Aashritha Daggubati: విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని, హేటర్స్ లేని ఏకైక హీరో అంటే వెంకటేష్ గురించే చెప్పుకొస్తారు. సినిమా, క్రికెట్ తప్ప వెంకీ మామ దేని గురించి ఆలోచించడుకూడా. అయితే మొట్ట మొదటిసారి వెంకీ మామ రాజకీయ ప్రచారంలో పాల్గొననున్నాడు. అందుకు కారణం ఆయన వియ్యంకుడు రఘురామ్ రెడ్డి.
వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. వెంకీ.. తన కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. బయట ఎక్కడా కూడా వాళ్లు కనిపించరు. ఇక ఆశ్రిత.. రఘురామ్ రెడ్డి కుమారుడు వినాయక్ రెడ్డిని వివాహమాడింది. పెళ్లి తరువాత వీరు విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆశ్రిత పెళ్లి తరువాత ఫుడ్ బ్లాగర్ గా మారింది. ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంది.
ఇక ఆశ్రిత మామగారు అయిన రఘురామ్ రెడ్డి కాంగ్రెస్ తరుపున ఎన్నికలో నిలబడగా.. ఆయన కోసం ఆమె కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం మొదలుపెట్టింది. ఖమ్మం పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో కాంగ్రెస్ కు ఓటువేసి రఘురామ్ రెడ్డిని గెలిపించమని ప్రజలను కోరింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మే 7 నుంచి ఈ ప్రచారంలో వెంకటేష్ కూడా పాల్గొననున్నాడు. వియ్యంకుడు కోసం వెంకీ మామ మొట్టమొదటిసారి రాజకీయ ప్రచారంలో పాల్గొంటున్నాడు. మరి ఈ తండ్రీకూతుళ్ల ప్రచారంతో రఘురామ్ రెడ్డి గెలుస్తాడో లేదో చూడాలి.
మామ గెలుపు కోసం వెంకీ కూతురు రంగంలోకి..
ఖమ్మం పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత. రఘురామిరెడ్డి గెలిస్తే.. నియోజకవర్గ అభివృద్ధికి ఏమేమి చేస్తారు అనే విషయాలు వివరించిన ఆశ్రిత.#khammam #congress… pic.twitter.com/iMBGaIQJGo
— BIG TV Breaking News (@bigtvtelugu) May 1, 2024