Gold rate Increase: ఆల్ టైం రికార్డ్ హై కి చేరింది బంగారం ధర.. ఒక్క రోజే రూ. 3330కి చేరింది.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,440 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,770 వద్ద పలుకుతోంది.. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,18,650 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,700 వద్ద పలుకుతోంది.
బంగారం ధరలు భగభగలు..
అయితే ప్రస్తుతం దీపావళి ముందొచ్చే ధన్ తేరస్ కారణంగా.. డిమాండ్ భారీ ఎత్తున పెరగటంతో.. ప్రస్తుతం బంగారం ధర లక్షా ముప్పై రెండు వేల వరకూ చేరినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పలు రికార్డులు నమోదు చేస్తున్న బంగారం ధర.. దీపావళి దగ్గరకు వచ్చే కొద్దీ.. మరింత పెరిగి.. అందనంత ఎత్తులకు చేరిటట్టు కనిపిస్తోంది. ఇంకా బంగారం ఎవరైనా కొనాలనుకుంటే ఇప్పుడే కొనడ మంచిదంటున్నారు.. ఎందుకంటే ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు అంటున్నారు నిపుణులు..
రాష్ట్రంలో శుక్రవారం బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,32,770 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,700 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,32,770 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,700 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,32,770 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,700 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,32,920 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,21,850 వద్ద ఉంది.
Also Read: అమీర్‌పేట్‌లో వరద కష్టాలకు చెక్.. హైడ్రా స్పెషల్ ఆపరేషన్ సక్సెస్
నేటి సిల్వర్ ధరలు ఇలా..
ఇదే వింత అంటే.. బంగారం ధరలు మూడు వేయిలు పెరిగితే.. సిల్వర్ ధరలు మాత్రం మూడు వేయిలు తగ్గింది. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,06,000 కాగా.. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ.2,03,000 వద్ద కొనసాగుతుంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజీపై రూ. 3,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,85,000 వద్ద కొనసాగుతోంది. ఎవరైనా సిల్వర్ కొనాలనుకుంటే వెంటనే వెళ్లి కొనేయండి.. లేదంటే మళ్లీ పెరిగి అవకాశం ఉంది..