Gundeninda GudiGantalu Today episode October 17th: నిన్నటి ఎపిసోడ్ లో..మీనా మాణిక్యం ని చూశాను అని బాలుతో అంటుంది. పాలు నా ఫ్రెండ్ ని దారుణంగా అవమానిస్తాడా వాడికి ఆ షాప్ పెట్టడానికి నేనే కారణం అయినా కూడా వాడు కృతజ్ఞతలు లేకుండా నన్నే అంటాడని బాధపడుతూ ఉంటాడు. మీనా మాత్రం మౌనంగా ఏది పట్టించుకున్నట్టు ఉండడంతో ఏమైంది మీనా నేను ఇంతగా గొంతు చించుకొని అరుస్తున్న సరే నువ్వేమీ పట్టించుకోకుండా మౌనంగా ఉన్నావేంటి అని అడుగుతాడు. నేను మాణిక్యం నీ చూసాను అని మీనా అంటుంది. బాలు మాట్లాడుకోవడం విన్న రోహిణి ఎలాగైనా సరే ఇలా అనుమానాన్ని పోగొట్టాలి అని మాణిక్యం దుబాయ్ నుంచి ఫోన్ చేసినట్లు అంతా సెట్ అప్ చేసి ఫోన్ చేస్తుంది. మాణిక్యం మాట్లాడుతూ ఉండగా ప్రభావతి ఫోన్ ని తీసుకొని మీరు ఎప్పుడు వస్తారు? మీ బావ గారు ఎప్పుడు బయటకు వస్తారు అని అడుగుతుంది. నేను మా బావ తో మాట్లాడాను మా అమ్మాయికి ఇంకొక ఐదు లక్షలు పంపిస్తానని చెప్పాడు. త్వరలోనే అయిదు లక్షలు మా అమ్మాయి అకౌంట్లో వేస్తారు అని అనగానే ప్రభావతి కాళ్లు గాల్లో ఉంటాయి.. కానీ బాలుకు మాత్రం అనుమానం ఉంటుంది.. ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రభావతి సత్యం వచ్చేలోగా ముగ్గురు తమ భార్యలను ఎత్తుకొని హాల్లో నడుస్తూ ఉంటారు. అది చూసిన ప్రభావతి సత్యంని అడుగుతుంది. నిన్నెత్తుకుంటే నేను హాస్పిటల్లో ఉంటాను అని సత్యం అంటాడు. అయినా మీ భార్యని ఎత్తుకోవడమేంటి దించండి ఏమి మీనా నువ్వు రోజురోజుకు చిన్నపిల్లలనుకుంటున్నావా? అని మీనా అని అంటుంది. నీ కళ్ళకి మిగతా ఇద్దరు కనిపించలేదు నేను ఒక్కదాని మాత్రమే మీకు కనిపిస్తున్నానన్నమాట.. నన్నే అంటారే అని మీనా ప్రభావతిని అడుగుతుంది. అవునండి మీరు ఎందుకు మీనానే టార్గెట్ చేస్తున్నారు అని శృతి అడుగుతుంది. ఈ ఐడియా ఎవరిది అని ప్రభావతి అడుగుతుంది. అందరికన్నా ముందు ఈ ఐడియా ఇచ్చింది నేనే ఇప్పుడు తప్ప ఏమైందంటే అని శృతి కడిగి పడేస్తుంది.
ఇలాంటివి ఏవైనా ఉంటే మీ గదిలో పెట్టుకోవాలని చెప్పాను కదా అమ్మ అందరినీ ఇలా చేస్తే ఎలా అని ప్రభావతి అడుగుతుంది. ఏంటి ఆ అగ్గి పెట్టి లాంటి గదిలో ఇలాంటివి ఎలా జరుగుతాయి ఆంటీ అని శృతి అడుగుతుంది. బాత్రూంలా ఉండే గదిలో ఇలాంటివి కుదరవులే అని మనోజ్ కూడా అంటాడు. కనీసం ఆ బాత్రూం కూడా లేదు కదా అని బాలు అంటాడు. ఈ వారం రూమ్ ఇవ్వాలని అన్నాం కదా మరి ఎందుకు ఇవ్వలేదు అని సత్యం అడుగుతాడు.
