BigTV English

Myntra Fraud: ఈ కామర్స్ కంపెనీ ‘మింత్రా’ భారీ మోసం.. కేసు నమోదు చేసిన ED

Myntra Fraud: ఈ కామర్స్ కంపెనీ ‘మింత్రా’ భారీ మోసం.. కేసు నమోదు చేసిన ED

విదేశీ ఈ కామర్స్ కంపెనీలు భారత ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నాయనడానికి తాజా ఉదాహరణ ఇది. భారత్ లో కోట్లాదిమంది కస్టమర్లను కలిగి ఉన్న ఈ కామర్స్ దిగ్గజం మింత్రా చేసిన మోసం ఇది. అయితే ఈ కంపెనీ కస్టమర్లను ఎక్కడా మోసం చేయలేదు కానీ ప్రభుత్వాన్ని ఏమార్చింది. నిబంధనలు ఉల్లంఘించింది. అడ్డగోలుగా విదేశాలనుంచి 1,654 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో తెచ్చుకుంది. ఈ మోసంపై తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పందించింది. ఫారిన్ ఎక్స్ ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఫెమా-1999) ప్రకారం కేసు నమోదు చేసింది.


మోసం ఎలా జరిగింది..?
ఫెమా చట్టం ప్రకారం భారత్ లో రిటైల్ వ్యాపారాలు చేసేవారికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) సేకరించే విషయంలో కొన్ని నిబంధనలున్నాయి. అయితే హోల్ సేల్ వ్యాపారం చేసే వారికి మాత్రం FDIలపై వెసులుబాట్లు ఉన్నాయి. మింత్రా ఈ నిబంధనని చాలా తెలివిగా వాడుకుంది. ఫ్లిప్ కార్ట్ యాజమాన్యానికి చెందిన కంపెనీ మింత్రా. ఈ కంపెనీ భారత్ లో హోల్ సేల్ క్యాష్ & క్యారీ వ్యాపారం కోసం రిజిస్టర్ చేసుకుంది. అంటే వీళ్లు నేరుగా కస్టమర్లకు వస్తువుల్ని విక్రయించకూడదు. హోల్ సేల్ గా మాత్రమే విక్రయాలు జరపాలి. ఈ నిబంధనని పాటిస్తున్నట్టుగా ఇంతకాలం ప్రభుత్వాన్ని నమ్మించింది మింత్రా.

అంతా మోసం..
మనకు తెలిసినంత వరకు భారత్ లో మింత్రా డైరెక్ట్ గా కస్టమర్లకు వస్తువుల్ని విక్రయిస్తోంది. వాస్తవానికి ఆ కంపెనీ కస్టమర్లతో డీల్ పెట్టుకోకూడదు. హోల్ సేల్ వ్యాపారం మాత్రమే చేయాలి. అయితే ఇక్కడ మింత్ర ఓ తెలివైన పని చేసింది. వెక్టార్ ఈ కామర్స్ అనే సంస్థను తెరపైకి తెచ్చింది. ఈ సంస్థకు హోల్ సేల్ గా వస్తువుల్ని మింత్రా విక్రయిస్తుంది. సదరు వెక్టార్ ఈ కామర్స్ సంస్థ నేరుగా కస్టమర్లకు వాటిని విక్రయిస్తుంది. తాము వెక్టార్ ఈ కామర్స్ కి హోల్ సేల్ గా వస్తువుల్ని క్యాష్ అండ్ క్యారీ పద్ధతుల్లో విక్రయిస్తున్నాం కాబట్టి తాము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెచ్చుకున్నామంటోంది మింత్రా. కానీ ఇక్కడో చిన్న మతలబు ఉంది. వెక్టార్ ఈ కామర్స్ అనే సంస్థ కూడా మింత్రా యాజమాన్యానికి చెందినదే కావడం గమనార్హం.


నిబంధనల ఉల్లంఘన..
ఫెమా నిబంధనల ప్రకారం ఒకే యాజమాన్యంకి చెందిన సంస్థల మధ్య 25 శాతానికి మించి బిజినెస్ లావాదేవీలు జరగకూడదు. కానీ మింత్రా తన వ్యాపారాన్నంతా వెక్టార్ ఈ కామర్స్ ద్వారానే నిర్వహిస్తోంది. ఇది తీవ్రమైన ఉల్లంఘన. ఉల్లంఘనే కాదు.. మోసం కూడా. ఈ మోసం చేసిన మింత్రాపై ఇప్పుడు కేసు పెట్టింది ఈడీ. మొత్తంగా రూ. 1654 కోట్లు విదేశీలనుంచి ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో సేకరించినట్టు తేలింది. అయితే తామింకా ఫిర్యాదు కాపీ అందుకోలేదని మింత్రా ఈ వ్యవహారాన్ని దాటవేస్తోంది. ఈడీకి పూర్తి సహకారం అందిస్తామని మాత్రం తెలిపింది.

ఏం జరుగుతుంది..?
నిబంధనల్లోని లొసుగుల్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏమార్చిన మింత్రా మోసం ఎట్టకేలకు బట్టబయలైంది. ఇప్పటి వరకు సేకరించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఫెమా నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతోంది. మింత్రాపై భారీ పెనాల్టీ విధించే అవకాశముందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ కేసు బయటకు రావడంతో మింత్రా కార్యకలాపాలపై కూడా ప్రభావం పడుతున్నట్టు తెలుస్తోంది.

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×