BigTV English

Amazon Diwali Offers: అమెజాన్ దీపావళి ఆఫర్లు.. 80% తగ్గింపు, రూ.80 క్యాష్‌బ్యాక్! బ్యూటీ ప్రోడక్ట్స్ పై భారీ తగ్గింపు

Amazon Diwali Offers: అమెజాన్ దీపావళి ఆఫర్లు.. 80% తగ్గింపు, రూ.80 క్యాష్‌బ్యాక్! బ్యూటీ ప్రోడక్ట్స్ పై భారీ తగ్గింపు
Advertisement

Amazon Diwali Offers: దీపావళి సీజన్ వచ్చిందంటే మన అందరి కళ్ళ ముందు మెరుస్తూ కనిపించే ఒక్క పేరు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్. ప్రతి ఏటా దీపావళి ముందు అమెజాన్ ఇచ్చే ఆఫర్ల కోసం కోట్ల మంది ఎదురుచూస్తుంటారు. ఈసారి అయితే అమెజాన్ ఆఫర్లు అందరికి అందుబాటులో ఉండేలా తీసుకువచ్చింది.


80శాతం వరకు తగ్గింపని సైన్ బోర్డ్స్

అమెజాన్ యాప్ లోకి ప్రవేశించిన వెంటనే కళ్ళు చెదిరే రీతిలో కనిపిస్తున్నాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ అని పెద్దగా రాసిన ప్రకటనలు, పక్కనే 80శాతం వరకు తగ్గింపు అని మెరుస్తున్న సైన్ బోర్డ్స్! అంటే, 80 శాతం వరకు తగ్గింపు! ఇది విన్నవెంటనే షాపింగ్ మూడ్ లోకి వెళ్ళిపోవడం ఖాయం.


రూ.99 నుంచే మొదలైన ఆఫర్లు

ఈ సారి అమెజాన్ ఆఫర్లు కేవలం ఎలక్ట్రానిక్స్ లేదా గాడ్జెట్లకే కాదు, ప్రతి విభాగం మీద ఉన్నాయి. రూ.99, రూ.199, రూ.299, రూ.499 లోపు భారీ తగ్గింపుతో ప్రత్యేక విభాగాలు ఉంచారు. అంతేకాకుండా, ఎవరి బడ్జెట్ ఏమైనా సరే అందరికీ సరిపోయే వస్తువులు దొరుకుతాయి.

బ్యూటీ ప్రొడక్ట్ పై ఆఫర్లు

ముఖ్యంగా, మహిళల కోసం అమెజాన్ తెచ్చిన బ్యూటీ ఆఫర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బ్యూటీ ఠాట్ ఔత్సహిన్స్ డిఎస్ (Beauty That Outshines Diyas) అనే స్లోగన్ తో, అమెజాన్ బ్యూటీ ప్రోడక్ట్స్ పై 70శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. లోరియల్, సిటాఫిల్, విష్‌కేర్ వంటి పేరొందిన బ్రాండ్ల క్రీములు, షాంపూలు, సీరమ్స్ అన్నీ మీరు నమ్మలేని, ఆశ్చర్యాన్ని కలిగించే ధరలు మీ ముందు ఉంటాయి.

రాత్రి 8 గంటల డీల్స్ షాపింగ్

అంతేకాదు, అమెజాన్ ప్రత్యేకంగా రాత్రి 8 గంటల డీల్స్ షాపింగ్ చేయండి (Shop 8PM Deals) అని ఒక కొత్త ట్రెండ్ మొదలుపెట్టింది. రాత్రి ఎనిమిది గంటలకు మొదలయ్యే ఆఫర్లు, ఒక్కసారిగా యాప్‌ను హీట్ చేస్తాయి. ఏ వస్తువులు ఎంత తగ్గింపులో వస్తాయో అర్థం కాని స్థాయిలో రేట్లు పడిపోతున్నాయి.

Also Read: Hyderabad: 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్..

