BigTV English

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

BSF Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. టెన్త్ క్లాస్ పాసై స్పోర్ట్స్ కోటాలో రాణించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టుల వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)..  స్పోర్ట్స్ కోటాలో సంబంధిత విభాగాల్లో 241 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రూప్-సి నాన్-గెజిటెడ్ అండ్‌ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 20వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 241


ఈ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్‌ నాన్ మినిస్టీరియల్ (స్పోర్ట్స్ కోటా) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హత: టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. అలాగే నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో పాల్గొని ఉండాలి. విజయాలు కూడా సాధించాలి.

ఏ స్పోర్ట్స్ లో రాణించాలంటే..?

ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, ఐస్-స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్‌ లిఫ్టింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, టైక్వాండో, వుషు, ఫెన్సింగ్, కాయాకింగ్‌, కానోయింగ్‌ (పడవ పందెం), రోయింగ్‌, టెబుల్‌ టెన్నిస్‌ తదితర క్రీడల్లో రాణించి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 25

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 20

వయస్సు: 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.147.20 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://rectt.bsf.gov.in/

అప్లికేషన్ లింక్: https://rectt.bsf.gov.in/

ALSO READ: Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 241

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 20

Related News

Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం

Indian Navy: టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. బంగారు భవిష్యత్తు

IB: రూ.69,000 జీతంతో ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు బ్రో.. ఇంకా నాలుగు రోజులే?

Bank of Maharashtra: డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.93,960.. ఇంకెందుకు ఆలస్యం

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

Big Stories

×