Afg vs Ban: బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తమ సొంత దేశంలో బంగ్లాదేశ్ క్రికెటర్ల పై దాడులు చేశారు అభిమానులు. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయినందుకుగాను, బంగ్లాదేశ్ క్రికెటర్లకు బుద్ధి చెప్పాలని అక్కడి అభిమానులు రెచ్చిపోయారు. దుబాయ్ నుంచి తాజాగా బంగ్లాదేశ్ చేరుకున్న క్రికెటర్ల వాహనాలపై దాడులు చేశారు. ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ పై 3-0 తేడాతో విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ పరువు అంతర్జాతీయంగా పోయింది. దీంతో అభిమానులు రెచ్చిపోయి బంగ్లాదేశ్ క్రికెటర్ల వాహనాలపై దాడులు చేశారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ఇటీవల వన్డే తో పాటు టి20 సిరీస్ జరిగింది. అయితే టి20లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ వన్డేలు వచ్చేసరికి తడబడింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది బంగ్లాదేశ్. ముఖ్యంగా చివరి వన్డేలో ఏకంగా 200 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఈ విషయం మరింత వాళ్ళను వేధించింది. అఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్టుపై ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే స్వదేశానికి చేరుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుపై దాడికి ప్రయత్నించారట. ప్రత్యేక కార్లలో ఏర్పాటు నుంచి విమానశ్రయం నుంచి సిటీకి వస్తున్న ప్లేయర్ల వాహనాలపై అభిమానులు దాడి చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు కానీ, పోస్టులు మాత్రం పెడుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈ విషయం వైరల్ కావడంతో కొన్నిసార్లు ఓటమి తప్పదని అభిమానులకు బంగ్లాదేశ్ క్రికెట్ టీం యాజమాన్యం సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య 3 వన్డేల సిరీస్ ఇటీవల జరిగింది. అబుదాబి వేదికగా ఈ మూడు వన్డేలు నిర్వహించారు. ఈ మూడు వన్డేల నేపథ్యంలో మొదటి వన్డేలో ఏకంగా ఐదు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ తర్వాత అక్టోబర్ 11వ తేదీన ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. ఇందులో 81 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి విజయం సాధించింది. చిట్టే చివరన మొన్న 14వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడవ వన్డే జరిగింది. ఇందులో ఏకంగా 200 రుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసింది ఆఫ్గనిస్తాన్. ఇక అంతకుముందు 3 t20 ల సిరీస్ బంగ్లాదేశ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
अफगानिस्तान 🇦🇫 वालों ने बांग्लादेश 🇧🇩 को जबरदस्त बजाया है…. 😄
3 ODI मैचों सीरीज को 3 – 0 से हराकर अपने नाम किया है। बांग्लादेश जैसी टीम को क्लीन स्वीप करना अफगानिस्तान के लिए बहुत बड़ी बात है।
बस इसीलिए, अफगानिस्तान पाकिस्तान से लाख गुना बढ़िया टीम है।#AFGvsBAN #BANvsAFG pic.twitter.com/hBQ2iRMMef
— Jara Memer (@JARA_Memer) October 14, 2025