దీపావళి పండుగ సందర్భంగా తన యూజర్లకు జియో టెలికాం గుడ్ న్యూస్ చెప్పింది. జియో యూజర్లు అందరికీ అనుకూలమైన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ ను ప్రారంభించింది. జియో దీపావళి ఆఫర్ పేరుతో కేవలం రూ. 199కే అందిస్తోంది. ఈ రీఛార్జ్ చేసుకున్న వారికి 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఇస్తుంది. అపరిమిత 5G డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, అదనపు ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో డేటా పరిమితులు, కాల్ పరిమితుల గురించి ఆలోచించకుండా వినియోగదారులు వినోదాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది.
దీపావళి స్పెషల్ రీఛార్జ్ లో అత్యంత ముఖ్యమైన విషయం అపరిమిత 5G డేటా. జియోఅధునాతన 5G నెట్ వర్క్ తో వినియోగదారులకు అద్భుతమైన హైస్పీడ్ డేటా అందిస్తోంది. ఇది HD వీడియోలను చూడటానికి, ఆన్ లైన్ గేమింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, బ్రౌజింగ్ కు అనుకూలంగా ఉంటుంది. హై స్పీడ్ 5G కనెక్టివిటీ ఎక్కువ డేటా వినియోగ సమయాల్లో కూడా కనీస బఫరింగ్ రాకపోవడం విశేషం.
అపరిమిత డేటాతో పాటు దేశం అంతటా ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో కనెక్ట్ అయి ఉండవచ్చు.
సాధారణ రీఛార్జ్ ప్లాన్‌ల మాదిరిగా కాకుండా ఈ ప్రత్యేక జియో దీపావళి ఆఫర్ 84 రోజుల వ్యాలిడిటీనికి కలిగి ఉంటుంది. వినియోగదారులకు దాదాపు మూడు నెలల నిరంతరాయ సేవను అందిస్తుంది. పదే పదే రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్లు ఈ రీఛార్జ్ చేసుకోవడం బెస్ట్. వినోదం కోసం ఉపయోగించే వారికి, కాల్స్ ఎక్కువగా మాట్లాడుకునే వారికి ఈ రీఛార్జ్ అనుకూలంగా ఉంటుంది.
Read Also: డిమార్ట్ దీపావళి ఆఫర్స్, ఏకంగా 80 శాతం డిస్కౌంట్!
జియో అందిస్తున్న దీపావళి ఆఫర్ పలు అదనపు బెనిఫిట్ ను కూడ అందిస్తోంది. జియో సినిమా, జియో టీవీ, జియో సావన్ లాంటి జియో యాప్ లకు ఉచిత యాక్సెస్, సినిమాలు, సంగీతం, లైవ్ టీవీని అందిస్తుంది. హిడెన్ రీఛార్జీలు లేవు. ట్రాన్స్ ఫరెన్సీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ గా ఆకట్టుకోనుంది. MyJio యాప్, ఆన్ లైన్ వాలెట్లు, రిటైల్ స్టోర్ల ద్వారా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ రీఛార్జ్ చేసుకోండి. 84 రోజుల పాటు డేటా, కాల్స్, ఇతర బెనిఫిట్స్ ఎంజాయ్ చేయండి.
Read Also: బజాజ్ ఫైనాన్స్ క్రేజీ ఆఫర్స్, దీపావళికి సగం ధరకే శామ్‌సంగ్ ప్రొడక్ట్స్!