BigTV English

car sales : ఆ కంపెనీ కార్లకే క్రేజ్..

car sales : ఆ కంపెనీ కార్లకే క్రేజ్..
car sales

car sales IN 2024 : కార్లు అంటే తెగ మోజుపడపోతున్నారు ఇండియన్లు. జనవరి 2024లో కార్ల అమ్మకాల్లో నమోదైన వృద్ధి చూస్తే ఇదే బోధపడుతుంది. గత నెలలో మొత్తం కార్ల విక్రయాలు 3,93,250 యూనిట్లకు చేరిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(FADA) వెల్లడించింది. సరిగ్గా ఏడాది క్రితం అమ్మకాలతో పోలిస్తే 13.3% వృద్ది నమోదైంది. నెలవారీ అమ్మకాలనను చూసినా 34.21 శాతం పెరుగుదల కనిపిస్తోంది. గత నెలలో అమ్ముడుబోయిన కార్లలో 90 శాతానికి పైగా వాటా ఆరు బ్రాండ్లదే ఉండటం విశేషం.


మారుతి, హ్యుందాయ్, టాటా, కియా, మహీంద్ర, టయోటా వాహనాల అమ్మకాలు జోరుపై ఉన్నాయి. కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిలిచి.. మార్కెట్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

Read More : తొలిసారి శాంసంగ్‌పై యాపిల్ పైచేయి..!


ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా రిటైల్ అమ్మకాల్లో గణనీయ వృద్ది కనపడుతోందని FADA అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా వెల్లడించారు. అలాగే కొత్త మోడళ్లు, మెరుగైన లభ్యత, సమర్థ మార్కెటింగ్ వ్యూహాలు, పెళ్లిళ్ల సీజన్ వంటి కారణాల వల్ల కూడా కార్ల అమ్మకాలు ఊపందుకున్నట్టు వివరించారు.

ఇక టూ వీలర్ సెగ్మెంట్ లోనూ సేల్స్ ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. ఈ రంగంలో ఏటా 14.96 శాతం పెరుగుదల కనిపిస్తోంది. డిసెంబర్ 2023లో 12,68,990 యూనిట్లు విక్రయించగా.. గత నెలలో ఆ సంఖ్య 14,58,849కు చేరింది.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×