OTT Movie : కొన్ని సినిమాలను చూస్తున్నంత సేపు మనసుకు మంచి ఫీలింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ ఫీల్ గుడ్ సినిమాలు చూసినప్పుడు కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి. ఒక ఫిలిప్పైన్ సినిమాను చూస్తే అదే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఒక తాత, మనవడు చుట్టూ తిరుగుతుంది. మనవడికి మంచి జీవితం ఇవ్వడం కోసం, వేరొకరికి దత్తత ఇచ్చేస్తాడు. ఆ తరువాత స్టోరీ హార్ట్ ను పిండుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఎక్కడ ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘లోలో అండ్ ది కిడ్’ (Lolo and the kid) 2024లో వచ్చిన ఫిలిప్పైన్ సినిమా. బెనడిక్ట్ మిక్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జోల్ టోరె, యువెన్ మైకాల్, జేకే లాబాజో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 ఆగస్ట్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది.
లోలో అనే వ్యకికి దొంగతనాలు చేసి బతుకుతుంటాడు. వయసు అయిపోతుండటంతో కిడ్ అనే చిన్న బాలుడిని దత్తత తీసుకుని పెంచుతాడు. వీళ్లిద్దరూ ఫిలిప్పీన్స్ వీధుల్లో ధనవంతులను మోసం చేస్తూ జీవిస్తుంటారు. లోలో, కిడ్ మధ్య తాత మనవడిలా బలమైన బంధం ఏర్పడుతుంది. కానీ లోలో కిడ్‌ను దొంగతనం కోసం ఉపయోగిస్తాడు. ఒక రోజు ఒక జంట కిడ్‌ను దత్తత తీసుకోవాలని, లోలోకు డబ్బు, ఇల్లు ఇస్తామని చెబుతారు. లోలో ఈ ఆఫర్‌ను వద్దని అంటాడు. ఎందుకంటే అతను కిడ్‌ను వదలలేకపోతాడు. కానీ ఈ సమయంలో కిడ్‌కు మంచి జీవితం కావాలని అతను కోరుకుంటాడు. లోలో కిడ్‌ను వదలడం ఇష్టం లేకపోయినా, అతని మంచి కోసం ఆ ఆ జంటకు ఇవ్వడానికి ఒప్పేసుకుంటాడు. ఇక కిడ్ ఆ జంటతో వెళ్తాడు, లోలో ఒంటరిగా మిగిలిపోతాడు.
Read Also : ఈ కాలిపోయిన ఆసుపత్రిలో కాలు పెడితే తిరిగిరారు… అల్లాడించే అమ్మాయి ఆత్మ… అనన్య నాగళ్ళ హర్రర్ మూవీ
లోలో తన జీవితం గురించి ఆలోచిస్తూ, కిడ్‌తో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటాడు. అయితే కిడ్ ఈ కొత్త జీవితంలో సంతోషంగా ఉంటాడు. కానీ లోలోను మిస్ అయిన ఫీలింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ కథ ఎమోషనల్‌గా సాగుతుంది.కొన్ని సంవత్సరాల తర్వాత కిడ్ పెద్దవాడు అవుతాడు. అతను లోలోను ఒకసారి మళ్లీ కలుస్తాడు. కిడ్ లోలోతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుచేసుకుని ఏడుస్తాడు. లోలో కూడా కిడ్‌ను చూసి ఎమోషనల్ అవుతాడు. వాళ్ల మధ్య బంధం ఎప్పటికీ మారదని తెలుస్తుంది. లోలో, కిడ్‌కు మంచి జీవితం ఇవ్వడానికే అలా చేశానని చెప్పి ఎమోషనల్ అవుతాడు. ఈ సినిమా హార్ట్‌టచింగ్ ఎండింగ్‌తో ముగుస్తుంది.