AUSvBAN #Sportskeeda pic.twitter.com/jegrCmFJiU
— Sportskeeda (@Sportskeeda) October 16, 2025
AUSW thrashed BANW by 10 wickets; the results should not be shocking.
Meanwhile, Healy peaking at the right time🔥#CWC25 pic.twitter.com/dHHaKRBQWU— Mr. Athar not Ali Khan 🇮🇳🏏 (@cricdrugs) October 16, 2025