ప్రముఖ ఆటో మోబైల్ దిగ్గజ సంస్థ టయోటా అద్భుతమైన ఎలక్ట్రిక్ సైకిళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. పర్యావరణ అనుకూల ప్రయాణాం, అత్యాధునిక టెక్నాలజీ, ఎక్కువ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ 2025ను రూపొందించింది. ప్రీమియం అర్బన్ ఇ-బైక్ గా దీన్ని పరిచయం చేయబోతోంది. స్మార్ట్ కనెక్టివిటీ, లాంగ్ రేంజ్ కెపాసిటీతో చక్కటి డిజైన్ ను కలిపి, ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఆధునిక పట్టణ జీవనశైలికి సరిపోయేలా తయారు చేసింది.
టయోటా ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్కువ బలంతో కూడిన అల్యూమినియం మిశ్రమంతో రూపొందించబడిన తేలికైన, ఏరోడైనమిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఆకట్టుకునే కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంచింది. ఇంటిగ్రేటెడ్ LED లైట్లు సైకిల్ అందాన్ని, భద్రతను మెరుగుపరుస్తాయి. డిజిటల్ కన్సోల్ వేగం, బ్యాటరీ స్థాయి, నావిగేషన్, కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఎర్గోనామిక్ సాడిల్, సర్దుబాటు చేయగల హ్యాండిల్ బార్ రైడ్లకు చక్కటి సౌకర్యాన్ని అందిస్తాయి. మొబైల్ యాప్ లతో రైడ్ వివరాలు, బ్యాటరీని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ పట్టణ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అధిక సామర్థ్యంతో కూడిన ఎలక్ట్రిక్ మోటారు ద్వారా పవర్ పొందుతుంది. ఎకో, స్పోర్ట్, టర్బోతో సహా పలు మోడ్ లను కలిగి ఉంటుంది. చక్కటి బ్రేకింగ్ విధానం ఉంటుంది. సిటీ ట్రాఫిక్, సబర్బన్ రోడ్లు రెండింటిలోనూ ప్రీమియం రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
భద్రత మీద టయోటా ఎలక్ట్రిక్ సైకిల్ 2025 ఎక్కువ దృష్టిపెట్టింది. ఇది డిస్క్ బ్రేక్స్, ABS, రిఫ్లెక్టివ్ సైడ్ ప్యానెల్స్, విజుబులిటీ కోసం ముందు, వెనుక LED లైట్లతో అమర్చబడి ఉంటుంది. స్మార్ట్ డిజిటల్ కన్సోల్ వేగ పరిమితులు, బ్యాటరీ స్టేటస్, మెయింటెనెన్స్ రిమైండర్ల గురించి రైడర్లను హెచ్చరిస్తుంది. షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్, దృఢమైన ఫ్రేమ్‌తో కలిపి, ఈ సైకిల్ చక్కటి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
టయోటా ఎలక్ట్రిక్ సైకిల్ అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి రేంజ్. ఇది ఒక ఫుల్ ఛార్జ్ మీద 440 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇది సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ రెండు గంటలలోపు వేగవంతమైన ఛార్జ్ ను అందిస్తుంది. డౌన్ టైమ్ ను తగ్గిస్తుంది. లాంగ్ రేంజ్ బ్యాటరీ రైడర్లు ఛార్జింగ్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తూ నాన్ స్టాప్ గా జర్నీ చేసే అవకాశం కల్పిస్తుంది.
టయోటా ఎలక్ట్రిక్ సైకిల్ 2025కు సంబంధించి ధర ఎంత అనేది ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈఎంఐ ఆప్షన్ ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు సుమారు రూ. 4,200 నుంచి ప్రారంభమయ్యే ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్ ను అందుబాటులో ఉంచింది. ఇది పట్టణ ప్రయాణికులు, విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
Read Also: ఏంటీ.. ఈ బైక్ ధర రూ.43 లక్షలా? దీని ఫీచర్స్ తెలిస్తే ఏమైపోతారో?