BigTV English

Reliance – Disney Merger: రిలయన్స్, డిస్నీ మెగా డీల్.. తుది దశలో చర్చలు

Reliance – Disney Merger: రిలయన్స్, డిస్నీ మెగా డీల్.. తుది దశలో చర్చలు

Reliance – Disney Merger updates: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా మీడియా సంస్థ డిస్నీలో రూ.12,451 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఈ రెండు సంస్థల విలీనం తర్వాత.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు పోటీ మరింత కష్టంగా మారనుంది. ఎందుకంటే జియో సినిమా తక్కువ ధర ప్లాన్లతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.


రూ.9,37,548 కోట్ల భారీ నికర విలువతో భారత్ లోనే కాదు ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ ఉన్నారు. ఆయన రూ. 19,75,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్‌తో భారత్ లో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్. ముఖేష్ అంబానీ తమ కంపెనీకి అనుబంధ సంస్థల ద్వారా కూడా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

త్వరలో భారతదేశపు అతిపెద్ద మీడియా సామ్రాజ్యానికి ముఖేష్ యజమాని కాబోతున్నారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు నియంత్రణ వాటాను కొనుగోలు చేయడానికి వాల్ట్ డిస్నీతో ఒప్పందం చేసుకోనుంది. ఎకనామిక్ టైమ్స్ తాజా నివేదిక ప్రకారం మెగా స్టాక్, నగదు విలీనం కోసం ఇరుపక్షాలు జరుపుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయి. ద్వైపాక్షిక చర్చలను ముగించేందుకు ఫిబ్రవరి 17 వరకు గడువు ఉంది.


Read More: ఆ కంపెనీ కార్లకే క్రేజ్..

సంయుక్త మీడియా సంస్థలో ముఖేష్ అంబానీ 60 శాతం వాటాను కలిగి ఉంటారు. మిగిలిన 40 శాతం వాల్ట్ డిస్నీ కంపెనీతో ఉంటుందని నివేదిక సూచిస్తుంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా మీడియా సంస్థలో రూ. 12,451 కోట్లను ఇంజెక్ట్ చేయాలని యోచిస్తోంది. విలీనం తర్వాత నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్‌లు జియో సినిమా తక్కువ ధర ప్లాన్‌లతో పోటీపడటం మరింత కష్టతరం కావచ్చు. జియో టెలికాం, ఓటీటీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జియో రీఛార్జ్‌తో తక్కువ-ధర యాడ్-ఆన్ ప్లాన్‌లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

జియో సినిమా, ఇంతకుముందు ఐపీఎల్ హక్కులను సొంతం చేసుకుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో ప్రత్యక్ష పోటీలో నిలిచింది. ఐపీఎల్, ఫిఫా ప్రపంచ కప్‌లకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత హాట్‌స్టార్ యూజర్లు తగ్గారు. డిస్నీ హాట్‌స్టార్.. జియో సినిమా నుంచి ఆసియా కప్ , క్రికెట్ ప్రపంచ కప్ హక్కులను పొందగలిగింది. ముఖేష్ అంబానీ కంపెనీ డిస్నీ హాట్‌స్టార్‌తో విలీనం కావడంతో జియో సినిమాకు వ్యతిరేకంగా పోటీ ల్యాండ్‌స్కేప్‌లో గణనీయమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×