IPS Arrest: లంచం వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యారు సీనియర్ ఐపీఎస్ అధికారి. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు కోట్ల రూపాయలను ఆయన ఇంట్లో సీజ్ చేశారు సీబీఐ అధికారులు. కేజీన్నర బంగారం కూడా ఉంది. సోదాల సందర్భంగా ఆ అధికారి ఆస్తులు చూసి సీబీఐ అధికారులు బిత్తరపోయారు.
సీబీఐకి చిక్కిన భారీ తిమింగలం
పంజాబ్‌లోని టాప్ పోలీసు అధికారి, రోవర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్చరణ్ సింగ్ భుల్లార్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-CBI అధికారులు గతరాత్రి అరెస్టు చేశారు. అవినీతి కేసులో ఓ వ్యక్తి నుంచి దాదాపు 8 లక్షల రూపాయలు ఆయన డిమాండ్ చేయడమే అసలు కారణం. ఈ కేసు నేపథ్యంలో ఆయన బండారం బట్టబయలైంది.
భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు ఆధారాలు లభించాయి. సోదాల సయమంలో ఆయన ఐపీఎస్ అధికారి ఆస్తులను చూసి సీబీఐ అధికారులు బిత్తరపోయారు. ఓ విషయమై ఫిర్యాదుదారుడి నుంచి లంచం డిమాండ్ చేశాడు ఐపీఎస్ హర్చరణ్ సింగ్. ఓ ప్రైవేటు వ్యక్తితో కలిసి ఆ లంచం తీసుకున్న సమయంలో అరెస్టు చేసింది సీబీఐ.
ఐపీఎస్ అధికారి ఆస్తులు చూసి షాకైన సీబీఐ
ఏకంగా రూ. 8లక్షల మొత్తాన్ని డిమాండ్ చేశాడు. చండీగఢ్‌లోని సెక్టార్ 21లో ఆయన్ని రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకుంది. చండీగఢ్, పంజాబ్‌లలోని అతడి నివాసాల్లో సోదాలు చేపట్టారు అధికారులు. భుల్లార్ తోపాటు మరో వ్యక్తిని శుక్రవారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్ సంబంధాలను గుర్తించడానికి సోదాలు కొనసాగుతున్నాయి.
2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన భుల్లార్. పంజాబ్‌లో వివిధ స్థాయిల్లో రకరకాల పదవులు చేపట్టారు. పాటియాలా రేంజ్ డిఐజి, విజిలెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్, మొహాలి, సంగ్రూర్, ఖన్నా, హోషియార్‌పూర్, ఫతేఘర్ సాహిబ్, గురుదాస్‌పూర్‌లలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సహా అనేక కీలక పదవులను నిర్వహించారు.
ALSO READ: వయోగ్రా ట్యాబ్లెట్లు ఇచ్చి, భర్తను కిటికీ గ్రిల్‌కు కట్టేసి
2021లో శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియాపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసు దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి భుల్లర్ నాయకత్వం వహించాడు. అంతేకాదు పంజాబ్ వ్యాప్తంగా మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లను నిర్మూలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం ‘యుధ్ నషేయన్ విరుధ్’లో కూడా ఆయన పని చేశాడు.
భుల్లార్ నవంబర్ 2024లో రోపర్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మొహాలీ, రూప్‌నగర్, ఫతేఘర్ సాహిబ్ జిల్లాలను పర్యవేక్షించారని అధికారులు తెలిపారు. భుల్లార్ ఎవరోకాదు.. పంజాబ్ మాజీ డీజీపీ ఎంఎస్ భుల్లార్ కుమారుడు కూడా.
సుమారు 5 కోట్ల నగదు ఇప్పటివరకు లభించింది. ఇంకా లెక్కింపు జరుగుతోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా.
దాదాపు 1.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
పంజాబ్‌లోని స్థిరాస్తులు-ఆస్తులకు సంబంధించిన పత్రాలు భారీగా లభ్యమయ్యాయి.
మెర్సిడెస్, ఆడితో సహా రెండు లగ్జరీ వాహనాలు ఉన్నాయి.
లగ్జరీ వాచీలు ఏకంగా 22 ఉన్నాయి.
లాకర్ తాళాలు చాలానే ఉన్నాయి. కొన్నింటిని స్వాధీనం చేసుకుంది సీబీఐ.
40 లీటర్ల దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు
1 డబుల్ బారెల్డ్ గన్, 1 పిస్టల్, 1 రివాల్వర్, 1 ఎయిర్ గన్, మందుగుండు సామగ్రి ఉంది.
మధ్యవర్తి నుండి స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో 21 లక్షల నగదు ఉంది.