DMart Ready App: వర్షాకాలం వచ్చిందంటే బయట వాతావరణం తడిసి ముద్దవుతుంది. అలాంటి రోజుల్లో బయటకు వెళ్లి షాపింగ్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా బియ్యం, పప్పులు, కూరగాయలు, సబ్బులు, డిటర్జెంట్లు, టీ, కాఫీ, పాలు వంటి ప్రతిరోజూ అవసరమయ్యే సరుకుల కోసం బయట తిరగడం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో మనకు సహాయం చేసేందుకు డీమార్ట్ రెడీ యాప్ ముందుకొచ్చింది.
ఎలా చేయాలి?
ఇట్‌స్ రైనింగ్ డిస్కౌంట్స్ అని చెబుతూ, మీరు కోరుకున్న ప్రతీ ఉత్పత్తినీ మీ ఇంటి వద్దకే చేర్చే సౌకర్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. డీమార్ట్ యాప్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన వస్తువులు ఎంచుకుంటే సరిపోతుంది. మీరు ఎంచుకున్నవి తక్కువ ధరలో, అదీ ఇంటి ముంగిటే డెలివరీ అవుతాయి. మొదటి మూడు ఆర్డర్లకు డెలివరీ ఛార్జీలు కూడా లేవు. అంటే బయటకు వెళ్లి ట్రాఫిక్‌లో టైమ్ వృథా చేయాల్సిన అవసరం లేదు, వరుస క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు.
అందుబాటులో ఉన్న వస్తువులు ఇవే
డీమార్ట్‌లో అందుబాటులో ఉన్న వస్తువులు అన్నీ బ్రాండ్‌డ్ ప్రోడక్ట్స్‌నే. రెడ్ లేబుల్ టీ, సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్, దావత్ బాస్మతి రైస్, లైసాల్ క్లీనర్, అమూల్ బటర్ ఇలాంటివి అన్ని ఒకేచోట లభిస్తాయి. అదనంగా 50 శాతం వరకు డిస్కౌంట్లు కూడా దొరుకుతాయి. ఒకేసారి మీకు కావాల్సిన నిత్యా సరాలను కార్ట్‌లో వేసి ఆర్డర్ చేస్తే, డోర్‌స్టెప్ డెలివరీ ద్వారా మీరు సౌకర్యంగా పొందవచ్చు.
Also Read: JioMart Offer: జియోమార్ట్ బంపర్ ఆఫర్.. మొదటి ఆర్డర్‌కి రూ.100 తగ్గింపు!
డీమార్ట్ రెడీ యాప్ ఎలా వాడాలి?
డీమార్ట్ రెడీ యాప్ వాడటం కూడా చాలా ఈజీ. మీ ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, సర్చ్ బార్‌లో కావాల్సిన వస్తువు టైప్ చేస్తే సరిపోతుంది. పాత ఆర్డర్స్ కూడా హిస్టరీలో కనిపిస్తాయి. అంటే మీరు ముందు కొన్న వస్తువులను మళ్లీ ఆర్డర్ చేయడం చాలా సులభం అవుతుంది.
టైమ్, డబ్బు రెండూ సేవ్
ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ప్రతి వారం కొత్త కొత్త డిస్కౌంట్లు వస్తూనే ఉంటాయి. పండుగలు, స్పెషల్ డేస్ సమయంలో అదనపు ఆఫర్లు ఉంటాయి. దీంతో మీ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. బయట షాపింగ్‌కు వెళ్లి అదనపు ఖర్చు పెట్టే అవసరం లేకుండా, ఇంట్లోనే ఆఫర్ ధరలకు వస్తువులు అందుకోవడం ద్వారా మీరు టైమ్, డబ్బు రెండూ సేవ్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఉద్యోగస్తులు, బిజీగా ఉండే వారు, వృద్ధులు లేదా పిల్లలతో ఉన్న కుటుంబాలు వీరందరికీ ఈ సౌకర్యం చాలా ఉపయోగ ఉంటుంది. బయటకి వెళ్లే కష్టం లేకుండా అవసరమైనవి అన్నీ మీ తలుపు ముందే లభించడం వలన నిజంగా జీవితం చాలా ఈజీగా మారిపోతుంది. అందుకే ఇప్పుడు వర్షంలో తడుస్తూ బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, డీమార్ట్ రెడీ యాప్ ద్వారా మీకు కావాల్సిన ప్రతీ వస్తువు మీ ఇంటికే చేరుతుంది. ఇది కేవలం ఒక ఆన్‌లైన్ షాపింగ్ ఆప్షన్ మాత్రమే కాదు, మీ రోజువారీ జీవితంలో సమయం, డబ్బును ఆదా చేసే అద్భుతమైన పరిష్కారం.