BigTV English

OPPO Smartphone: ఇది కదా కావాల్సింది.. ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లో దుమ్ము రేపుతున్న ఒప్పో కొత్త ఫోన్

OPPO Smartphone: ఇది కదా కావాల్సింది.. ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లో దుమ్ము రేపుతున్న ఒప్పో కొత్త ఫోన్

OPPO Smartphone: ఒప్పో ఎఫ్31 ప్రో 5జి ఇప్పుడు మన ముందుకు కొత్త ఆఫర్‌తో వచ్చింది. ఒప్పో నుంచి విడుదలైన స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎఫ్31 ప్రో 5జి ప్రస్తుతం టెక్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ఫోన్‌ను ప్రీ-ఆర్డర్‌ ఆఫర్‌లో ప్రత్యేక తగ్గింపుతో అందిస్తున్నారు. అసలు ధర రూ.31,999 కాగా, ఇప్పుడు లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లో కేవలం రూ.26,999కే అందుబాటులోకి వచ్చింది. అంటే దాదాపు రూ.5,000 తగ్గింపు యూజర్లకు లభిస్తోంది.


డిస్‌ప్లే – హెచ్‌డి క్వాలిటీ

ఈ ఫోన్ ప్రత్యేకతల గురించి మాట్లాడితే, ముందుగా దీని డిస్‌ప్లే చాలా ఆకట్టుకుంటుంది. 6.7 అంగుళాల అమోలేడ్ పూర్తి హెచ్‌డి+ స్క్రీన్‌తో పాటు 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఉంది. గేమింగ్ చేయాలన్నా, సోషల్ మీడియాలో స్క్రోల్ చేయాలన్నా, వీడియోలు చూడాలన్నా చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉండటంతో ఎండలో కూడా స్పష్టంగా ఉపయోగించుకోవచ్చు.


5జి నెట్‌వర్క్ స్పీడ్

ప్రాసెసర్ విషయానికి వస్తే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ సిరీస్ 5జి చిప్‌సెట్‌తో వస్తోంది. దీని వల్ల యూజర్లు హై స్పీడ్ ఇంటర్నెట్, మల్టీ టాస్కింగ్, గేమింగ్ అన్నీ ఏ ల్యాగ్ లేకుండా సులభంగా వాడుకోవచ్చు. 5జి నెట్‌వర్క్ స్పీడ్ వల్ల యూజర్లకు ఒక కొత్త అనుభవం కలుగుతుంది.

256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

ఫోన్‌ స్టోరేజ్ కూడా ప్రత్యేకంగా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. రామ్ ఎక్స్‌పాంషన్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ మరింత వేగంగా పనిచేస్తుంది. ఒకేసారి అనేక ఆప్‌లను ఉపయోగించినప్పటికీ స్పూత్‌గా పని చేస్తుంది.

Also Read: Bigg Boss 9: మాస్క్ మ్యాన్‌కు రంగు పడింది.. ఏడ్చేసిన రీతూ చౌదరి, వాడివేడిగా నామినేషన్స్

64 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రైమరీ కెమెరా

కెమెరా విషయానికి వస్తే, ఒప్పో ఎప్పటిలాగే ఫోటోగ్రఫీని ప్రధానంగా ఉంచింది. వెనక భాగంలో 64 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కలిపి ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తున్నారు. ఫోటోలు స్పష్టంగా, డీటైల్స్‌తో వస్తాయి. వీడియోల విషయంలో కూడా ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ చాలా నాణ్యతగా (quality) వస్తాయి.

5,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ

బ్యాటరీ విషయంలో కూడా యూజర్లను ఆకట్టుకునేలా చేశారు. 5,000ఎమ్ఏహెచ్ పెద్ద బ్యాటరీతో వస్తుంది. దీని తోపాటు 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా అందిస్తున్నారు. కేవలం 20 నిమిషాల్లోనే 60 శాతం వరకు ఛార్జ్ అయిపోతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఒక రోజు సులభంగా వాడుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగులకు, గేమ్ ఆడేవారికి ఈ పోన్ గిప్ట్ అనేచెప్పాలి.

స్టైలిష్‌ డిజైన్

డిజైన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఫోన్ చాలా సన్నగా, తేలికగా ఉండేలా తయారు చేశారు. యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని షైనింగ్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తెచ్చారు.

ఏఐ ఫీచర్లు

సాఫ్ట్‌వేర్ పరంగా కూడా ఇది అప్‌డేట్ వెర్షన్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ ఓఎస్ 15 అందించారు. కొత్తగా ఏఐ ఫీచర్లు, ప్రైవసీ ఆప్షన్స్ కలిపి యూజర్లకు మెరుగైన అనుభవం ఇస్తుంది. ప్రీ-ఆర్డర్ ఆఫర్ అందుబాటులో ఉండటం వల్ల ఈ ఫోన్‌ కొనాలనుకునే వారికి మంచి అవకాశం. ధరకే కాక, ఫీచర్స్ పరంగా కూడా ఈ ఫోన్ మార్కెట్‌లో సరిగ్గా పోటీకి సిద్ధంగా ఉంది.

Related News

5G Phone Low Price: భారత మార్కెట్లో జియో కొత్త హంగామా.. తక్కువ ధరకే 5జీ ఫోన్

Smart Phone: కొత్తగా వచ్చిన మోటో జి85 5జి.. స్టైలిష్ డిజైన్‌తో అద్భుతమైన ఫీచర్స్

Flipkart Offers 2025: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025.. షాపింగ్ పండుగకు సిద్ధమా?

BMW S 1000 R: BMW కొత్త బైక్ వచ్చేసింది.. ధర అక్షరాలా రూ. 20 లక్షలు!

Truck Drivers: ట్రక్కు డ్రైవర్లకు శాపంగా మారిన జీఎస్టీ 2.0 ఎందుకంటే?

India Smartphone Exports: ఇండియాలో యాపిల్ అరుదైన ఘనత.. వామ్మో, అని లక్షల కోట్లే!

TM- R Symbols: ప్రొడక్ట్స్, బ్రాండ్ల పేరు మీద ఉండే TM, R సింబల్స్‌ కు అర్థం ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు!

Big Stories

×