అమెజాన్ రూ.80 వరకు ఫ్లాట్ క్యాష్‌బ్యాక్

ఇక షాపింగ్ చేస్తే బోనస్ లా వస్తుంది క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా. యూపీఐ పేమెంట్స్ ద్వారా షాపింగ్ చేస్తే, అమెజాన్ రూ.80 వరకు ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. అదే సమయంలో ఫ్రీ డెలివరీ సదుపాయం కూడా అందిస్తోంది. అంటే, మీరు ఏ వస్తువు కొన్నా షిప్పింగ్ ఛార్జీలు లేవు — పూర్తిగా ఉచితం!

గ్రోసరీ నుంచి గిఫ్ట్ ఐటమ్స్

అమెజాన్‌లో బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాదు, గ్రోసరీ నుంచి గిఫ్ట్ ఐటమ్స్ వరకు అన్నింటిపైనా తగ్గింపులు ఉన్నాయి. ఫ్రెష్ కేటగిరీ లో కూరగాయలు, పండ్లు కూడా స్పెషల్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

క్రేజీ ప్రైసెస్ బజార్

ఈ పండుగ సీజన్ లో, అమెజాన్ ప్రత్యేకంగా క్రేజీ ప్రైసెస్ బజార్ (Crazy Prices Bazaar) అనే విభాగాన్ని కూడా ప్రారంభించింది. దీంట్లో చిన్న చిన్న వస్తువులు వాచ్‌లు, ఇయర్‌ ఫోన్లు, బ్యాగులు, బ్యూటీ కిట్లు, సీళ్లు అన్నీ చాలా తక్కువ ధరలకు దొరుకుతున్నాయి.

అమెజాన్ పే వాలెట్ 10శాతం డిస్కౌంట్

ఇంకా మీ షాపింగ్ అనుభవం సులభం కావాలంటే అమెజాన్ పే వాలెట్ (Amazon Pay Wallet) ద్వారా డైరెక్ట్ పేమెంట్ చేయవచ్చు. అలాగే ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకమైన 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి కార్డులు వాడేవారికి ఇది బిగ్ బోనస్.

అమెజాన్ షాపింగ్ నిజమైన సెలబ్రేషన్

దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం మాత్రమే కాదు, కుటుంబానికి ఆనందం ఇచ్చే గిఫ్ట్‌లు ఇవ్వడం కూడా ఒక సంతోషం. అమెజాన్ ఇప్పుడు ఆ సంతోషాన్ని మీ ఇంటి వద్దకు తీసుకువస్తోంది. ఏ వస్తువుకైనా బిగ్ డీల్స్, ఇన్‌స్టంట్ డెలివరీ, సేఫ్ ప్యాకేజింగ్ తో పండుగ షాపింగ్ ని మరింత ఆనందంగా మార్చింది.
ఇక మీరు కూడా ఈ అద్భుత ఆఫర్లను మిస్ అవ్వకుండా వెంటనే యాప్ ఓపెన్ చేసి మీ ఫేవరేట్ వస్తువులు కార్ట్ లో వేసేయండి. ఈ పండుగ సీజన్ లో అమెజాన్ మీ షాపింగ్ ని నిజమైన సెలబ్రేషన్ గా మార్చేస్తుంది.

Related News

Hyderabad Postal: హైదరాబాద్ లో 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్.. నైట్ షిఫ్ట్ ప్రారంభించిన పోస్టల్ శాఖ

BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్.. రూ.1కే కొత్త కనెక్షన్.. ఉచిత సిమ్, రోజుకు 2 జీబీ డేటా

EPFO New Rules: PF ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ.. ఈ కొత్త నియమాలు మీకు తెలుసా?

Diwali Gold: రూ.41 వేలకే 10 గ్రాముల బంగారం కొనేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు

LIC BIMA Lakshmi: తక్కువ ప్రీమియంతో ఎల్ఐసీ కొత్త పాలసీ.. బీమా లక్ష్మి ప్లాన్ వివరాలు ఇలా!

Digital Gold Investments: డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా? లాభాలు ఏమిటీ?

JioMart Offer on Rice Bag: జియోమార్ట్ అదిరే ఆఫర్.. 26 కిలోల బియ్యం మరీ ఇంత తక్కువ ధరకా?

Big Stories

×