నాన్న నేను ఒక బిజినెస్ మాన్ ని ఇంటికి రాగానే రూమ్ లేకుండా కింద పడుకోవాలి అంటే కష్టంగా ఉంది అని మనోజ్ అంటాడు. అయినా ఈ వారం శృతి వల్ల వంతు కదా వాళ్ళు ఇవ్వాలి అని రోహిణి అంటుంది. అయినా శృతి వాళ్ళ పుట్టింటికి వెళ్తానని అనింది కదా మరి వెళ్తుందేమో అని రోహిణి కావాలని అంటుంది.. ఇదంతా కాదు ఈ ఇంట్లో రూము సమస్య ఇంకా తీరలేదు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని సత్యం అంటాడు.. అయితే ఈ ఇంట్లో ఎవరు ఎంత ఇస్తున్నారు ప్రతి నెల అని సత్యము అడుగుతాడు.
అయితే అందరూ ఎంత అందిస్తున్నారు ఎంత ఇవ్వాలి అని సత్యం ఒక లెక్క రాస్తాడు. బాలు మీనా 10000 కూరగాయలకు 2000 ఇస్తామని అంటారు. మనోజ్ మాత్రం రోహిణి ఎంత చెప్తే అంత ఇస్తానని అంటాడు. రోహిణి మనోజ్ ఇద్దరూ కలిసి 13000 ఇస్తారు. రవి శృతి ఇద్దరూ కలిసి చేరొక పదివేలు ఇస్తామని అంటారు. ఇవన్నీ ప్రతినెలా ఐదో తారీకు కల్లా మీరు ఇవ్వాలి అని సత్యం అంటాడు. అందరూ తెచ్చి నాకే ఇవ్వాలని ప్రభావతి అంటుంది. ఆ ఆవిడకి ఇస్తే ఆవిడ మొత్తం మింగేస్తుంది అని బాలు అంటాడు.
శృతి మీనాపై బాలుపై ప్రశంసలు కురిపిస్తుంది. ఇప్పటివరకు మీరే ఇంటిని కడుతున్నారని నాకు అస్సలు తెలీదు అంటూ శృతి అనడంతో మిగతా వాళ్ళందరూ సైలెంట్ అవుతారు.. ఇక బాలు మనోజ్, రవి సరదాగా మాట్లాడుకోవాలని డాబా పైకి వెళ్తారు. నేను ఒక బిజినెస్ మ్యాన్ ని నేనే అంత డబ్బులు ఇస్తానో లేదో అని నమ్మకం లేదు మరి నువ్వేంటి రా కోతలు కోశావు నువ్వు పెద్ద పోటుగాడు అనుకున్నావా అన్నీ మనోజ్ కావాలని రెచ్చగొడతాడు. మనోజ్ మాటలు విన్న బాలు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు. నువ్వు షాప్ పెట్టడానికి కూడా మీ మామయ్య ఇస్తే పెట్టావు అది మర్చిపోతున్నావు అని బాలు అంటాడు.
Also Read : ఇవాళ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
నాకు వీడికి వాళ్ళ అత్తగారు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. వీడికి అది కూడా లేదు కదా వీళ్ళ అత్తగారు ఏం పెట్టిస్తారు. కనీసం 1000 రూపాయలు కూడా ఇవ్వలేరు అంటూ దారుణంగా అవమానించి మాట్లాడుతారు.. మనోజ్ నీ బాలు కొడతాడు. మీనా గురించి తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని బాలు మనోజ్ నీ కొడతాడు.. మీనా వదినను ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను అని రవి కూడా అంటాడు. వీళ్ళ ముగ్గురు కొట్టుకోవడం వరకు వెళ్తారు. రోహిణి మాత్రం మీనాకు కావాలని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..