Apple Seeds: యాపిల్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది ఆరోగ్యానికి మేలు చేసే పండు. రోజుకి ఒక యాపిల్ తింటే వైద్యం అవసరం లేదనే మాట కూడా అందరికి తెలుసు. కానీ ఈ పండులో దాగి ఉన్న ఒక రహస్య విషయం వింటే మాత్రం చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటంటే, యాపిల్ పండ్లలోని విత్తనాలు. అవును దాని విత్తనాలు తింటే ప్రాణానికే ప్రమాదం అని మీకు తెలుసా? దీని గురించి తెలుసుకుందాం.
యాపిల్ తినడం ఆరోగ్యం
యాపిల్ తినడం వలన మన ఆరోగ్యానికి విటమిన్లు, ఖనిజ తత్వాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతే కాదు తలనొప్పి ఉన్నవాళ్లు దానిపై చిటికెడు ఉప్పు వేసి తిన్నా మైగ్రేన్ సమస్యకూడా తగ్గుతుంది. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో విటమిన్లు పోషకాలు చాలా ఉండటం వలన అలసత్వం కూడా చాలా దూరంగా ఉంటుంది. అయితే ఇది తినేటప్పుడు అందులో ఉన్న విత్తనాలు చాలా ప్రమాదకరమని ఎవ్వరూ ఊహించలేరు కూడా? ఎందుకంటే యాపిల్ తింటే చాలా మంచిది దాని విత్తనాలు విషంతో సమానమని ఎవరి సందేహం రాదు కాబట్టి. విటమిన్ పోషకాలున్న యాపిల్ లో విత్తనాలు ఇంత ప్రమాదకరమా అనేది తెలిసి ఆరోగ్య నిపుణులకే ఆశ్చర్యానికి కలిగిస్తుంది.
విత్తనాలు తింటే ఏమవుతుంది?
యాపిల్ విత్తనాల్లో మాత్రం సయనైడ్ అనే ప్రాణాంతక పదార్థం దాగి ఉంటుంది. సయనైడ్ అంటే మన శరీరంలోకి వెళ్లిన వెంటనే రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. శ్వాసక్రియ ఆగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఇది ఒక విషం. ఎందుకంటే ఆ గట్టి పొర జీర్ణ వ్యవస్థలో సులభంగా కరగదు. కానీ విత్తనాలను నమలితే మాత్రం లోపలున్న సయనైడ్ శరీరంలోకి చేరుతుంది. చిన్న పిల్లలకు అయితే త్వరగా ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలకు యాపిల్ ఇచ్చేటప్పుడు విత్తనాలను తీసి ఇస్తే మంచిందని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: Navratri Fashion Trends 2025: నవరాత్రి 2025.. తొమ్మిది రోజుల తొమ్మిది రంగుల ప్రత్యేకత
ఎన్ని విత్తనాలు తింటే ప్రణానికి ప్రమాదం?
ఒక రెండు విత్తనాలు తింటే శరీరానికి ఎలాంటి నష్టం జరగదు. శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ దానిని సులభంగా ఎదుర్కొంటుంది. కానీ ఎవరైనా 200 వరకు విత్తనాలను నమిలి తింటే ఒక్క నిమిషంలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇంత ఘోరమైన విషం ఆ చిన్న చిన్న విత్తనాల్లో దాగి ఉందని ఆలోచిస్తేనే భయం కలుగుతుంది.
విత్తనాలు తిని ఎవరైనా మరణించారా?
ప్రపంచంలో ఇప్పటివరకు యాపిల్ విత్తనాల వల్ల జరిగిన మరణాల సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరూ అంత పెద్ద మొత్తంలో విత్తనాలను తినలేదు. అయినప్పటికీ దీని వెనుకున్న శాస్త్రం తెలుసుకోవడం మనకు చాలా మంచిది. అందుకే నిపుణులు చెబుతున్న విషయం ఏమిటంటే, యాపిల్ తినడంలో ఎలాంటి భయం లేదు. పండు తినడం ఎంతో మేలు చేస్తుంది. విత్తనాలు మనకు తెలియకుండా ఒకటి రెండు మింగినా ప్రమాదం లేదు, కానీ ఎక్కువ మోతాదులో నమిలి తినడం మాత్రం ప్రమాదకరమే. కాబట్టి యాపిల్ తినండి కానీ, విత్తనాలు తీసివేసి తింటే ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండి, విత్తనాలను తీసేసి తినడం మంచిది.